Village Missionary Movement         கிராம மிஷனரி இயக்கம்

దిన ధ్యానము(Telugu) 29.12.2024 (Kids Special)
Share:

By Village Missionary Movement

Sunday, 29-Dec-2024

దిన ధ్యానము(Telugu) 29.12.2024 (Kids Special)

 

ప్రత్యేకముగా చిన్న పిల్లల కొరకు 

 

అంశం: బాలా మరియు గుర్రం

 

"నిశ్చయముగా ముందు గతి రానే వచ్చును నీ ఆశ భంగము కానేరదు" - సామెతలు 23:18

 

బాలా తల్లిదండ్రులకి ఏకైక కుమారుడిగా పుట్టాడు. ఆయన తండ్రి చాలా దూరంలో పనిచేసేవారు, సంవత్సరానికి ఒక్కసారే ఇంటికి వచ్చేవారు. ప్రతి సారి వచ్చినప్పుడు ఆయనకు కావలసిన అన్ని వస్తువులు తీసుకువచ్చేవారు. తండ్రి వచ్చినప్పుడే ఆయనకు పండగ.

 

బాల్య దశ దాటి, బాలా పెద్దవాడయ్యాడు. అతని వయసులో ఉన్న యువకులందరికీ గుర్రాలు ఉండేవి. అవి వారి గర్వానికి కారణంగా ఉండేవి. బాలాకు కూడా గుర్రం కలిగి ఉండాలని కోరిక కలిగింది. తండ్రికి సందేశం పంపించాడు. తండ్రి త్వరగా గుర్రం కొని ఇస్తారని ఆశతో ఎదురు చూసేవాడు.

 

ఒక రోజు, తండ్రి సన్నిహిత మిత్రుడు గుర్రం పైకి ఎక్కి, బాలా ఇంటికి వచ్చాడు. వెంటనే బాలా ఆనందంతో, "వావ్! నా తండ్రి నాకు గుర్రం కొని పంపించాడు" అని అనుకున్నాడు. అతను, "నీవు ఒక నెలపాటు నా దగ్గర ఉండాలి" అని చెప్పాడు. బాలాకు ఇది సరదాగా అనిపించి అతనితో వెళ్లిపోయాడు.

 

అతను బాలాను పెద్ద ప్రదేశానికి తీసుకెళ్ళి, పరుగెత్తమని చెప్పాడు. ఆ తర్వాత, "గుర్రంతో పరుగెత్తు" అని చెప్పాడు. బాలా ఏమాత్రం అర్థం కాకుండా, ఓ వారం పాటు ఇలా చేశాడు. అతనికి ఎముకలు విరిగినప్పుడు మందు మిశ్రమం ఎలా తయారు చేయాలి, కండరాల నొప్పి ఎలా తగ్గించాలి, విషసర్పం కాటుతో ఏం చేయాలి, ఇవన్నీ నేర్పించాడు. బాలా కోపంతో ఊగిపోయాడు. కానీ గుర్రం కోసం అతను అనుభవించాడు.

 

మరుసటి ఉదయం, అతను బాలాను ఖాళీచేతులతో ఇంటికి పంపాడు. తీవ్ర నిరాశతో బాలా ఇంటికి తిరిగొచ్చాడు. అప్పటి నుండి అతనికి నిద్ర సరిగ్గా పట్టలేదు.

 

కొన్ని రోజుల తర్వాత, గుర్రం అరుపు వినిపించగానే బాలా నిద్రలేచి బయటకు వచ్చాడు. అతనికి ఆశ్చర్యం ఆపలేనిదిగా మారింది. అక్కడ, అతని తండ్రి పొడవైన తెల్లని అరేబియన్ గుర్రంతో నిలబడి ఉన్నాడు. బాలా పరుగెత్తి తన తండ్రిని కౌగిలించుకున్నాడు . "నాకు ఇది వెంటనే ఎందుకు తీసుకురాలేదు? ఎందుకు ఆలస్యం చేసి నన్ను బాధించావు?" అని అడిగాడు.

 

తండ్రి ఇలా సమాధానమిచ్చాడు, "నువ్వు సాదారణ గుర్రం కోసం అడిగావు, కానీ నేను నీకు అత్యుత్తమమైన గుర్రాన్ని కొనాలనుకున్నాను. అందుకే నేను నా స్నేహితుడిని పంపి, ముందు నీకు శిక్షణ ఇప్పించాను. ఇప్పుడు ఈ గుర్రాన్ని నేను నీకు ఇస్తే, నీవు దానిని స్వయంగా నడిపించగలవు. ఈ ఆలస్యం నీ కోసమే."

 

ప్రియమైన సోదరులారా మరియు సోదరీమణులారా!

బాలా వంటి మనం కూడా ఏదైనా అడగగానే వెంటనే దొరకాలని ఆశపడతాము. కానీ యేసు మనకు ఏమి ఇవ్వాలో, ఎప్పుడు ఇవ్వాలో అర్థం చేసుకొని సరైన సమయంలో మనకు అందిస్తాడు. మనం అంతవరకు వేచి ఉండాలి. సరేనా?

- శ్రీమతి. సారా సుభాష్ గారు.

 

*Whatsapp*

ఈ దిన ధ్యాన సందశమును తమిళ్, ఇంగ్లీష్ , హిందీ, మలయాళం, తెలుగు, కన్నడ, పంజాబీ మరియు ఒరియా బాషలలో వాట్సాప్ త్వరా పొందుటకు *+91 94440 11864* అనే నెంబర్ ను సంబ్రదించగలరు.

 

www.vmm.org.in

ఈమెయిల్: info@vmm.org.in

Android App: https://play.google.com/store/apps/details?id=com.infobells.vmmorgin

 

విలేజ్ మిషనరీ మూమెంట్, విరుదునగర్, ఇండియా- 626001

ప్రార్ధనా అవసరాల కోసం: +91 94424 93250



hacklink satın al holiganbet jojobet jojobet matbet egebet giriş egebet matbet matbet giriş imajbet imajbet giriş perabet perabet giriş coinbar coinbar giriş klasbahis klasbahis giriş coinbar coinbar giriş restbet giriş restbet egebet güncel giriş egebet coinbar giriş coinbar interbahis interbahis giriş mariobet mariobet giriş klasbahis güncel giriş klasbahis artemisbet artemisbet giriş klasbahis giriş klasbahis restbet restbet giriş egebet egebet giriş superbetin superbetin giriş perabet perabet giriş grandpashabet grandpashabet giriş grandpashabet güncel giriş grandpashabet grandpashabet giriş grandpashabet giriş güncel jojobet jojobet giriş holiganbet holiganbet giriş casibom casibom giriş jojobet jojobet giriş alobet alobet giriş marsbahis marsbahis giriş perabet perabet giriş meritking meritking giriş meritking meritking giriş matbet matbet giriş superbetin superbetin giriş kingroyal kingroyal giriş kralbet kralbet giriş jasminbet jasminbet giriş ikimisli ikimisli giriş meritbet meritbet giriş sekabet sekabet giriş casibom casibom giriş kingroyal kingroyal giriş jojobet jojobet jojobet holiganbet holiganbet holiganbet grandpashabet grandpashabet grandpashabet cratosroyalbet amkbet wbahis esbet Sonbahis Sonbahis Sonbahis giriş Sonbahis giriş perabet perabet giriş casibom casibom giriş jojobet jojobet giriş