By Village Missionary Movement
Saturday, 04-Jan-2025దిన ధ్యానము(Telugu) 04.01.2025
అంశం: అద్భుతం కావాలా?
"...ఆయన యెహోవా బలిపీఠాన్ని బాగుచేసెను" - 1 రాజులు 18:30
పాస్టర్ పౌల్ యోంగ్గి చో తన సేవ పరిచర్య ప్రారంభ దశలో, ఒక ఆదివారం సేవలో దేవుని నడిపింపును, మరియు ప్రసన్నతను అనుభవించలేక విఫలమైన అనుభూతి పొందారు. ఆ సమయంలో పాటలు, ఆరాధన, సాక్ష్యాలు, సందేశం అన్నీ రుచిలేని వంటివిగా అనిపించాయి. పాస్టర్ ఒంటరిగా మిగిలాడు. ఆరాదన ముగిశాక అందరూ వెళ్ళిపోయారు. కానీ పాస్టర్ ఇంటికి వెళ్లాలనుకోలేదు; ఆయన గుడిలోనే ఉండిపోయాడు.
తరువాత, వెన్ను వంగి ఉన్న ఒక మనిషి ప్రార్థన కోసం పాస్టర్ వద్దకు వచ్చాడు. పాస్టర్ ప్రార్థించే మానసిక స్థితిలో లేరు. అయినప్పటికీ, పాపం క్షమించమని ప్రార్థించారు. ఏ మార్పూ చూడలేక, ఆయన మరింత నిస్పృహకు లోనయ్యాడు. పాస్టర్ యెహోవా బలిపీఠం వద్దకి వెళ్లి, ఆత్మమహిమలో తనను వినయంగా అప్పగించి కన్నీళ్లతో ప్రార్థించాడు. అంతే, పవిత్రాత్మ శక్తితో ఆయనను నింపింది.
అదే సమయంలో, వెన్ను వంగి ఉన్న వ్యక్తి నేరుగా నిలుచున్నాడు, సంపూర్ణ స్వస్థత పొందాడు. గుడిలో దాగి ఉన్న ముగ్గురు దొంగలు ఈ అద్భుతాన్ని చూశారు. వారు భయపడినారు, మరియు తమ ప్రాణాలను ప్రభువుకు అప్పగించారు.
సత్యమేమిటంటే, పాస్టర్ తన గుండెను యెహోవా బలిపీఠం వద్ద చిత్తశుద్ధితో అప్పగించినప్పుడు, అద్భుతాలు సంభవించాయి.
అదే విధంగా, బైబిల్లో, 1 రాజులు 18లో, ఎలీయా యెహోవా బలిపీఠాన్ని మరలా కట్టాడు. దాని తరువాత, ఆకాశం నుండి అగ్ని వచ్చి అద్భుతం చేసింది. అది చూసిన జనాలు, “యెహోవా దేవుడు, యెహోవా దేవుడు” అని గొంతెత్తి కీర్తించారు. ఆ జాతి ప్రభువుని ప్రణమిల్లింది.
అవును, ప్రియులారా! మన జీవితంలో ఉన్న లోపాలు – ప్రార్థన జీవితం, వేద గ్రంథ పఠనం, దేవునితో సంబంధం – బాగుచేసినప్పుడు, దేవుడు తప్పకుండా అద్భుతం చేయును. ఆ అద్భుతం ద్వారా అన్యులు యెహోవా దేవుడని గ్రహిస్తారు. ఎలీయా, పాస్టర్ పౌల్ యోంగ్గి చోతో అద్భుతాలు చేసిన యెహోవా మీతో కూడా చేయగలడు. ఆమేన్!
- బ్రదర్. శివ పలన్న స్వామి గారు
ప్రార్థనా అంశం:
అరైజ్ జోషువా & ఎస్తేర్ ప్రాజెక్టు ద్వారా గూగుల్ మీట్ ప్రార్థన కోసం ప్రార్థించండి.
*Whatsapp*
ఈ దిన ధ్యాన సందశమును తమిళ్, ఇంగ్లీష్ , హిందీ, మలయాళం, తెలుగు, కన్నడ, పంజాబీ మరియు ఒరియా బాషలలో వాట్సాప్ త్వరా పొందుటకు *+91 94440 11864* అనే నెంబర్ ను సంబ్రదించగలరు.
www.vmm.org.in
ఈమెయిల్: info@vmm.org.in
Android App: https://play.google.com/store/apps/details?id=com.infobells.vmmorgin
విలేజ్ మిషనరీ మూమెంట్, విరుదునగర్, ఇండియా- 626001
ప్రార్ధనా అవసరాల కోసం: +91 94424 93250