Village Missionary Movement         கிராம மிஷனரி இயக்கம்

దిన ధ్యానము(Telugu) 11.01.2025
Share:

By Village Missionary Movement

Saturday, 11-Jan-2025

దిన ధ్యానము(Telugu) 11.01.2025

 

అంశం: ప్రపంచ రికార్డు

 

"నీకాయాసకరమైన మార్గము నాయందున్న దేమో చూడుము నిత్యమార్గమున నన్ను నడిపింపుము" - కీర్తనలు 139:24

 

2007 క్రీడా పోటీలలో, హుస్సేన్ బోల్ట్ కొన్ని క్షణాల ముందు పరిగెత్తడానికి ప్రయత్నించినందుకు డిస్‌క్వాలిఫై అయ్యాడు. ఆయన ఫలితాలు సాధించకపోయినా, ఇది అంతగా చెడ్డది కాదు. కానీ ఆయన డిస్‌క్వాలిఫై అయ్యాడనే బాధతో, తదుపరి పోటీలో బంగారు పతకం గెలవడం సరిపోదని, ప్రపంచ రికార్డు స్థాపించాలని దృఢంగా నిశ్చయించుకొని, తీవ్రమైన శిక్షణ చేశాడు. ఆయన వైద్యుడు, "ఇలా శిక్షణ కొనసాగిస్తే గుండెపోటుకు గురయ్యే అవకాశం ఉంది" అని హెచ్చరించాడు. అయినప్పటికీ, ఆ కఠినమైన శిక్షణ వల్లనే, ఆయన ఆ తరువాత పోటీలో ప్రపంచ రికార్డు నెలకొల్పాడు. చాలా సంవత్సరాలు ఆ రికార్డును ఎవరూ బద్దలు కొట్టలేకపోయారు. ఒక చిన్న తప్పు చేసినందుకు తిరస్కరింపబడిన వ్యక్తి కష్టపడి ప్రపంచ రికార్డు సాధించాడు.

 

బైబిల్లో, అందరూ యుద్ధ రంగంలో ఉన్నప్పుడు, దావీదు ఒంటరిగా ఉండగా తన కన్నుల భ్రమలో పడిపోయాడు. దేవుని సన్నిధిని అనుభవించలేకపోయాడు. అయినప్పటికీ, దేవుని సన్నిధి విడిచిపెట్టకుండా, దేవుని వద్దకు వెళ్లి ఆయనకు క్షమాపణ కోరుతూ మొరపెట్టుకున్నాడు. కీర్తన 51లో ఆయన చేసిన ప్రార్థనను మనం చూడవచ్చు. మరియు పదకొండవ వచనంలో, "నీ సన్నిధి నుండి నన్ను పారవేయకుము, నీ పరిశుద్ధాత్మ నన్ను విడువకుము" అని వేడుకుంటాడు. దావీదు తన పాపాన్ని అంగీకరిస్తూ, దేవుని కరుణ కోరుతాడు. "నా తల్లి గర్భం నుండి నేను పాపిగా పుట్టాను, మీరు పరిశుద్ధతను ప్రేమించేవారు, దయచేసి నన్ను పరిశుద్ధ పరచండి అని ఆయన కోరుతాడు.

 

దావీదు వలె మనం కూడా ఆయన వద్దకు వెళ్లి పాపాన్ని అంగీకరించి, ఆయన క్షమాపణను పొందాలి. ఆయన మన పాపాన్ని మనకు చూపిస్తాడు. ఆ పాపాన్ని అణిచిపెట్టకూడదు; ఆయన మనలను పరిశుద్ధ పరిచేందుకు ఆయన కాళ్లపట్టుకోవాలి.

 

దేవుని పిల్లలారా! ఈ ప్రపంచం మీరు చేసిన తప్పుల కారణంగా మిమ్మల్ని తిరస్కరించి ఉండవచ్చు. "ఇంతటితో నా జీవితం వృథా అయిపోయింది" అని మీరు బాధపడుతున్నారా? హుస్సేన్ బోల్ట్, తనకు ఎదురైన అవమానాన్ని గుర్తిస్తూ పరిగెత్తలేను అనుకుంటే, ప్రపంచ రికార్డును సాధించేవాడు కాదు. అదేవిధంగా, మనం మనుష్యులుగా పాపం చేయడం సహజం, కానీ అందులోనే నిలిచి ఉండకూడదు. దేవుడు పాపాన్ని ద్వేషిస్తాడు కానీ పాపులను ప్రేమిస్తాడు. కాబట్టి, మీరు పాపం చేయకూడదు. మీ పాపాన్ని అంగీకరించండి. ఆయన మీ అన్ని పాపాలను క్షమించి, మీకు నిత్యజీవం అందించగలడు.

- శ్రీమతి. తవమణి వైరవేల్ గారు

 

ప్రార్థన అంశం: 

ఆమెన్ విలేజ్ టీవీ, యూట్యూబ్ ద్వారా స్వస్థత ప్రార్థన కోరుకునే వారికీ దైవీయ స్వస్థత కోసం ప్రార్థించండి.

 

*Whatsapp*

ఈ దిన ధ్యాన సందశమును తమిళ్, ఇంగ్లీష్ , హిందీ, మలయాళం, తెలుగు, కన్నడ, పంజాబీ మరియు ఒరియా బాషలలో వాట్సాప్ త్వరా పొందుటకు *+91 94440 11864* అనే నెంబర్ ను సంబ్రదించగలరు.

 

www.vmm.org.in

ఈమెయిల్: info@vmm.org.in

Android App: https://play.google.com/store/apps/details?id=com.infobells.vmmorgin

 

విలేజ్ మిషనరీ మూమెంట్, విరుదునగర్, ఇండియా- 626001

ప్రార్ధనా అవసరాల కోసం: +91 94424 93250



hacklink satın al holiganbet giriş holiganbet casibom bets10 extrabet royalbet süperbetin casibom giriş casibom jojobet giriş casibom milanobet piabellacasino betpas bahiscasino atlasbet betpas casinoroyal bahiscasino ngsbahis betplay holiganbet jojobet casibom holiganbet jojobet casibom vaycasino romabet