Village Missionary Movement         கிராம மிஷனரி இயக்கம்

దిన ధ్యానము(Telugu) 24.10.2024
Share:

By Village Missionary Movement

Thursday, 24-Oct-2024

దిన ధ్యానము(Telugu) 24.10.2024

 

అంశం: ఆయన దృష్టిలో అందరూ సమానమే

 

"ఏలయనగా నీ దేవుడైన యెహోవా పరమదేవుడును పరమప్రభువునై యున్నాడు. ఆయనే మహాదేవుడు పరాక్రమవంతుడు భయంకరుడైన దేవుడు. ఆయన నరులముఖమును లక్ష్యపెట్టనివాడు, లంచము పుచ్చుకొననివాడు" - ద్వితియోపదేశకాండము 10:17

 

అజయ్ ఒక పేరుగాంచిన విశ్వవిద్యాలయం నుండి MBA పట్టా పొందిన తరువాత గొప్ప ఉద్యోగాన్ని పొందడం మరియు జీవితంలో ఉన్నత స్థాయికి చేరుకోవాలని ఆశపడ్డాడు. అయితే ప్రభువు అతన్ని గ్రామంలో సేవ చేయమని పిలిచాడు. చాలా అంతరంగ పోరాటాల తర్వాత అజయ్ ప్రభువు పిలుపుకు లోబడి సేవకు సిద్ధమయ్యాడు. అతనికి సహకరించడానికి 12వ తరగతి వరకు మాత్రమే చదివి నిర్మాణ రంగంలో పనిచేసే క్లోమెంట్‌ను కేటాయించారు.

 

అజయ్ వారిద్దరూ పూర్తిగా వేరే వ్యక్తులుగా ఉండటాన్ని గమనించి, తన నిర్ణయం సరైనదా అని సందేహించాడు. "అత్యున్నత విద్యా అర్హత ఉన్న నేను, తగిన విద్యా అర్హతలేని క్లోమెంట్‌తో కలిసి గ్రామంలో సేవ చేయడం సరైనదా?" అని అతను అనుకున్నాడు. "నేను థియాలజీలో డిగ్రీ పొందిన తరువాత, మంచి విద్యావంతుల మధ్య సేవ చేయలేనా?" అని ఆశ్చర్యపోయాడు.

 

ప్రభువు సన్నిధిలో ప్రార్థన చేస్తూ, ఆయన మార్గదర్శకత్వం కోసం ఎదురుచూస్తున్నప్పుడు, అజయ్‌కు పేతురు మరియు పౌలు దృష్టాంతంగా చూపించబడ్డారు.

 

పేతురు ఒక సాధారణ మత్స్యకారుడు, కానీ పౌలు అనేక విశ్వవిద్యాలయ పట్టాల సమానమైన విద్యా అర్హతలు కలిగినవాడు. వారిద్దరి మధ్య భిన్నతలు ఉన్నప్పటికీ, వారు ఒకే రక్షణను పొందారు మరియు ఒకే సువార్తను ప్రకటించారు. పౌలు యొక్క విద్యా అర్హతలు పేతురుకు తక్కువ భావన కలిగివుండవచ్చు. అలాగే పౌలు, పేతురుతో యేసుక్రీస్తుతో వ్యక్తిగత సంబంధం ఉన్నందుకు అసూయపడినవాడై ఉండవచ్చు. కానీ పేతురు, తనకు సరైన విద్య లేకపోయినా, కొన్ని పరిస్థితులను పౌలు కన్నా మెరుగ్గా అర్థం చేసుకొని ఉండవచ్చు. దేవుని సమానమైన కృప ముందు అన్ని ఆధిక్యతలు లేదా తక్కువతనం చెల్లిపోతాయి.

 

అజయ్, పౌలు రాక్షసత్వంతో క్రైస్తవులను హింసించినవాడుగా ఉండి, తర్వాత ప్రభువుకు వినమ్ర సేవకుడిగా మారినట్లే, మరియు పేతురు అనుమానంతో ఉన్నప్పటికీ ప్రభువుకు సమీపంగా ఉన్న ముఖ్యమైన అపోస్తలుడిగా నిలిచినట్లే, తాను మరియు క్లోమెంట్ ఇద్దరూ దేవుని ద్రాక్షతోటలో సహకారముతో పనిచేస్తున్న వారేనని గ్రహించాడు. ఈ అనుభూతి అజయ్‌కు సేవలో విజయం సాధించడానికి తోడ్పడింది.

 

ప్రార్థన: ప్రభువా, ప్రపంచ స్థాయిలను పక్కన పెట్టి, నా సహోద్యోగులతో కలసి ఉత్సాహంగా సేవ చేయుటకు నాకు కృపను అనుగ్రహించు!

- శ్రీమతి. జాస్మిన్ పాల్ గారు

 

ప్రార్థన అంశం: 

Arise Joshua & Esther ప్రాజెక్టులో పని చేసే వారిని మరియు బోధకుల పిల్లలను ఈ కార్యక్రమంలో చేర్చుకోవాలని ప్రార్థించండి.

 

*Whatsapp*

ఈ దిన ధ్యాన సందశమును తమిళ్, ఇంగ్లీష్ , హిందీ, మలయాళం, తెలుగు, కన్నడ, పంజాబీ మరియు ఒరియా బాషలలో వాట్సాప్ త్వరా పొందుటకు *+91 94440 11864* అనే నెంబర్ ను సంబ్రదించగలరు.

 

www.vmm.org.in

ఈమెయిల్: info@vmm.org.in

Android App: https://play.google.com/store/apps/details?id=com.infobells.vmmorgin

 

విలేజ్ మిషనరీ మూమెంట్, విరుదునగర్, ఇండియా- 626001

ప్రార్ధనా అవసరాల కోసం: +91 94424 93250



hacklink satın al