Village Missionary Movement         கிராம மிஷனரி இயக்கம்

దిన ధ్యానము(Telugu) 05.12.2024
Share:

By Village Missionary Movement

Thursday, 05-Dec-2024

దిన ధ్యానము(Telugu) 05.12.2024

 

అంశం: ప్రభువునకొరకు నిలబడండి

 

"...ఆడసింహము దారిలో అతనిని చంపెను;... గాడిద మృతదేహము దగ్గర నిలుచునుండెను. ఆడసింహము కూడ మృతదేహముతోనే నిలుచునుండెను" - 1 రాజులు 13:24

 

1 రాజులు 13:1-32 వచనాలలో, మనము దేవుడు ఎలా ఉంటాడో, ప్రవచనం ఎలా ఉండేదో, ప్రవక్త ఎలా ఉండేవాడో, అతనికి సహాయపడిన గాడిద ఎలా ఉందో గమనించాలి. రాజు తనపై వచ్చిన ప్రవచనం వినగానే, కోపగించి, ప్రవక్తపై చేయి చాపి, "అతనిని పట్టుకోండి" అన్నాడు. వెంటనే రాజు చేయి ఇరుకుగా అయ్యి, పైకి లేవలేకపోయింది. వెంటనే ప్రవక్తను వేడుకున్నాడు. ప్రవక్త దేవునికి ప్రార్థించగానే, అతని చేయి తిరిగి ముందున్న స్థితికి వచ్చింది. దానిని చూసిన రాజు, "నా ఇంటికి రా, నీకు బహుమానం ఇస్తాను" అన్నాడు. కానీ జాగ్రత్తగా ఉండవలసిన ప్రవక్త, దేవుడు తనతో రహస్యంగా చెప్పినది రాజుతో చెప్పాడు. (1 రాజులు 13:8-9)

 

వెంటనే, ఆ పట్టణంలో ఉన్న వృద్ధ ప్రవక్త, అతని మార్గాన్ని అడ్డగించి, "దేవుడు నీకు మా ఇంట్లో రొట్టె తినమని చెప్పాడు" అన్నాడు. ఆ ప్రవక్త దేవుడు చెప్పిన మాటలో నిలబడకుండా, వృద్ధ ప్రవక్త చెప్పిన మాటను వినడంతో, అతను దేవుని ఆజ్ఞను అతిక్రమించాడని (13:21-23) వృద్ధ ప్రవక్త ప్రవచించి, "ఆడసింహము నిన్ను చంపుతుంది. నీవు దేవుని మాటను తక్కువచేసి, అతని ఆజ్ఞను ఉల్లంఘించావు; నీ శవము సమాధికి చేరదు" అని చెప్పాడు. దీనివల్ల ఆడసింహము అతనిని చంపింది. అయితే, ఆ గాడిద తన యజమాని మృతదేహం దగ్గరనే నిలిచి ఉంది.

 

ప్రియమైన దేవుని పిల్లలారా! ఈ వచనాల ద్వారా మనము నేర్చుకోదగిన సత్యాలు ఇవే: దేవుడు మనకు చెప్పిన మాటల విషయములో మనము ఎలా ప్రవర్తిస్తున్నాము? దేవుని మాటను మనము పాటిస్తున్నామా? లేక అతిక్రమిస్తున్నామా?

 

మనము దేవుని ఆజ్ఞను పాటిస్తే రాబోయే తీర్పు నుండి తప్పించుకుంటాము. సింహము తన యజమానిని చంపినప్పటికీ, గాడిద దానికి భయపడలేదు; తన ప్రాణాన్ని ప్రమాదంలో పెట్టి తన యజమానికోసం నిలిచింది. మనము మన ప్రభువైన యేసుక్రీస్తు, తండ్రి దేవునికోసం ఎలా ఉన్నాము? ఆ గాడిద నుండి మనము గొప్ప పాఠాన్ని నేర్చుకున్నాము. "ప్రభువు కొరకు నిలబడండి." దేవుడు మనకు ఆశీర్వాదములు కలుగజేయును గాక!

- ప్ర. ఎస్. ఏ. ఇమ్మానుయేలు గారు

 

ప్రార్థనా అంశం:

ప్రతి జిల్లాలో 300 గిద్యోనులు లేవనెత్తమని ప్రార్థించండి.

 

*Whatsapp*

ఈ దిన ధ్యాన సందశమును తమిళ్, ఇంగ్లీష్ , హిందీ, మలయాళం, తెలుగు, కన్నడ, పంజాబీ మరియు ఒరియా బాషలలో వాట్సాప్ త్వరా పొందుటకు *+91 94440 11864* అనే నెంబర్ ను సంబ్రదించగలరు.

 

www.vmm.org.in

ఈమెయిల్: info@vmm.org.in

Android App: https://play.google.com/store/apps/details?id=com.infobells.vmmorgin

 

విలేజ్ మిషనరీ మూమెంట్, విరుదునగర్, ఇండియా- 626001

ప్రార్ధనా అవసరాల కోసం: +91 94424 93250



hacklink satın al perabet perabet giriş safirbet safirbet giriş betasus betasus giriş virüsbet medusabahis medusabahis giriş grandpashabet grandpashabet giriş jojobet jojobet giriş vaycasino vaycasino giriş pusulabet pusulabet giriş perabet perabet giriş perabet perabet giriş matbet slot oyna perabet perabet giriş hiltonbet perabet perabet perabet betnano holiganbet galabet kalebet holiganbet