By Village Missionary Movement
Saturday, 16-Nov-2024దిన ధ్యానము(Telugu) 16.11.2024 (Gospel Special)
అంశం: ప్రయోజనకరమైన ప్రయాణం
"అప్పుడు ఆత్మ ఫిలిప్పుతోనీవు ఆ రథము దగ్గరకుపోయి దానిని కలిసికొనుమని చెప్పెను" - అపో.కార్యములు 8:29
నేను మొదటిసారి ఉత్తర భారతదేశంలో సువార్త సేవ చేయడానికి రైలులో ప్రయాణం చేశాను. అప్పటి నా హృదయంలో, ఆ భాషను నేర్చుకోవడానికి మరియు సేవ చేయడానికి ఎన్నేళ్ళు పడుతుందో అనే ఆందోళన కలిగింది. కానీ దేవుని కృప చూడండి! ఆ రైలుప్రయాణంలోనే కొందరు నా దగ్గరికి వచ్చి, “మీరు ఎక్కడికి వెళ్తున్నారు? ఏమి చేయబోతున్నారు?” అని అడిగారు. నేను పూర్తిగా సమాధానం చెప్పలేకపోయినా, నా పరిధిలో ఎన్ని మాట్లాడగలిగానో, యేసు, జీసస్ అని చెప్పాను. ఆ తర్వాత, రైలు ప్రయాణం పూర్తి చేసి, బస్సు, రిక్షా మొదలైన వాటిలో ప్రయాణించినప్పుడు కూడా, నన్ను ప్రశ్నించినవారికి ఒక్క మాట యేసు అనే మాటతో సమాధానమిచ్చి సువార్తను చాటాను. దేవుడు నాకు ఆ రైలు ప్రయాణంలోనే సేవ ప్రారంభించడానికి దయ చూపించారు.
అపోస్తులుల కార్యములు 8వ అధ్యాయం చివరి భాగంలో అద్భుతమైన సంఘటన గురించి చదువుతాం. ఐథియోపియా రాణి మంత్రివర్యుడు ప్రయాణం చేస్తున్నాడు. ఆ సమయంలో, పరిశుద్ధాత్మ పిలిప్పుతో, ఆ రథమును కలుసుకోమని ఆజ్ఞాపిస్తాడు. పిలిప్పు ఆజ్ఞకి అనుగుణంగా, రథంలో చేరి యేసు క్రీస్తు గురించి బోధిస్తాడు. ఆ మంత్రివర్యుడు ఆ బోధను విని, నీటి దగ్గరికి చేరి బాప్తిస్మం పొందుతాడు. తర్వాత ఆనందంతో తన దేశానికి తిరిగి వెళ్తాడు. ఆ ప్రయాణం ఆయనకు ప్రయోజనకరమైన ప్రయాణం అయింది.
ప్రియమైన స్నేహితులారా! మనం ఎన్నో ప్రయాణాలు చేస్తుంటాం. ఎన్నో ప్రదేశాలకు వెళ్తూ, అనేకమందిని మన మార్గంలో కలుస్తుంటారు. ప్రయాణంలో మన పక్కన కూర్చున్నవారికి సువార్త చెప్పమని పరిశుద్ధాత్మ మనకు ప్రేరణనిచ్చినా, ఎలా ప్రారంభించాలి? ఎలా మాట్లాడాలి? అని సందేహిస్తూ, ఆ సమయాన్ని వదులుకుంటాం. వారు తమ గమ్యానికి చేరుకుని వెళ్లిపోతారు. ఆ అవకాశాన్ని మనం కోల్పోతాం. ఆలోచించండి, ప్రయాణాల్లో సువార్త చెప్పడం ద్వారా ఎంతమందిని దేవుని రాజ్యంలో చేర్చాము?
ప్రయాణాల్లో మనం ఫోన్లు, ఇయర్‌ఫోన్లు మొదలైనవాటిని తీసుకువెళతాము. కానీ ఇకపై, సువార్త పుస్తకాలు, కరపత్రికలు తీసుకువెళ్లి, మనకు ఎదురుపడే వారికి యేసు కృపను చాటుదాం. మనతోపాటు ప్రయాణిస్తున్నవారికి నమ్మకాన్ని కలిగించే నాలుగు వాక్యాలను చెప్పడం ప్రారంభిద్దాం. ఇలా మనం చేసే ప్రయాణం మనకూ, మన చుట్టూ ఉన్నవారికీ ఆశీర్వాదంగా మారుతుంది.
- బ్రదర్. శంకర్ రాజ్ గారు
ప్రార్థన అంశం:
"ఇనియావలే" (ప్రియమైన స్త్రీ) అనే టీవీ కార్యక్రమం అనేకమంది స్త్రీల ఆత్మిక జీవితాలను నిద్రలేపడానికి దేవుడు సహాయము చేయు లాగున ప్రార్థించండి.
*Whatsapp*
ఈ దిన ధ్యాన సందశమును తమిళ్, ఇంగ్లీష్ , హిందీ, మలయాళం, తెలుగు, కన్నడ, పంజాబీ మరియు ఒరియా బాషలలో వాట్సాప్ త్వరా పొందుటకు *+91 94440 11864* అనే నెంబర్ ను సంబ్రదించగలరు.
www.vmm.org.in
ఈమెయిల్: info@vmm.org.in
Android App: https://play.google.com/store/apps/details?id=com.infobells.vmmorgin
విలేజ్ మిషనరీ మూమెంట్, విరుదునగర్, ఇండియా- 626001
ప్రార్ధనా అవసరాల కోసం: +91 94424 93250