By Village Missionary Movement
Friday, 27-Dec-2024దిన ధ్యానము(Telugu) 27.12.2024
అంశం: “కృతజ్ఞులై ఉండుడి”
"క్రీస్తు అనుగ్రహించు సమాధానము మీ హృదయములలో ఏలుచుండనియ్యుడి; ఇందుకొరకే మీరొక్క శరీరముగా పిలువబడితిరి; మరియు కృతజ్ఞులై యుండుడి" - కొలస్సీయులకు 3:15
వియత్నాం యుద్ధంలో ఒక సైనికాధికారి, తన పక్షాన పనిచేస్తున్న ఒక సామాన్య సైనికుడిని రక్షించడానికి ప్రయత్నించి, తాను గాయపడి, అక్కడికక్కడే మరణించాడు. ఈ విషయాన్ని అతని తల్లిదండ్రులకు తెలియజేశారు. వారు ఆయన జ్ఞాపకార్థం ఒక సమావేశం ఏర్పాటు చేశారు. ఆ సమయంలో, ఆ అధికారి త్యాగం ద్వారా ప్రాణాపాయం నుండి తప్పించుకున్న సైనికుడిని కూడా ఆహ్వానించారు. అయితే, అతడు ఆలస్యంగా రావడమే కాకుండా పూర్తిగా మద్యం మత్తులో ఉన్నాడు. అక్కడ ఆయన అసభ్యంగా ఆహారం తిన్నాడు. కానీ, అతని ప్రాణాన్ని రక్షించిన ఆ అధికారి త్యాగానికి గానూ కృతజ్ఞత కూడా చెప్పలేదు. అంతే కాకుండా, ఆహారం తిన్నాక తనను ఆహ్వానించిన కుటుంబానికి ధన్యవాదాలు చెప్పకుండానే వెళ్లిపోయాడు. అతను వెళ్లిన వెంటనే, ఆ అధికారి తల్లి విలపిస్తూ చెప్పింది, “నా కుమారుడు ఈ కృతజ్ఞత లేని వ్యక్తి కోసం తన ప్రాణాన్ని ఇచ్చాడా?”
యేసు ఒక గ్రామంలోకి ప్రవేశించినప్పుడు, పదిమంది కుష్టురోగులు దూరంగా నిలబడి, “యేసూ, ప్రభూ, మాకు కృప చూపించు” అని గొంతెత్తి ప్రార్థన చేశారు. వారందరూ స్వస్థత పొందారు. కానీ వారిలో ఒకడే వచ్చి ఆయన పాదాల యొద్ద పడి, కృతజ్ఞత తెలియజేశాడు. అప్పుడే యేసు అడిగాడు, “స్వస్థత పొందినవారు పదిమంది కాదా? మరి మిగిలిన తొమ్మిది మంది ఎక్కడ?”
అవును, నా మిత్రులారా! ప్రభువు మనకు చేసిన మంచికి ఏదైనా ప్రతిఫలం ఆశించడు. కానీ మనం మనకు మంచిగా వేషించినవారికి కృతజ్ఞత తెలుపుతాం. అదే ప్రభువుకు కృతజ్ఞతలు చెప్పడం మరిచిపోతాము. ఇది కొంచెం ఆలోచిద్దాం. మన జీవితంలో ఎన్నో కన్నీటి లోయలు, జారిపోయే మార్గాలు, మర్చిపోయిన పరిస్థితులు, ఒంటరి పయనాలు, వ్యాధి సమయాలు, “ఇదే అంతం, ఇకపై ఏమీ ఉండదు” అని అనుకున్న క్షణాలు అందులో కూడా మనతో ఉన్న యేసుకు కృతజ్ఞత చెప్పడం ఒక్క క్షణం కూడా మరిచిపోకూడదు. మనకు జీవితాన్ని ఇంతవరకు రక్షించి, అనేక లోపాలు ఉన్నప్పటికీ మనల్ని కాపాడినందుకు ఆయనకు ఎంతటి కృతజ్ఞత తెలపాలో ఆలోచిద్దాం.
- శ్రీ. శంకర్ రాజ్ గారు
ప్రార్థన అంశం:
ప్రతి జిల్లా లో ట్యూషన్ సెంటర్ల ప్రారంభం కోసం ప్రార్థించండి.
*Whatsapp*
ఈ దిన ధ్యాన సందశమును తమిళ్, ఇంగ్లీష్ , హిందీ, మలయాళం, తెలుగు, కన్నడ, పంజాబీ మరియు ఒరియా బాషలలో వాట్సాప్ త్వరా పొందుటకు *+91 94440 11864* అనే నెంబర్ ను సంబ్రదించగలరు.
www.vmm.org.in
ఈమెయిల్: info@vmm.org.in
Android App: https://play.google.com/store/apps/details?id=com.infobells.vmmorgin
విలేజ్ మిషనరీ మూమెంట్, విరుదునగర్, ఇండియా- 626001
ప్రార్ధనా అవసరాల కోసం: +91 94424 93250