Village Missionary Movement         கிராம மிஷனரி இயக்கம்

దిన ధ్యానము(Telugu) 12.11.2024 (Gospel Special)
Share:

By Village Missionary Movement

Tuesday, 12-Nov-2024

దిన ధ్యానము(Telugu) 12.11.2024 (Gospel Special)

 

అంశం: ఆత్మలను గెలుచుకోండి

 

"మరియు మీరు సర్వలోకమునకు వెళ్లి సర్వసృష్టికి సువార్తను ప్రకటించుడి" - మార్కు 16:15

 

యేసు క్రీస్తు పిల్లలుగా రక్షణ పొందిన ప్రతి ఒక్కరికి ఇతరులకు సువార్త చెప్పడం విధిగా ఉంది. నేను వివాహం చేసుకున్నప్పుడు, ఉసిలంపట్టికి సమీపంలోని ఒక గ్రామంలో మిషనరీలుగా పని చేసేవాళ్లం. సేవ మరియు ఆదివారపు పాఠశాల తరగతుల తర్వాత మధ్యాహ్నం ఇంటికి చేరుకున్నాం. ఒక పది ఏళ్ల బాలిక చిరునవ్వుతో తలుపు వద్ద నిలబడి ఉంది. ఆమెను లోపలికి పిలిచాను, కొంచెం అల్పాహారం ఇచ్చాను, ఇంటికి వెళ్లమని చెప్పాను. కానీ ఆమె వెళ్ళడానికి నిరాకరించింది మరియు మీరు మరియు మీ సోదరుడు ప్రకటించే ఆ యేసు క్రీస్తు నాకు కావాలి అని చెప్పింది.

 

ఉసిలంపట్టి ప్రాంతంలో, ఆడపిల్లలను చంపడం పర్వాలేదు అని భావించే వారి మధ్య ఈ బాలిక గడిపింది. కానీ పిచ్చాయమ్మలు అని పిలిచేవాళ్లు ఎందుకంటే ఆమె అనాథలా పెరిగింది. ప్రేమ లేకుండా చిన్నప్పటినుండి పెరిగింది ఈ పాప. ఆమెను గెలవడానికి యేసు క్రీస్తు ప్రేమ ఆమెను ఆధ్యాత్మికంగా ప్రభావితం చేసింది. ఆమె చర్చికి ప్రస్తుతంగా హాజరవుతూ నాతో కలిసి ప్రార్థన మరియు వాక్యపాఠాలు నేర్చుకుంది. ప్రేమతో సంరక్షణతో ఆమె చదువుకొనుటకు ఏర్పాటు చేశాను.

 

తన వ్యక్తిగత రక్షకునిగా యేసు క్రీస్తుని అంగీకరించి పిచ్చాయమ్మలు గ్రేస్ గా నామకరణమైంది. కుటుంబం ఆమెకు ఒక అవిశ్వాసితో పెళ్ళి చేసుకోమని బలవంతం చేసింది. కానీ ఆమె, ఒక క్రైస్తవుడు కాకపోతే నేను ఎలా ఆవిశ్వాసితో పెళ్ళి చేసుకుంటాను అని నిరాకరించింది. మీరు నన్ను క్రైస్తవ వరుడితో వివాహం చేయగలరని విశ్వాసంతో ప్రార్థించింది. దేవుడు తన శాశ్వత ఉద్దేశ్యానికి అనుగుణంగా, హిందూ కుటుంబంలో నుండి రక్షణ పొందిన మరియు సేవ చేస్తున్న ఎలియాజ్ పాండి అనే వరునితో ఆమెను కలిపాడు. దేవుడు వారికి ముగ్గురు పిల్లలను ఇచ్చి, దిండుగుల్ ప్రాంతంలోని గ్రామంలో చర్చి పరిచర్య మరియు సువార్త ప్రదర్శనలో వారిని ఉపయోగిస్తున్నాడు.

 

"నేను సువార్త ప్రకటించకపోతే నాకు శ్రమ!" (1 కొరింథీయులకు 9 : 16.) ఆత్మలను గెలుచుకునే వాడు జ్ఞానవంతుడు. (సామెతలు 11:30). నా ప్రజలారా! మనకు ప్రతి ఒక్కరికి సువార్తను చెప్పడం కర్తవ్యమైంది. (రోమా 1 : 14 - 15) దేవుడు మనలను ఇలాంటి మరెన్నో సాక్షులను నిలబెట్టేందుకు ఉపయోగించునుగాక! ఆమేన్.

- శ్రీమతి. సరోజా మొహన్ దాస్ గారు.

 

ప్రార్థన అంశం: 

ఆమెన్ విలేజ్ టీవీ ఉపగ్రహ టీవీ ఛానల్ గా మారాలని ప్రార్థించండి.

 

*Whatsapp*

ఈ దిన ధ్యాన సందశమును తమిళ్, ఇంగ్లీష్ , హిందీ, మలయాళం, తెలుగు, కన్నడ, పంజాబీ మరియు ఒరియా బాషలలో వాట్సాప్ త్వరా పొందుటకు *+91 94440 11864* అనే నెంబర్ ను సంబ్రదించగలరు.

 

www.vmm.org.in

ఈమెయిల్: info@vmm.org.in

Android App: https://play.google.com/store/apps/details?id=com.infobells.vmmorgin

 

విలేజ్ మిషనరీ మూమెంట్, విరుదునగర్, ఇండియా- 626001

ప్రార్ధనా అవసరాల కోసం: +91 94424 93250



hacklink satın al perabet perabet giriş safirbet safirbet giriş betasus betasus giriş virüsbet medusabahis medusabahis giriş grandpashabet grandpashabet giriş jojobet jojobet giriş vaycasino vaycasino giriş pusulabet pusulabet giriş perabet perabet giriş perabet perabet giriş matbet slot oyna perabet perabet giriş hiltonbet perabet perabet perabet betnano holiganbet galabet kalebet holiganbet