By Village Missionary Movement
Wednesday, 18-Dec-2024దిన ధ్యానము(Telugu) 18.12.2024
అంశం: రక్షణ దుర్గము
"పక్షి తప్పించుకొనినట్లు మన ప్రాణము వేటకాండ్ర ఉరి నుండి తప్పించుకొని యున్నది ఉరి తెంపబడెను మనము తప్పించుకొని యున్నాము" - కీర్తనలు 124:7
నీటిలో కొట్టుకొంటూ పోతున్న ఒక చీమ కష్టపడుతూ ఒడ్డుకు రాకుండా అల్లాడుతోంది. ఓ పావురం దానిని గమనించి చెట్టు పైనుండి నీటిలోనికి ఆకును వేసింది, అందులోకి ఎక్కి చీమ రక్షింపబడింది. అదే చీమ, పావురాన్ని వేటాడుతున్న వేటగాడి కాళ్ళను కరిచింది. వేటగాడి కేకలతో పావురం పారిపోయి తనను తాను రక్షించుకొనింది. క్షణాల్లోనే పావురం మరియు చీమ రెండూ రక్షింపబడ్డాయి. ఇది నేను పాఠశాలలో నేర్చుకున్న చిన్న కథ.
ఈ సంవత్సరపు చివరి నెలలో ఉన్న మనం వెనక్కి తిరిగి మనం నడిచి వచ్చిన మార్గాన్ని చూసినప్పుడు, మన జీవిత ప్రయాణంలో వ్యాధి, వైఫల్యాలు, నష్టాలలోనూ దేవుడు మనలను వదిలిపెట్టలేదు. మరణ అంచులకు వెళ్లిన వారిని రక్షించిన శిలగా దేవుడు ఎంతోమందికి నిలిచాడు!
బైబిలు మొదటినుండీ మనకు బోధించేది దేవున్ని పిలిచినవారిని ఆయన రక్షిస్తాడు అనేది సత్యం. 1 సమూయేలు 23:26 ప్రకారం, సౌలుకు చేసిన మంచిపనులన్నీ ఉన్నప్పటికీ సౌలు దావీదును చంపుటకు ప్రయత్నించాడు. జిపీయులు కూడా సౌలుతో కలిసి దావీదును పట్టించేందుకు సహాయం చేస్తామని చెప్పారు. మావోను అరణ్యంలో సౌలు సైన్యం దావీదును చుట్టుముట్టింది. తొలిసారి బైబిలు చదివినవారికి ఇది దావీదు జీవితానికి ముగింపు అనిపిస్తుంది. కానీ దేవుడు ప్రతి సారి దావీదును రక్షించాడు. ఆ రక్షణకు కృతజ్ఞతగా దావీదు ఆ స్థలానికి "సెలా హమ్మహ్లెకోత్" (రక్షణ శిల) అని పేరు పెట్టాడు.
దావీదు తన కీర్తనల్లో దేవునిని నా సెలా, నా కోట, నా ఆశ్రయకోట అని ఎందుకు స్తుతిస్తాడు? ఎందుకంటే ఆయన ఇచ్చే రక్షణను అనుభవించి తెలుసుకున్నాడు!
మనం కూడా దేవునికి కృతజ్ఞతలు చెప్పుదాం. ఈ పదకొండు నెలల కాలంలో మనలను కంటికి రెప్పవలె కాపాడిన దేవునికి స్తుతి చేద్దాం. మనకు తెలియకుండానే ఎన్నో ప్రమాదాలనుండి ఆయన మనలను రక్షించారు. ఆయన తన దూతలను మన రక్షణ కొరకు నియమించి, మన పాదములకు రాయి తగలకుండా చూసుకుంటాడు. మన ప్రాణాన్ని నాశనమునుండి విడిపించును. అవును, ఆయనే మన రక్షణ దుర్గము!
దేవుడు దావీదుకు మాత్రమే కాక మనకు కూడా రక్షణ దుర్గం!
- సహోదరి. మంజుల గారు
ప్రార్థన అంశం:
ఆహార పంపిణి కార్యక్రమం ద్వారా లాభపడిన వారు యేసును స్వీకరించేలా ప్రార్థించండి.
*Whatsapp*
ఈ దిన ధ్యాన సందశమును తమిళ్, ఇంగ్లీష్ , హిందీ, మలయాళం, తెలుగు, కన్నడ, పంజాబీ మరియు ఒరియా బాషలలో వాట్సాప్ త్వరా పొందుటకు *+91 94440 11864* అనే నెంబర్ ను సంబ్రదించగలరు.
www.vmm.org.in
ఈమెయిల్: info@vmm.org.in
Android App: https://play.google.com/store/apps/details?id=com.infobells.vmmorgin
విలేజ్ మిషనరీ మూమెంట్, విరుదునగర్, ఇండియా- 626001
ప్రార్ధనా అవసరాల కోసం: +91 94424 93250