By Village Missionary Movement
Saturday, 19-Oct-2024దిన ధ్యానము(Telugu) 19.10.2024
అంశం: ఆమె తన వంతు చేసింది
"ఈమె తన శక్తికొలదిచేసి, నా భూస్థాపన నిమిత్తము నా శరీరమును ముందుగా అభిషేకించెను" - మార్కు 14:8
మా బంధువుల్లో ఒక చిన్న పిల్లవాడు శారీరకంగా బలహీనంగా ఉండేవాడు. కొంత దూరం నడిస్తే చాలు అతనికి చాలా అలసట వచ్చేది. ఒకసారి మా ఊరిలోని తోటకు వెళ్లి తిరిగి వస్తుండగా, అతన్ని అతని అక్క భుజానెత్తుకుని కష్టపడి తీసుకొచ్చింది. ఆమెను చూసి నాకు జాలి కలిగి, నేను కూడా అప్పట్లో ఒక చిన్నపిల్లవాడినే అయినప్పటికీ, అతన్ని నా భుజాలపై ఎత్తుకుని ఇంటికి తీసుకొచ్చాను. ఎన్నో సంవత్సరాల క్రితం జరిగిన ఆ సంఘటనను వారు ఇంతవరకు మరచిపోలేదు.
ఇప్పుడు, మనుషులు తమకు చేసిన సహాయాన్ని మరచిపోకుండా గుర్తుపెట్టుకుంటే, సర్వసృష్టికర్త అయిన దేవుడు మనం ఆయన కోసం చేసినది మరచిపోతాడా? "దేవుడు మీ శ్రమను, తన నామమునుగురించి మీరు చూపిన ప్రేమను మరచిపోడు..." (హెబ్రీయులు 6:10).
మార్కు సువార్త 14వ అధ్యాయంలో ఒక స్త్రీ విలువైన సువాసన గల నూనెను ప్రేమతో యేసయ్య తలపై పోసింది. కొందరు ఆమెపై విసికి మాట్లాడారు, కానీ యేసయ్య, “ఆమె తన వంతు చేసింది; నేను పాతిపెట్టబడక మునుపు నా శరీరాన్ని అభిషేకించడానికి ముందే వచ్చింది. ఈ సువార్త ప్రపంచంలో ఎక్కడ ప్రచారం చేయబడితే అక్కడ ఆమె చేసిన కార్యం జ్ఞాపకము చేసుకోబడుతుంది" అని చెప్పారు.
చూసారా! అప్పట్లో జరిగిన ఆ సంఘటనను ఈరోజు కూడా మనం స్మరించుకుంటున్నాం. వాగ్దానం చేసిన దేవుడు తన వాక్కును ఎప్పటికీ మార్పుకోడు.
సారెపతులో ఎలీయా ప్రవక్తకు తక్కువ ఆహారం ఇచ్చిన విధవరాలు, సిరియా దేశపు సైన్యాధిపతిగా ఉన్న నయమాను కుష్టు వ్యాధి నయమయ్యేందుకు ఎలీషా ప్రవక్త వద్దకు వెళ్లమని సూచించిన ఇశ్రాయేలు చిన్నది, తనకున్న రెండు నాణేలను సమర్పించిన విధవరాలు, ఐదు రొట్టెలు మరియు రెండు చేపలను యేసయ్య చేతులకు అప్పగించి దాదాపు 5000 మందిని తృప్తిపరిచిన ఆ బాలుడిని - ఇలా చెప్పుకుంటూ పోవచ్చు. వీరందరూ తమకు చేతనైనంత చేయడంలో దేవుని పట్ల చూపిన ప్రేమను ప్రదర్శించారు. ఈరోజు కూడా వీరి గురించి చెప్పుకుంటూనే ఉన్నాం.
ఇప్పుడు ఈ వాక్యాన్ని వింటున్న లేదా చదువుతున్న మీరు ఎందుకు మీ సమయాన్ని, ధనాన్ని, సంపదను, శ్రమను దేవుని కోసం ఇవ్వకూడదు? అనేక అవసరాల్లో ఉన్న సేవలు, మిషనరీ సంస్థలు మరియు పేదల కోసం మీరు చేయగలిగింది ఎందుకు చేయకూడదు? దేవుని ప్రేమను ఇతరులకు తెలియజేయవచ్చు కదా. 1 కోరింథీయులు 15:58లో చెప్పబడినట్లు, "మీ శ్రమ దేవునిలో వృథా కాకపోవునని గట్టిగా నమ్మి, మీరు స్థిరంగా, కదలకుండా ఉండి, దేవుని పని లో ఎప్పుడూ శ్రమించేవారుగా ఉండాలి."
వీరు యేసు కోసం తమ వంతు చేశారు, ఈరోజు కూడా వారి గురించి చెప్పుకుంటున్నాం. ఇప్పుడు మనం యేసు కోసం ఏమి చేస్తున్నాం? మనలో మనం ఆలోచిద్దాం మరియు ఆచరిద్దాం!
బ్రదర్. సిమ్యోనూ గారు
ప్రార్థన అంశం:
ప్రతి జిల్లాలో బాలల శిబిరాలు నిర్వహించబడాలని ప్రార్థించండి.
*Whatsapp*
ఈ దిన ధ్యాన సందశమును తమిళ్, ఇంగ్లీష్ , హిందీ, మలయాళం, తెలుగు, కన్నడ, పంజాబీ మరియు ఒరియా బాషలలో వాట్సాప్ త్వరా పొందుటకు *+91 94440 11864* అనే నెంబర్ ను సంబ్రదించగలరు.
www.vmm.org.in
ఈమెయిల్: info@vmm.org.in
Android App: https://play.google.com/store/apps/details?id=com.infobells.vmmorgin
విలేజ్ మిషనరీ మూమెంట్, విరుదునగర్, ఇండియా- 626001
ప్రార్ధనా అవసరాల కోసం: +91 94424 93250