Village Missionary Movement         கிராம மிஷனரி இயக்கம்

దిన ధ్యానము(Telugu) 06.11.2024 (Gospel Special)
Share:

By Village Missionary Movement

Wednesday, 06-Nov-2024

దిన ధ్యానము(Telugu) 06.11.2024 (Gospel Special)

 

అంశం: ఎవరికైనా సాధ్యం

 

"నేనే ప్రగల్భుల ప్రవచనములను వ్యర్థము చేయు వాడను సోదెకాండ్రను వెఱ్ఱివారినిగా చేయువాడను జ్ఞానులను వెనుకకు త్రిప్పి వారి విద్యను అవిద్యగా చేయువాడను నేనే" - యెషయా 44:25

 

ప్రసంగం ముగించిన తర్వాత ప్రముఖ ప్రబోధకుడు డి.ఎల్. మూడీ వేదికను విడిచి వెళ్లాడు. అప్పుడు ఒక ఆంగ్ల ఉపాధ్యాయుడు వచ్చి మీ ప్రసంగం చాలా మంచిదని, కాని మీ ఆంగ్ల వ్యాకరణం అంతగా బాగాలేదని అన్నాడు. వెంటనే డి.ఎల్. మూడీ చిరునవ్వుతో ప్రతిస్పందించి, నా చెత్త ఆంగ్లంతో నేను ఎందరో ప్రభువు వైపుకు నడిపించానని చెప్పాడు. అందువల్ల అతనిని చూచి మీరు మంచి ఆంగ్లం మాట్లాడి ఎంతమందిని ప్రభువు వైపుకు తేవడంలో ముందుకు నడిపించారని ప్రశ్నించాడు. ఆ ఉపాధ్యాయుడు తల వంచుకుని వెళ్లిపోయాడు. డి.ఎల్. మూడీ మరణించినప్పుడు అతని ద్వారా ఎంత మంది ఆశీర్వదించబడినారో తెలియజేయమని ఒక ప్రకటన విడుదల చేశారు. దాదాపు ఐదు లక్షల మంది తమకు డి.ఎల్. మూడీ ప్రసంగాల ద్వారా ఆశీర్వదించబడినట్లు లేఖలు పంపారు.

 

వాక్యాలలో మనం చూచినట్టు, ఇశ్రాయేల్ ప్రజలను బానిసత్వం నుండి విముక్తి చేయమని దేవుడు మోషేను పిలిచినప్పుడు, "నేనే నోరు కలిగించినవాడిని కదా" అని దేవుడు మోషేను ప్రోత్సహించి, అతన్ని ఉపయోగించాడు. అలాగే యిర్మియా అన్నాడు, "నేను మాటలాడ నెరుగను, నేను చిన్నవాడను" అని అన్నాడు. ప్రభువు ఇట్లనిచ్చాడు, "నీవు చిన్నవాడను అని అనవద్దు. నేను నిన్ను పంపిన చోటునకే నీవు పోవాలి, నేను నీకు ఆజ్ఞ ఇచ్చిన మాటలే మాట్లాడాలి." ప్రభువు తన చేయి యిర్మియాకు తాకించి, "అతనిని భయపడవద్దు, నీ నోటిలో నా వాక్యాలను ఉంచాను" అని అన్నాడు.

 

ఈ వాక్యాన్ని చదువుతున్న సోదరుడా, సోదరీమణి! మీరు కూడా మీ కుటుంబం యొక్క పేదరికం, వైకల్యం, మీపై ఉన్న బాధ్యతలు, చదువు లేకపోవడం, నైపుణ్యాల లోపం, మాట్లాడలేకపోవడం వంటి కారణాలు మీకు కూడా వస్తుండవచ్చు. మోషే, యిర్మియాలను దేవుడు ఉపయోగించినట్లుగా, నిన్ను కూడా దేవుడు తన పని కోసం ఉపయోగించడానికి సిద్ధంగా ఉన్నాడు. మీరు దేవునిపై విశ్వాసం ఉంచి ఆయన చేతిలో అర్పించినప్పుడు, మోషేలా కోట్లాది మందికి ఆశీర్వాదం కలిగించేలా దేవుడు నిన్ను కూడా ఆశీర్వదిస్తాడు. దేవుడు ఆశీర్వదించి, ఉపయోగించడానికి మనసున్నవారిని చూస్తున్నాడు. మీరు దేవుని కోసం ఆశీర్వదించబడటానికి, ఉపయోగించబడటానికి సిద్ధంగా ఉన్నారా?

- బ్రదర్. అలగర్ స్వామి గారు.

 

ప్రార్థన అంశం: 

ఒక్క గ్రామానికి సువార్త ప్రకటించడానికి వెయ్యి రూపాయలు అందించే వ్యక్తులు లేచేటట్లు ప్రార్థించండి.

 

*Whatsapp*

ఈ దిన ధ్యాన సందశమును తమిళ్, ఇంగ్లీష్ , హిందీ, మలయాళం, తెలుగు, కన్నడ, పంజాబీ మరియు ఒరియా బాషలలో వాట్సాప్ త్వరా పొందుటకు *+91 94440 11864* అనే నెంబర్ ను సంబ్రదించగలరు.

 

www.vmm.org.in

ఈమెయిల్: info@vmm.org.in

Android App: https://play.google.com/store/apps/details?id=com.infobells.vmmorgin

 

విలేజ్ మిషనరీ మూమెంట్, విరుదునగర్, ఇండియా- 626001

ప్రార్ధనా అవసరాల కోసం: +91 94424 93250



hacklink satın al holiganbet giriş holiganbet padişahbet bets10 extrabet royalbet süperbetin padişahbet betcio royalbet casinoroyal queenbet bahiscasino betcio bahiscasino atlasbet padişahbet betpas bahiscasino celtabet queenbet casibom jojobet jojobet casibom holiganbet restbet safirbet