By Village Missionary Movement
Thursday, 31-Oct-2024దిన ధ్యానము(Telugu) 31.10.2024
అంశం: మీ ప్రయాణం ఎటు వైపు సాగుతోంది?
“ఇంత గొప్ప సాక్షి సమూహము మేఘమువలె మనలను ఆవరించియున్నందున. యేసువైపు చూచుచు, మన యెదుట ఉంచబడిన పందెములో ఓపికతో పరుగెత్తుదము” - హెబ్రీయులకు 12:1-2
ఈ ఇద్దరు పిల్లల బాల్యం ఆనందంగా, చక్కగా గడిచింది. అయితే వారు యవ్వన దశలోనికి అడుగు పెట్టిన తర్వాత వారి జీవితంలో ఒక శూన్యతా చోటు చేసుకుంది. ఈ శూన్యతను తట్టుకోలేక, ఒంటరిగా ఉండాలనుకున్నారు. మరింత ముందుకు వెళ్లి, తమ జీవితాన్ని ముగించుకోవాలని కూడా అనుకున్నారు. అలాంటి క్లిష్ట సమయంలో వారిని రక్షించే గొప్ప సందేశం వారికి అందించబడింది - "యేసు నిన్ను ప్రేమిస్తాడు" అని తెలిసినప్పుడు, వారు ఆత్మహత్యను విడిచి, యేసువైపు చూస్తూ సరైన మార్గంలో నడిచారు. కానీ వారిలో ఒకడు మాత్రమే యేసు పట్ల విశ్వాసంతో కొనసాగాడు. మరొక యువకుడు తిరిగి ప్రపంచపు తాత్కాలిక ఆనందాలకు లొంగి, పాపములో కూరుకుపోయాడు. ఇద్దరికీ ఒకే అవకాశాన్ని ఇచ్చినా, ఒకరు తాను చూసిన యేసు నుండి దూరంగా పోయి, తన జీవితాన్ని నాశనం చేసుకున్నాడు.
బైబిల్లో ఒక తండ్రికి ఇద్దరు కుమారులు ఉన్నారు, పెద్దవాడు మరియు చిన్నవాడు. చిన్నవాడు, తన స్నేహితులతో కలిసి తండ్రి నుండి తన వారసత్వాన్ని తీసుకొని, దూర ప్రాంతానికి వెళ్లి, పరమ దుర్మార్గమైన జీవితాన్ని గడిపాడు. పందులు తినే పొట్టుతో అయినా తన కడుపును నింపుకోవాలని ఆశపడ్డాడు, కానీ ఎవ్వరూ అతనికి ఇవ్వలేదు. చివరకు అతను తన దోషాన్ని గ్రహించి, తన తండ్రి దగ్గరకు తిరిగి వచ్చి తన పాపాలను ఒప్పుకుని, "నేను ఇకమీదట మీ కుమారుడని చెప్పబడుటకు నేను పాత్రుడను కాను" అని చెప్పాడు. కానీ తండ్రి, తిరిగి వచ్చిన తన కుమారుడిని ప్రేమతో స్వీకరించాడు.
ప్రియమైన దైవ జనమా! యౌవనం మన అందరికీ దేవుడు ఇచ్చిన విలువైన వరం. జీవితం ఒక పూల తోటవంటిది, అందులో పరిమళం వెదజల్లాలంటే యేసు మన హృదయంలో నివసించాలి. మనం ఎంతటి పాపం చేసినా ఈ సమయంలో ఆయనను చూస్తే కాంతిని పొందగలము. ఆయనే మన జీవితాలను కాంతిమంతం చేయగలవాడు. "కంటితో కనిపించేదే మనం కోరుకుంటే" అన్నట్లు ఉండకుండా, మనకు ఇచ్చిన కాలంలో ఆయన వైపు చూస్తూ, మన పందెంను విజయం వైపు పరుగెత్తుతూ ముగిద్దాము.
- సహోదరి. జె.పి. హెబ్సిబా
ప్రార్థనా అంశం:
మోక్ష ప్రయాణం అనే మాసపత్రికను చదివే వారందరూ దేవుని జ్ఞానంలో ఎదగాలని ప్రార్థించండి.
*Whatsapp*
ఈ దిన ధ్యాన సందశమును తమిళ్, ఇంగ్లీష్ , హిందీ, మలయాళం, తెలుగు, కన్నడ, పంజాబీ మరియు ఒరియా బాషలలో వాట్సాప్ త్వరా పొందుటకు *+91 94440 11864* అనే నెంబర్ ను సంబ్రదించగలరు.
www.vmm.org.in
ఈమెయిల్: info@vmm.org.in
Android App: https://play.google.com/store/apps/details?id=com.infobells.vmmorgin
విలేజ్ మిషనరీ మూమెంట్, విరుదునగర్, ఇండియా- 626001
ప్రార్ధనా అవసరాల కోసం: +91 94424 93250