Village Missionary Movement         கிராம மிஷனரி இயக்கம்

దిన ధ్యానము(Telugu) 06.01.2025
Share:

By Village Missionary Movement

Monday, 06-Jan-2025

దిన ధ్యానము(Telugu) 06.01.2025

 

అంశం: కృతజ్ఞత మంచిది

 

"ఆయన చేసిన ఉపకారములలో దేనిని మరువకుము" - కీర్తనలు 103:2

 

ఇశ్రాయేలు ప్రజలు దేవుడు చేసిన మంచి పనులను మరచి కృతజ్ఞత తెలపక దేవుని పైన సనగడం ప్రారంభించారు . వారి సనుగుల కారణంగా వారు కనాను దేశంలోకి ప్రవేశించలేదు, అరణ్యంలోనే నశించారు. మనం కూడా దేవుడు చేసిన మంచి పనులను మరచిపోతే మన హృదయాలలో అభ్యంతరాలు, సనుగులు కలుగుతాయి. అది మనలను పాపంలోకి నడిపిస్తుంది. దాంతో పరలోక రాజ్యంలో ప్రవేశించడం అసాధ్యం అవుతుంది. అందువల్ల దేవుడు చేసిన మంచిని జ్ఞాపకం ఉంచుకుంటూ కృతజ్ఞతతో జీవితం అంకితం చేసుకుందాం.

 

ఒక అనాథ బాలుడు తన తల్లిదండ్రులను కోల్పోయి ఆకలిని తీర్చుకోవడానికి భిక్షాటన చేయడం మొదలు పెట్టాడు. అతడు ఒక దుకాణం ముందు నిల్చొని "నాకు ఆకలిగా ఉంది, ఏదైనా ఇవ్వండి" అని అనేకమందిని అడిగాడు. ఎవరూ అతనికి తినడానికి సరిపడా డబ్బు ఇవ్వలేదు. ఒక వ్యక్తి ఆ బాలుడి పరిస్థితిని గమనించి అతడికి తినడానికి ఆహారాన్ని కొనివ్వగా, అతడు తృప్తిగా తిన్నాడు. ఆ బాలుడు ఆహారం ఇచ్చిన వ్యక్తి కోసం ఎదురు చూసి, అతడు వచ్చాక "ధన్యవాదాలు సార్" అన్నాడు. ఆ బాలుడి చర్య ఆహారం కొనిచ్చిన వ్యక్తిని ఆశ్చర్యపరిచింది. అతడు ఆ బాలుడిని క్రీస్తువద్దకు తీసుకువెళ్ళి సేవకుడిని చేశాడు. ఆ వ్యక్తి బ్రెజిలియన్ మిషనరీ మాక్స్ లుకాడో.

 

పదిమంది కుష్టు రోగులలో కేవలం ఒకడే కృతజ్ఞత చెప్పాడు. యేసు స్వస్థపరచిన పది కుష్టురోగులలో తొమ్మిది మంది కృతజ్ఞత తెలపడం మరచిపోయారు. ఇస్కారియోతు యూదా యేసు నుండి ఆధ్యాత్మిక, భౌతిక ఆశీర్వాదాలు పొందినప్పటికీ కృతజ్ఞత తెలపకపోవడంతో అతడు మోసగాడిగా మారాడు. ఈ లోకపు ఆశ అతడిని ఆకాశ ఆశీర్వాదాల నుండి దూరం చేసింది. కానీ పేతురు యేసు నుండి పొందిన మేలును జ్ఞాపకం చేసుకొని, తన కృతజ్ఞతను గుర్తించి కన్నీరు పెట్టుకొని పశ్చాత్తాపపడ్డాడు. యేసు పేతురును స్వీకరించాడు.

 

ఈ రోజు మనం కూడా కృతజ్ఞత మరచి, మన క్రియల ద్వారా యేసును నిరాకరించి ఉంటే, మన చర్యలను సరిచేసుకొని, యేసు ప్రేమతో చేసిన మేలులకు కృతజ్ఞత చూపుదాం. బాప్తిస్మమిచ్చు యోహాను చెప్పినట్లుగా (మత్తయి 3:8) పశ్చాత్తాపఫలాలను చూపుతూ, ఈ లోకంలోను, పరలోకంలోను నూరంతలు ఆశీర్వాదాలను పొందుదాం. ఆమేన్.

 

ప్రార్థన అంశం:

భారతదేశమంతా 1000 మంది మిషనరీలను సిద్ధం చేయమని ప్రార్థించండి.

 

*Whatsapp*

ఈ దిన ధ్యాన సందశమును తమిళ్, ఇంగ్లీష్ , హిందీ, మలయాళం, తెలుగు, కన్నడ, పంజాబీ మరియు ఒరియా బాషలలో వాట్సాప్ త్వరా పొందుటకు *+91 94440 11864* అనే నెంబర్ ను సంబ్రదించగలరు.

 

www.vmm.org.in

ఈమెయిల్: info@vmm.org.in

Android App: https://play.google.com/store/apps/details?id=com.infobells.vmmorgin

 

విలేజ్ మిషనరీ మూమెంట్, విరుదునగర్, ఇండియా- 626001

ప్రార్ధనా అవసరాల కోసం: +91 94424 93250



hacklink satın al holiganbet giriş holiganbet casibom bets10 extrabet royalbet süperbetin casibom giriş casibom jojobet giriş casibom milanobet piabellacasino betpas bahiscasino atlasbet betpas casinoroyal bahiscasino ngsbahis betplay holiganbet jojobet casibom holiganbet jojobet casibom vaycasino romabet