By Village Missionary Movement
Sunday, 05-Jan-2025దిన ధ్యానము(Telugu) 05.01.2025 (Kids Special)
ప్రత్యేకంగా చిన్న పిల్లల కొరకు
అంశం: "ధన్యవాదము, ధన్యవాదము!"
"చెప్పశక్యము కాని ఆయన వరమును గూర్చి దేవునికి స్తోత్రము" - 2 కోరింథీయులకు 9:15
హాయ్ పిల్లలూ! హ్యాపీ న్యూ ఇయర్! రోజులు ఎంత వేగంగా వెళ్ళిపోతున్నాయో చూశారా? 2024 సంవత్సరమంతా గడిచిపోయింది, కొత్త సంవత్సరం వచ్చింది! ఈరోజు మా సండే స్కూల్లో ఒక ప్రత్యేకమైన రోజు. మీకు తెలుసా ఏమిటో? గత సంవత్సరమంతా మనల్ని రక్షించినందుకు మరియు ఈ కొత్త సంవత్సరాన్ని చూడటానికి దీవించినందుకు మనం దేవునికి కృతజ్ఞతలు చెప్పబోతున్నాం. సరే, దానికి ముందు ఒక చిన్న కథ విందామా?
టాటా , సీ యూ, బై! స్కూల్ బస్సు వచ్చింది, దివ్యా తొందరగా పరుగెత్తింది. నానమ్మ అక్కడే నిలబడి బస్సు కనుమరుగయ్యే వరకు చేతులెత్తి వీడ్కోలు చెప్పింది. చిన్న వయసులోనే తల్లిదండ్రులను కోల్పోయిన దివ్యా, తన నానమ్మతో పెరిగింది. నానమ్మ ఎంతో ప్రేమగలది, కానీ కఠినమైన నియమాలతోనూ ఉంటారు. దివ్యాకు ప్రార్థన చేసే మంచి అలవాటు ఉండేది. ఉదయం లేవగానే, చదవడానికి ముందు, నిద్రపోయే ముందు గాఢంగా ప్రార్థించేది. ప్రతిభోజనం ముందు యేసయ్యకు కృతజ్ఞతలు చెప్పి ఆహారం తినేది. మరి మీరు? అమ్మ పూరి, కూర వండి పెట్టగానే తినేసేస్తారా?
దివ్యా ప్రతిదానికి కృతజ్ఞతలు చెప్పటాన్ని చూసి క్లాస్‌లో పిల్లలు ఆమెను ఆట పట్టించేవారు. అయినా, ఆమె "నేను పొందే అన్ని మంచి విషయాలు యేసు వల్లే." అని ధైర్యంగా చెప్పేది.
ఆ ఉదయం, నానమ్మ అనారోగ్యంతో ఉన్నా, దివ్యాకు భోజనం పెట్టేందుకు తక్షణం లేచి పని చేసారు. "నానమ్మ నాకు తినడానికి ఇబ్బంది పడకుండా భోజనం పెట్టిందని," ఆలోచిస్తూ దివ్యా యేసయ్యకు కృతజ్ఞతలు చెప్పింది. మధ్యాహ్న భోజన సమయంలో, దివ్యా తన డబ్బా తెరిచి ప్రార్థించి చూసింది. ఆహారంపై కాకి రెట్ట పడింది! పిల్లలు చుట్టూ చేరి ఎగతాళి చేసారు. "ఇదేనా నీ ప్రార్థనకు సమాధానం?"
ఇంతలో నానమ్మ పరుగెత్తుకుంటూ వచ్చారు. "దివ్యా, నువ్వు తిన్నావా? నేను కాసేపటి క్రితమే ఆహారంలో పూరి మీద పాము పడిపోయినట్లు గమనించాను," అని కన్నీరు పెట్టుకున్నారు. "లేదే నానమ్మ, యేసయ్య నన్ను రక్షించాడు. కాకి రెట్ట పడడంతో ఆహారం పారేసేశాను," అని దివ్యా చెప్పింది. "నా బిడ్డ, యేసయ్య నీకు అద్భుతమైన రక్షణ కల్పించాడు," అని నానమ్మ కన్నీళ్లతో దివ్యాను గట్టిగా కౌగిలించుకున్నారు. ఆ దృశ్యాన్ని చూసిన పిల్లలు తమ తప్పు తెలుసుకొని దివ్యాతో స్నేహితులుగా మారారు.
నా పిల్లలూ! గత సంవత్సరం మొత్తం యేసయ్య కంటికి రెప్పవలె మిమ్మును రక్షణ ఇచ్చాడు. ప్రమాదాల నుండి రక్షించాడు, వ్యాధుల్లో స్వస్థత ఇచ్చారు , మీ అవసరాలను తీర్చాడు, ఈ రోజు వరకు అద్భుతంగా జీవించనిచ్చాడు! మనం యేసయ్యకు కృతజ్ఞతలు చెప్పాలి. దివ్యా లాగే, మనం కూడా ప్రతిదానికి కృతజ్ఞతలు చెప్పడం మర్చిపోవద్దు. సరేనా!
- శ్రీమతి. జీవ విజయ గారు.
*Whatsapp*
ఈ దిన ధ్యాన సందశమును తమిళ్, ఇంగ్లీష్ , హిందీ, మలయాళం, తెలుగు, కన్నడ, పంజాబీ మరియు ఒరియా బాషలలో వాట్సాప్ త్వరా పొందుటకు *+91 94440 11864* అనే నెంబర్ ను సంబ్రదించగలరు.
www.vmm.org.in
ఈమెయిల్: info@vmm.org.in
Android App: https://play.google.com/store/apps/details?id=com.infobells.vmmorgin
విలేజ్ మిషనరీ మూమెంట్, విరుదునగర్, ఇండియా- 626001
ప్రార్ధనా అవసరాల కోసం: +91 94424 93250