Village Missionary Movement         கிராம மிஷனரி இயக்கம்

దిన ధ్యానము(Telugu) 13.11.2024 (Gospel Special)
Share:

By Village Missionary Movement

Wednesday, 13-Nov-2024

దిన ధ్యానము(Telugu) 13.11.2024 (Gospel Special)

 

అంశం: ఆత్మల బారం కావాలి

 

"అప్పుడునేను ఎవని పంపెదను? మా నిమిత్తము ఎవడు పోవునని ప్రభువు సెలవియ్యగా వింటిని. అంతట నేనుచిత్తగించుము నేనున్నాను నన్ను పంపు మనగా" - యెషయా 6:8

 

ఒక తల్లి తన పెద్ద కొడుకును మిషనరీ సేవకు పంపించింది. తన కొడుకు నాశనమవుతున్న ఆత్మలను రక్షిస్తాడు అని విశ్వసించి ప్రార్థిస్తూ ఉండేది. ఒకరోజు వార్త వచ్చింది, “నీ కొడుకును అతను సేవ చేస్తున్న ప్రాంతంలోని ప్రజలు కొట్టి చంపేశారు” అని. మనశ్శాంతి కోల్పోయిన తల్లి తన రెండవ కొడుకును పిలిచి, “కోడుకా, నీ అన్న సేవ చేసిన ప్రాంతానికి వెళ్లి ఆ సేవను కొనసాగించు” అని చెప్పింది. అతడు తల్లి మాట విని ఆ మిషనరీ స్ధలానికి వెళ్ళాడు. కొన్ని నెలల తరువాత మరో వార్త వచ్చింది: “నీ రెండవ కొడుకును కూడా చంపేశారు” అని. ఈ వార్త విన్న తల్లి తన చిన్న కొడుకును పిలిచి, “కోడుకా, నీ అన్నలు సేవ చేసిన ప్రాంతానికి వెళ్లి సేవ చేయాలి” అని పంపించింది. కొన్ని నెలలు తరువాత వార్త వచ్చింది, “నీ చిన్న కొడుకును కూడా చంపేశారు” అని. ఈ వార్త విన్నప్పుడు ఆ తల్లి చాలా దిగులుతో ఏడ్చింది. వెంటనే అక్కడ వున్నవారు “ఇతర కొడుకులు మరణించినప్పుడు నీకు అలా బాధలేదే, ఇప్పుడు ఏమిటి?” అని ప్రశ్నించారు. అందుకు తల్లి, “ఇంకా ఆ ప్రాంతంలో సేవ చేయడానికి నాకు కొడుకులు ఉన్నారు అని నేననుకున్నాను, అందుకే ఏడవలేదు. ఇప్పుడు నా దగ్గర సేవకు పంపేందుకు ఎవరూ లేరు అని అనుకుని ఏడుస్తున్నాను” అని చెప్పింది.

 

ప్రియమైన దేవుని బిడ్డలారా! మనకు ఆత్మల బారం ఎంత వరకు ఉంది? తన పిల్లలు వరుసగా చనిపోతున్నా, ఆ సేవ ఆగిపోకుండా కొనసాగించాలని తన పిల్లలను పంపిన ఆ తల్లి యొక్క ఆత్మ బారాన్ని చూశారా?

 

అయితే ఈ కాలంలో ఈ ఆత్మల బారం కనబడడం లేదు. ఎందుకంటే చర్చి పాస్టర్లు, సేవకులు కూడా తమ పిల్లలను బాగా చదివించి డాక్టర్లుగా, ఇంజనీర్లుగా విదేశాలకు పంపించాలని అనుకుంటున్నారు. మీ తరువాత చర్చిని ఎవరు చూసుకుంటారు అని అడిగితే, “ఇంకెవరినో నియమించి చూసుకోవాలి” అని అంటున్నారు. ఈ విధంగా సేవకులు ఆత్మల బారం లేకుండా ఉంటే, విశ్వాసులను నుండి ఎలా ఆశించగలము? ఇదే ఆత్మల బారంతో ఇక్కడ అనేక మిషనరీలు వచ్చారు కాబట్టే మనం యేసును తెలుసుకున్నాము. ఈ ఆత్మల బారం తోనే మేము పనిచేస్తేనే సువార్త దీపం ఆరిపోకుండా ఉంటుంది.

 

దీని గురించి చదువుతున్న విశ్వాసులారా! మనలో ఆత్మల బారం ఉంటేనే అది మన పిల్లలకు బోధింపబడుతుంది. ఆత్మల బారం లేకుండా చేసే సేవ ప్రయోజనంలేనిది. మనం ఈ ఆత్మల బారంని మన పిల్లలలో ఉంచి వారిని సేవకునిగా పంపుదాం. మన పిల్లలు కూడా పరలోక ఫలితాన్ని పొందుకుంటారు. దేవుడు మిమ్మును ఆశీర్వదించుగాక!

- శ్రీమతి. ఎప్సిబా ఇమ్మానుయేల్ గారు

 

ప్రార్థన అంశం: 

ఆమెన్ విలేజ్ టీవీ శాటిలైట్ ఛానెల్ గా మారటానికి, మరియు కిడ్స్ టీవీ ప్రారంభించుటకు ప్రార్థించండి.

 

*Whatsapp*

ఈ దిన ధ్యాన సందశమును తమిళ్, ఇంగ్లీష్ , హిందీ, మలయాళం, తెలుగు, కన్నడ, పంజాబీ మరియు ఒరియా బాషలలో వాట్సాప్ త్వరా పొందుటకు *+91 94440 11864* అనే నెంబర్ ను సంబ్రదించగలరు.

 

www.vmm.org.in

ఈమెయిల్: info@vmm.org.in

Android App: https://play.google.com/store/apps/details?id=com.infobells.vmmorgin

 

విలేజ్ మిషనరీ మూమెంట్, విరుదునగర్, ఇండియా- 626001

ప్రార్ధనా అవసరాల కోసం: +91 94424 93250



hacklink satın al perabet perabet giriş safirbet safirbet giriş betasus betasus giriş virüsbet medusabahis medusabahis giriş grandpashabet grandpashabet giriş jojobet jojobet giriş vaycasino vaycasino giriş pusulabet pusulabet giriş perabet perabet giriş perabet perabet giriş matbet slot oyna perabet perabet giriş hiltonbet perabet perabet perabet betnano holiganbet galabet kalebet holiganbet