By Village Missionary Movement
Friday, 11-Oct-2024దిన ధ్యానము(Telugu) 11.10.2024
అంశం: ప్రార్థన యొక్క మహిమ
"అయితే మేము ప్రార్థనయందును వాక్యపరిచర్యయందును ఎడతెగక యుందుమని చెప్పిరి" - అపో.కార్యములు 6:4
ఇద్దరు పరిచారకులు సేవ కోసం వేరొక పట్టణానికి వెళ్ళారు. వారు ఎక్కడికి వెళ్ళినా, అక్కడే ఉండి సేవ చేసేవారు. వారిలో ఒకరు ఐదు నిమిషాలు మాత్రము ప్రార్థన చేసి నిద్రపోయేవారు. మరొకరు రాత్రంతా ప్రార్థన చేసేవారు. ఇది ప్రతిరోజు జరిగేది. ఒకరోజు, ఐదు నిమిషాలు ప్రార్థన చేసే అతను మరొకరిని అడిగారు, "నేను ప్రార్థన చేసి వెంటనే నిద్రపోతున్నాను, కానీ నివు రాత్రంతా ప్రార్థన చేస్తున్నాను. నీవు ఏమి కోరుకుని ప్రార్థన చేస్తున్నావు? ఎందుకు ప్రార్థన చేస్తున్నావు?" అందుకు మరొకరు సమాధానం ఇచ్చారు, "నేను మంచి ఉద్యోగం వదిలిపెట్టాను. కాబట్టి నా భవిష్యత్తు భార్య దీన్ని అర్థం చేసుకొని, నాతో పాటు సేవలో పాల్గొని, దేవుని చిత్తం ప్రకారం కలిసి పరిచర్య చేయాలని ప్రార్థన చేస్తున్నాను."అదే విధంగా బైబిల్లో, దేవుని మనిషి యాకోబు తన సోదరుడు ఏసావు నుండి ప్రమాదం ఉందని భయపడి, రాత్రంతా ప్రార్థన చేస్తూ దేవునితో పోరాడాడు. ఆయన దేవునితో మొరపెట్టుకొన్నాడు, "నీవు నన్ను ఆశీర్వదించకుండా మిమ్మును వదలను " (ఆదికాండం 32:26) అని ఆయన దేవునితో పోరాడి ఆశీర్వాదం పొందాడు. యోహాను 14:14లో ఇలా ఉంది, "మీరు నా నామములో ఏదైనా అడుగుతే, నేను అది చేస్తాను." ప్రియులారా, మన దేవుడు యాకోబు చేసిన ప్రార్థన కారణంగా ఆయన కోరికను తీర్చాడు.
అవును, ప్రియులారా! మనం ఏదైనా అడిగితే, దేవుడు మన జీవితంలో తప్పకుండా చేస్తాడు. కానీ మనం రాత్రంతా ప్రార్థన చేస్తున్నామా? మనం ప్రార్థనకు ఎక్కువ సమయం కేటాయిస్తున్నామా? మనం ఎలాంటి వారము? మనం ప్రార్థనకు తక్కువ సమయం కేటాయిస్తే, దేవుని నుండి గొప్ప విషయాలను ఆశించలేము. వచనం ప్రకారం, "మనిషితో సాధ్యం కానిది దేవునితో సాధ్యమే," మనం ప్రార్థన పిల్లలు అవుదాం. మనం అద్భుతాలు చూస్తాము. దేవుడు మనకు ఇచ్చిన వాగ్దానాన్ని పట్టుకొని ప్రార్థనలో పట్టుదలగా ఉంటే, మనం ప్రార్థన యొక్క మహిమను చూడగలము. దేవుడు మిమ్మల్ని ఆశీర్వదించుగాక.
- బ్రదర్. రూబెన్ క్రిస్టి
ప్రార్థన అంశాలు:
మన డేకేర్ సెంటర్ పిల్లలకు మద్దతు ఇస్తున్న కుటుంబాలను దేవుడు ఆశీర్వదించాలని ప్రార్థించండి.
*Whatsapp*
ఈ దిన ధ్యాన సందశమును తమిళ్, ఇంగ్లీష్ , హిందీ, మలయాళం, తెలుగు, కన్నడ, పంజాబీ మరియు ఒరియా బాషలలో వాట్సాప్ త్వరా పొందుటకు *+91 94440 11864* అనే నెంబర్ ను సంబ్రదించగలరు.
www.vmm.org.in
ఈమెయిల్: info@vmm.org.in
Android App: https://play.google.com/store/apps/details?id=com.infobells.vmmorgin
విలేజ్ మిషనరీ మూమెంట్, విరుదునగర్, ఇండియా- 626001
ప్రార్ధనా అవసరాల కోసం: +91 94424 93250