Village Missionary Movement         கிராம மிஷனரி இயக்கம்

దిన ధ్యానము(Telugu) 28.11.2024 (Gospel Special)
Share:

By Village Missionary Movement

Thursday, 28-Nov-2024

దిన ధ్యానము(Telugu) 28.11.2024 (Gospel Special)

 

అంశం: కొత్త లక్ష్యం

 

"యేసునా వెంబడి రండి, నేను మిమ్మును మనుష్యులను పట్టు జాలరులనుగా చేసెదనని వారితో చెప్పెను" - మార్కు 1:17

 

జాకబ్ డేవిస్ అనే వ్యక్తి 1800ల సంవత్సరాలలో జీవించాడు. ఆ కాలంలో బంగారు గనుల్లో పనిచేసే వారి ప్యాంట్లు తక్కువ సమయంలోనే చిరిగిపోతుండేవి. దీనికి పరిష్కారం కనుగొనటానికి, ఆయన గుడారాలకు ఉపయోగించే గట్టి బట్టను తీసుకున్నాడు. ఆ బట్ట కఠినమైనది, చిరిగిపోని ధృఢమైనది. ఆ బట్టతో కార్మికులకు సరిపోయే ప్యాంట్లను కుట్టాడు. అప్పుడే నీలి రంగు జీన్స్ పుట్టింది. ఇది ఇప్పటికీ ప్రజల అత్యంత ప్రీతిపాత్రమైన దుస్తులుగా మారింది. ఒక వ్యక్తి గుడారపు బట్టకు కొత్త రూపాన్ని ఇవ్వడం వల్ల ఇది సాధ్యమైంది.

 

సిమోను పేతురు, అతని స్నేహితులు గలిలయ సముద్రంలో చేపల కోసం పనిచేసే సాధారణ మత్స్యకారులు. యేసుక్రీస్తు వారిని చూసి, "నా వెనుక రండి, మిమ్ములను మనుష్యులను పట్టుకునే వారిగా చేసెదను" అని చెప్పి, వారికి కొత్త లక్ష్యాన్ని, నూతన ఆరంభాన్ని ఇచ్చాడు. ఈ కొత్త లక్ష్యం వారి జీవితాల్ని పూర్తిగా మార్చింది. యేసు వారికి అవసరమైన అన్నిటినీ బోధించాడు. వారిని ఉపయోగించి దేవుడు ప్రజల హృదయాలను తాకాడు. యేసు క్రీస్తు యొక్క సిలువ మరణం, పునరుత్థానం శక్తిని ప్రపంచానికి తెలియజేశారు.

 

ప్రియమైనవారలారా! యేసు శిష్యులవలె, కృపను, రక్షణను పొందిన మనము, ఆ సువార్తను తెలియని ప్రపంచానికి తీసుకెళ్లాలి. ఒక చిన్న సువార్త పత్రిక లేదా కొత్త నిబంధనను అందించటం ద్వారా కూడా ఒకరి జీవితాన్ని, లక్ష్యాన్ని మార్చవచ్చు. దీనిని గూర్చి ఎంతో మంది సాక్ష్యాలు చెప్పగలరు. సమస్యలతో బాధపడుతూ తమ జీవితాలను ముగించుకోవాలనుకున్న అనేకమంది, సరైన సమయానికి దేవుని వాక్యం అందుకోవడం ద్వారా రక్షించబడ్డారు. వారికి కొత్త జీవితం, కొత్త లక్ష్యం లభించింది.

 

ఆనాటి సమయంలో ఆ వాక్యం వారికి అందకపోయి ఉంటే, ఆ ఆత్మ యొక్క పరిస్థితి ఎలా ఉండేదో ఆలోచించండి. మనకు సాధ్యమైనది దేవుని కోసం చేద్దాం. దేవుని ప్రేమతో మన హృదయాలు నిండిపోవాలి. అందరితోనూ, దగ్గరి వారితోనూ, దూరపు వారితోనూ, యేసు ప్రేమను పంచుకుందాం. యేసుక్రీస్తు గురించి సువార్త చెప్పడం ద్వారా వారిని ఒక కొత్త సృష్టిగా మార్చాలని, వారికి కొత్త లక్ష్యాన్ని ఇవ్వాలని ప్రార్థిద్దాం, సేవ చేద్దాం, కష్టపడదాం!

- సిస్టర్ బ్యూలా గారు

 

ప్రార్థనా అంశం:

మా ప్రాంగణంలో ప్రార్థనగోపురం నిర్మించడానికి గల అవసరాలు తీర్చబడాలని ప్రార్థించండి.

 

*Whatsapp*

ఈ దిన ధ్యాన సందశమును తమిళ్, ఇంగ్లీష్ , హిందీ, మలయాళం, తెలుగు, కన్నడ, పంజాబీ మరియు ఒరియా బాషలలో వాట్సాప్ త్వరా పొందుటకు *+91 94440 11864* అనే నెంబర్ ను సంబ్రదించగలరు.

 

www.vmm.org.in

ఈమెయిల్: info@vmm.org.in

Android App: https://play.google.com/store/apps/details?id=com.infobells.vmmorgin

 

విలేజ్ మిషనరీ మూమెంట్, విరుదునగర్, ఇండియా- 626001

ప్రార్ధనా అవసరాల కోసం: +91 94424 93250



hacklink satın al holiganbet giriş holiganbet casibom bets10 extrabet royalbet süperbetin casibom giriş casibom jojobet giriş casibom milanobet piabellacasino betpas bahiscasino atlasbet betpas casinoroyal bahiscasino ngsbahis betplay holiganbet jojobet casibom holiganbet jojobet casibom vaycasino romabet