Village Missionary Movement         கிராம மிஷனரி இயக்கம்

దిన ధ్యానము(Telugu) 09.05.2021 (Kids Special)
Share:

By Village Missionary Movement

Sunday, 09-May-2021

దిన ధ్యానము(Telugu) 09.05.2021 (Kids Special)

ప్రత్యేకంగా చిన్న పిల్లల కోసం:-

నీ వలన సాధ్యమే.

"... బలములేనివారికి సహాయము చేయుటకు నీకన్న ఎవరును లేరు" - 2దినవృత్తాంతములు 14: 11

కిష్టర్ అనైన పచ్చిక గల టీ తోటలో కొండ మీద ఐరిన్ యొక్క ఇల్లు ఉండేది. ఐరిన్ తాను మిక్కిలి బలహీనమైన దానిగా తలంచుతూ తరుచుగా ఏడుస్తుఉండేది. నాకు చేతులు నొప్పి, కాళ్ళు నొప్పి, కడుపు నొప్పి అని ఎప్పుడు ఏడుస్తూ ఉండేది. ఒక దినము ఐరిన్ యొక్క తల్లి టీ తోటలో పనికి వెళ్లారు అప్పుడు ఐరిన్ ఒక్కతే ఇంట్లో ఉన్నది. అమ్మకు ఎలాగైనా సహాయం చెయ్యాలి అని ఆలోచించి ఇంటిని ఊడ్చడం ప్రారంభించింది. ఆమె ఇంట్లో మూడు గదులు కలవు. రెండు గదులు ఊడ్చేసరికి చేతులు నొప్పి అని కూర్చుండుపోయింది. గిన్నెలు కడుగుతాను అని తీసి డమాల్ డిమాల్ అని క్రింద పడేసింది. ఆదే సమయంలో ఆమె అమ్మమ్మ వచ్చారు.

ఏంటి ఐరిన్ గిన్నెలు కడుగుతాను అని అన్నింటిని విరగగొట్టకు పని చెయ్యలేకపోతే విశ్రాంతి తీసుకో అన్నారు. ఐరిన్ ఆమె గదికి వెళ్లి ఏడ్చింది. నేను ఏ పని చెయ్యలేక పోతున్నాను నేను మిక్కిలి బలహీనంగా ఉన్నా నా వలన ఎవరికి ప్రయోజనం లేదే అని ఏడవడం ప్రారంబించింది. అప్పుడు గోడపైన ఉన్న ఒక సాలిపురుగు ఏడుస్తున్న ఐరిన్ ను చూసి మాట్లాడుతున్నట్లు కనిపించింది. నేను బలహీనమైన చిన్న పురుగుగా ఉన్నప్పటికీ నా గూడును నేనే కట్టుకొంటున్నాను. దేనికి చింత పడను. ఎంత పెద్ద భవనంలో ఉన్నప్పటకి అక్కడికి నేను వెళ్లి నా గూడును కట్టేస్తాను. నీవు కూడా నా వలె నిరిక్షణ కలిగి ఉండు. నీ వల్ల సమస్తము దేవుడు జరిపిస్తారు. నీవు సంతోషంగా జీవించడం నేర్చుకో అని సాలిపురుగు చెబుతున్నట్లు ఉండేది. 

ఐరిన్ వెంటనే ఆలోచనలో పడింది. సాలిపురుగు  కూడా సంతోషంగా తన పనిని చేస్తుందే నాకు కూడా బలమును ఇవ్వండి యేసయ్య అని ఈ సాలిపురుగు ద్వారా నాతో మాట్లాడినందుకు మీకు వందనములు అని చెప్పి ఇంటిని శుభ్రం చేయండం ప్రారంభించి అమ్మ ఉతికిన బట్టలు అన్నింటిని మడత పెట్టింది. ఆ పని చేసిన ఆమె కూడా నమ్మ లేకపోయింది, చేతులు నొప్పులు, కాళ్ళు నొప్పులు అన్ని పోయాయి. ఇంటికి వచ్చిన అమ్మ పనులన్నీ ఐరిన్ చేయుట చూసి చాలా సంతోషించారు. సాలిపురుగు దాని యొక్క వేళ్ళతో షేక్ హ్యాండ్ ఇచ్చినట్లు ఫీల్ అయింది ఐరిన్. నాకు మంచి పాఠం నేర్పించావు అని సాలిపురుగుకు థాంక్స్ చెప్పింది ఐరిన్.

ప్రియమైన పిల్లలు నేను కూడా బలహీనంగా ఉన్నాను, నా వలన ఏమి కాదు అని ఆలోచిస్తున్నారా? లేనే లేదు మీ యొక్క బలహీనతలు మార్చడానికి యేసయ్య ఉన్నారు. మీ వలన అవుతుందని నమ్మండి. యేసుక్రీస్తు ప్రభువు మీకు సహాయం చేయుటకు శక్తిమంతుడుగా ఉన్నారు. డోంట్ వర్రీ బి హ్యాపీ చిల్డ్రన్. 
-    శ్రీమతి. అన్బు జ్యోతి స్టాలిన్

ఈ దిన ధ్యానవాక్యం కొరకు ఈ క్రింద నoబర్లును సంప్రదించండి
వాట్సాప్ తమిళ్ కొరకు +91 94440 11864, 
ఇంగ్లీష్ కొరకు +91 86109 84002, 
హిందీ కొరకు +91 93858 10496
తెలుగు +91 94424 93250

ఈమెయిల్: reachvmm@gmail.com
Android App: https://play.google.com/store/apps/details?id=com.infobells.vmmorgin

విలేజ్ మిషనరీ మూమెంట్, విరుదునగర్, ఇండియా- 626001
ప్రార్ధనా అవసరాల కోసం: +91 94424 93250



hacklink satın al