Village Missionary Movement         கிராம மிஷனரி இயக்கம்

దిన ధ్యానము(Telugu) 30.10.2024
Share:

By Village Missionary Movement

Wednesday, 30-Oct-2024

దిన ధ్యానము(Telugu) 30.10.2024

 

అంశం: కుక్క స్వభావం

 

"తన మూఢతను మరల కనుపరచు మూర్ఖుడు కక్కినదానికి తిరుగు కుక్కతో సమానుడు" - సామెతలు 26:11

 

కుక్కకు కృతజ్ఞత కలిగిన స్వభావముందని ఒక సాధారణ అభిప్రాయం ఉంది. కానీ పవిత్ర బైబిల్ మనకు కుక్కలాంటి స్వభావం వద్దని చెబుతుంది. ఎందుకంటే కుక్క తన వాంతిని తిరిగి తింటుంది. అలాగే, యేసు క్రీస్తు ప్రభువు రక్షకుడని తెలుసుకుని లోకములోని అపవిత్రతలనుండి తప్పించుకున్న వారు తిరిగి వాటిలో చిక్కుకోనిపోయి వాటిచేత ఓడిపోతే వారి పూర్వస్థితి మరింత అపవిత్రమవుతుందని 2పేతురు 2:20 లో లేఖనములు చెప్పుతున్నాయి.

 

నా కొరకు తెలిసిన ఒక సోదరుడు ఉన్నాడు. అతను చిన్నప్పటినుండి ప్రభువును ఆశ్రయించేవాడు. ప్రార్థన, లేఖనములను చదవడం, సంఘమునకు వెళ్ళడం వంటి దేవుని సేవకు సంబంధించిన అన్ని విషయాలలో ఉత్సాహంగా పనిచేసేవాడు. దేవుడు కూడా అతనికి మంచి ప్రతిభలను ఇచ్చాడు. కానీ కాలంతో అతను తన స్నేహితులతో కలసి లోకములోని ఆహ్లాదాలను ఆస్వాదించసాగాడు. ప్రార్థన మరియు లేఖనముల పఠనం తగ్గిపోయాయి. సంఘమునకు వెళ్ళటం లేదు. పరిశుద్ధ జీవితం కలుషితం అయింది. మనశ్శాంతి లేకుండా పోయింది. అతను దుర్మార్గుడైపోయాడు. అతను తన తండ్రి తలపై కొట్టి చంపేశాడు. తరువాత అతనికి మానసిక రుగ్మతవల్ల మరణం సంభవించింది.

 

పవిత్ర గ్రంథమైన బైబిల్లో, యేసు క్రీస్తు యూదాను పన్నెండుగురు శిష్యులలో ఒకడిగా చేసాడు. అతనితో కలసి ప్రజల నుండి దయ్యాలనుంచి విడిపించి రోగాలను స్వస్థపరిచాడు. కానీ యూదా లోభంలో చిక్కుకుని, తన జీవితంలో అద్భుతాలు చేసిన యేసును వంచించాడు. చివరికి అతని స్థితి ఎంత దారుణంగా అయిందో, అతను అతి భయంకరంగా మరణించాడు.

 

ఈ ధ్యానాన్ని చదువుతున్న దేవుని ప్రియమైన వారలారా, యేసు క్రీస్తు మనలను లోకములోని అపవిత్రతలనుండి విమోచించి, తన మహామూల్యమైన రక్తంతో మనలను రక్షించాడు. మనము ఆ కృపను కాపాడుకుంటూ, కృతజ్ఞతతో నడవాలి. యూదా వంటి లోకవాంఛలకోసం ప్రభువును వదిలిపోయే హృదయం మనకు వద్దు. ఒక కుక్క తాను వాంతి చేసినదానిని తిరిగి తినే విధముగా , మనము కూడా "ఇది అపవిత్రమైనది మరియు ప్రభువు దీనిని ఇష్టపడడు" అని తెలిసినా అదే చేయటానికి తిరిగి వెళ్తే, మన స్థితి ఎంతో దుర్భరంగా ఉంటుంది. కాబట్టి నా ప్రియమైన దేవుని జనులారా, జాగ్రత్తగా ఉండవలెను.

- బ్రదర్. సీమియోను గారు

 

ప్రార్థన అంశం: 

మోక్ష పయనం మాసపత్రిక కొరకు ప్రార్థించండి.

 

*Whatsapp*

ఈ దిన ధ్యాన సందశమును తమిళ్, ఇంగ్లీష్ , హిందీ, మలయాళం, తెలుగు, కన్నడ, పంజాబీ మరియు ఒరియా బాషలలో వాట్సాప్ త్వరా పొందుటకు *+91 94440 11864* అనే నెంబర్ ను సంబ్రదించగలరు.

 

www.vmm.org.in

ఈమెయిల్: info@vmm.org.in

Android App: https://play.google.com/store/apps/details?id=com.infobells.vmmorgin

 

విలేజ్ మిషనరీ మూమెంట్, విరుదునగర్, ఇండియా- 626001

ప్రార్ధనా అవసరాల కోసం: +91 94424 93250



hacklink satın al virüsbet medusabahis medusabahis giriş grandpashabet grandpashabet giriş jojobet jojobet giriş vaycasino vaycasino giriş pusulabet pusulabet giriş perabet perabet giriş perabet perabet giriş matbet slot oyna perabet perabet giriş hiltonbet perabet perabet perabet betnano holiganbet galabet kalebet holiganbet kingbetting kingbetting giriş lunabet lunabet giriş rulobet betpas atlasbet grandpashabet