By Village Missionary Movement
Tuesday, 14-Jan-2025దిన ధ్యానము(Telugu) 14.01.2025
అంశం: సరిదిద్దుట
"నీవు నడచు మార్గమును సరాళము చేయుము అప్పుడు నీ మార్గములన్నియు స్థిరములగును" - సామెతలు 4:26
లెవ్ వాలెస్ అమెరికా నుండి వచ్చినవాడు. యేసుక్రీస్తు ఎప్పుడూ జీవించలేదని రాయడానికి ధైర్యం చేశాడు. దీనికి తగిన సాక్ష్యాలను సేకరించడానికి అతను తన సంపదను చాలా వాడివేశాడు. అందుకు అనుగుణంగా పుస్తకాన్ని రాయడం ప్రారంభించాడు. కానీ అతడు కొన్ని పంక్తులు మాత్రమే రాయగలిగాడు, ఎందుకంటే అతనికి లభించిన సాక్ష్యాలు యేసుక్రీస్తు జన్మించాడని, జీవించాడని, అద్భుతములు చేసాడని, సిలువపై మరణించాడని, మూడవ రోజున మరణమునుండి లేచాడని స్పష్టంగా చూపించాయి.
అతడు పశ్చాత్తాపపడి, యేసుక్రీస్తు మానవాళిని రక్షించుటకు మనుష్యునిగా జన్మించి పవిత్రమైన పాపరహిత జీవితమును గడిపాడని ప్రపంచానికి తెలియజేయడానికి బెన్-హూర్ అనే అద్భుతమైన పుస్తకాన్ని రాశాడు. ఆ పుస్తకం తర్వాత నాలుగు సినిమాలుగా రూపొందించబడింది మరియు ప్రసిద్ధి చెందింది. దేవుడు లెవ్ వాలెస్ జీవితంలో సరిచేయవలసిన విషయాలను సరిచేసిన ఫలితంగా ఈ గొప్ప పని జరిగింది.
అలాగే, కొత్త నిబంధనలో, అపవిత్రాత్మ కలిగిన మనిషి గురించి వ్రాయబడింది. అతని నివాసం శ్మశానాల్లోనే ఉండేది. అతని జీవితం చీకటిగానే ఉండి, అతడు తనను తాను హాని చేసుకుంటూ ఉండేవాడు. ఈ సందర్భంలో, యేసును దూరం నుండి చూసి, పరుగెత్తి ఆయనను ఆరాధించాడు. యేసు ఆ మనిషిలోని అపవిత్రాత్మలను త్రోసివేశాడు. ఆ మనిషి విముక్తుడైన తర్వాత, యేసు తనకెంత మేలు చేసాడో ప్రజలందరికీ ప్రకటించాడు.
ప్రియమైన పాఠకులారా! దేవుడు యేసు నజరేయుడైన సత్యదేవుడని రాయటానికి సిద్ధమైన వ్యక్తి జీవితాన్ని సరిచేశాడు. యేసు, దూరంగా ఉన్న కుష్టి రోగులను శుద్ధి చేసి, వారిని ప్రఖ్యాతులను చేశాడు. మన జీవితాలను సరిచేసిన యేసు కోసం మనం ఈ రోజు ఏమి చేస్తున్నాము? కొంతసేపు ఆలోచిద్దాం! ఆయన చివరి రక్తబొట్టు ఎందుకు చిందించాడు? నిన్ను, నన్ను సరిచేయడానికి! యేసు రక్తం ద్వారా విమోచించబడిన మనము, యేసు నుండి దూరంగా ఉన్నవారిని ఆయనవద్దకు చేర్చడానికి కృషి చేద్దాం. దేవుడు మన ద్వారా గొప్ప కార్యములను చేయును.
- శ్రీమతి. శక్తి శంకరరాజ్ గారు
ప్రార్థన అంశం:
భారతదేశంలోని 15 రాష్ట్రాల్లో మిషనరీ కార్యాలయాలు ప్రారంభమయ్యేందుకు ప్రార్థించండి.
*Whatsapp*
ఈ దిన ధ్యాన సందశమును తమిళ్, ఇంగ్లీష్ , హిందీ, మలయాళం, తెలుగు, కన్నడ, పంజాబీ మరియు ఒరియా బాషలలో వాట్సాప్ త్వరా పొందుటకు *+91 94440 11864* అనే నెంబర్ ను సంబ్రదించగలరు.
www.vmm.org.in
ఈమెయిల్: info@vmm.org.in
Android App: https://play.google.com/store/apps/details?id=com.infobells.vmmorgin
విలేజ్ మిషనరీ మూమెంట్, విరుదునగర్, ఇండియా- 626001
ప్రార్ధనా అవసరాల కోసం: +91 94424 93250