Village Missionary Movement         கிராம மிஷனரி இயக்கம்

దిన ధ్యానము(Telugu) 10.11.2024 (Kids Special)
Share:

By Village Missionary Movement

Sunday, 10-Nov-2024

దిన ధ్యానము(Telugu) 10.11.2024 (Kids Special)

 

ప్రత్యేకముగా చిన్న పిల్లల కొరకు

 

అంశం: అరటి చెట్టా? కొబ్బరి చెట్టా?

 

"యెహోవా ఇచ్చకములాడు పెదవులన్నిటిని బింకములాడు నాలుకలన్నిటిని కోసివేయును" - కీర్తనలు 12:3

 

జాన్ అంకుల్ ఇంటి పక్కనే ఆయనకున్న ఒక అందమైన తోట ఉంది. ఆ తోటలో మామిడి చెట్టు, కొబ్బరి చెట్టు, జామ చెట్టు, పనస చెట్టు అని ఎన్నో చెట్లు ఉన్నాయి. జాన్ అంకుల్ పిల్లలు డాఫ్నీ, డార్విన్ ఇద్దరూ ప్రతిరోజూ వాటికి నీరు పోస్తూ పెంచేవారు. వారికి మొక్కలు, చెట్లు పెంచడం అంటే చాలా ఇష్టం.

 

ఒక రోజు వారి ఊరికి ఒక వ్యాపారి మొక్కల్ని అమ్మడానికి వచ్చాడు. వెంటనే డాఫ్నీ, డార్విన్ ఇద్దరూ తమ నాన్నను పిలిచి, వ్యాపారితో కలిసి వెళ్లి ఒక అరటి మొక్క కొనుక్కొని వచ్చి, తోటలోని కొబ్బరి మొక్క పక్కన నాటారు. రోజులు గడిచాయి. అరటి మొక్క, కొబ్బరి మొక్కతో సమానంగా పెరిగింది. పెరిగిన అరటి మొక్క అహంకారంతో కొబ్బరి మొక్కను చూసి, "అయ్యా, కొబ్బరి చెట్టూ! నువ్వు ఈ తోటలో ఎన్ని రోజులు ఉన్నావు?" అని అడిగింది. కొబ్బరి చెట్టు వినయపూర్వకంగా, "నేను ఇక్కడ ఒక సంవత్సరంగా ఉన్నాను," అని చెప్పింది.

 

దానికి అరటి చెట్టు వ్యంగ్యంగా, "ఒక సంవత్సరమా? అయినా నువ్వు అంతగా పెరగలేదు. నీకు ఏదైనా వ్యాధి ఉందా?" అని అన్నది. అరటి చెట్టు ఇంకా పెరిగింది, దాని మీద ఒక గెల అరటిపండ్లు కనిపించాయి. పొడవైన ఆకు, పువ్వు, కాయలతో అది మరింత అందంగా కనిపించింది. డాఫ్నీ, డార్విన్ ఇద్దరూ ఆ అరటి పండ్ల గుత్తిని చూసి ఎంతో సంతోషపడి, తమ తండ్రిని పిలిచి చూపించారు. ఆయన కూడా ఆ అరటి చెట్టును చూసి, అది కోయడానికి సమయం అయ్యిందని చెప్పాడు. అయితే ఆయన కొబ్బరి చెట్టును చూడలేదు లేదు. ఇప్పుడు అరటి చెట్టుకు గర్వం మరింత పెరిగిపోయింది. అది కొబ్బరి చెట్టును చూస్తూ వ్యంగ్యంగా నవ్వింది.

 

కానీ కొబ్బరి చెట్టు ఏమీ మాట్లాడకుండా ప్రశాంతంగా ఉన్నది. మరునాడు ఉదయాన్నే ఆ ఇంటి పనిమనిషి వచ్చి ఆ అరటిపండ్ల గెల కోసి తీసుకెళ్లింది. తరువాత కత్తిని తీసుకొని అరటి చెట్టును నరికి పడేసింది. అంతే, అరటి చెట్టు యొక్క గర్వం అంతా మాయమైపోయింది. కొబ్బరి చెట్టు మాత్రం ఓర్పుతో ఎదుగుతూ, తనను నాటిన వారికి కొబ్బరి నీళ్ళను, కొబ్బరిని ఇస్తూ ఉంది.

 

ప్రియమైన తమ్ముడూ, చెల్లెమ్మ! నీకు ఉన్న అందం, జ్ఞానం, ప్రతిభలను చూసి ఇతరులను తక్కువగా భావించకు. వినయంతో ఉండి యేసు కోసం, ఇతరులకు తోడుగా ఉండే పిల్లోడిగా జీవించు. సరేనా? 

- శ్రీమతి. సారా సుబాష్ గారు

 

*Whatsapp*

ఈ దిన ధ్యాన సందశమును తమిళ్, ఇంగ్లీష్ , హిందీ, మలయాళం, తెలుగు, కన్నడ, పంజాబీ మరియు ఒరియా బాషలలో వాట్సాప్ త్వరా పొందుటకు *+91 94440 11864* అనే నెంబర్ ను సంబ్రదించగలరు.

 

www.vmm.org.in

ఈమెయిల్: info@vmm.org.in

Android App: https://play.google.com/store/apps/details?id=com.infobells.vmmorgin

 

విలేజ్ మిషనరీ మూమెంట్, విరుదునగర్, ఇండియా- 626001

ప్రార్ధనా అవసరాల కోసం: +91 94424 93250



hacklink satın al holiganbet giriş holiganbet padişahbet bets10 extrabet royalbet süperbetin padişahbet betcio royalbet casinoroyal queenbet bahiscasino betcio bahiscasino atlasbet padişahbet betpas bahiscasino celtabet queenbet casibom jojobet jojobet casibom holiganbet restbet safirbet