Village Missionary Movement         கிராம மிஷனரி இயக்கம்

దిన ధ్యానము(Telugu) 09.10.2024
Share:

By Village Missionary Movement

Wednesday, 09-Oct-2024

దిన ధ్యానము(Telugu) 09.10.2024

 

అంశం: తండ్రి 

 

"ఐగుప్తులోను అరణ్యములోను మీకొరకు చేసినట్టు మీ పక్షముగా యుద్ధము చేయును, మీరు ఈ చోటికి చేరువరకు మీరు వచ్చిన మార్గమంతటిలోను మనుష్యుడు తన కుమారుని ఎత్తికొనునట్లు మీ దేవుడైన యెహోవా మిమ్మును ఎత్తికొని వచ్చిన సంగతి మీరెరుగుదురని మీతో చెప్పితిని" - ద్వితియోపదేశకాండము 1:31

 

ఒక తండ్రి తన కుమారినితో విశ్రాంతిగా గడుపుటకు ఒక స్థలమునకు వెళ్ళాడు. వీధి అంతా చుట్టూ చూపించి తన కుమారుడికి అవసరం అయిన అన్నింటిని కొనిపెట్టి ఊరి బయట ఉన్న స్థలమునకు ప్రకృతిని ఆస్వాదించుటకు వెళ్లారు. కుమారుడు అక్కడ ఉన్న మేఘములను చూస్తూ అది గొర్రె వలే ఉంది. డైనోసార్ వలె ఉంది అని చెప్తూ సంతోషించాడు. ఒక చిన్న కొండమీదకి ఇద్దరు ఎక్కడం ప్రారంభించారు. తిరిగి నాన్న నన్ను పట్టుకొనండి అని చేతులు చాపుతూ తండ్రి వైపు గెంతాడు దాన్ని ఎంత మాత్రం ఎదురుచూడని తండ్రి పరిగెత్తుకుని వెళ్లి తన కుమారుని పట్టుకున్నాడు. అయితే ఇద్దరు కింద పడ్డారు కానీ ఎటువంటి దెబ్బలు తగలలేదు. తండ్రి ఎందుకు ఇలాంటి పని చేశావు అని అడిగాడు అందుకు ఆ కుమారుడు నువ్వు ఎలాగైనా పట్టుకుంటావు అని నాకు తెలుసు అందుకే నేను గెంతాను అని చెప్పాడు. ఇదిగో నాకు దెబ్బలు తగలేదు చూసావా అని అన్నాడు కుమారుడు. వెంటనే ఇద్దరు కలిసి ముందుకు నడిచారు.

 

ఇలానే మన పరలోకపు తండ్రి కూడా, ఆయనను మనము సంపూర్ణంగా నమ్మవచ్చు. అవును పరిస్థితులు అన్నీ ఎరిగినవాడు కాబట్టి మేలులను సరైన సమయంలో చేసి పెడతాడు. మనం మన పిల్లలను ప్రేమిస్తున్నాం కానీ దేవుడు మనము పాపంలో జీవించినప్పుడే మన కొరకు ఆయన ప్రాణాన్ని ఇచ్చిన ప్రేమిస్తున్నారు. ఒక తండ్రి తన బిడ్డలను భుజం మీద పెట్టుకొని మోస్తున్నట్లు మన దేవుడు మనలను ఎత్తుకుంటున్నారు. వృద్ధాప్యం వరకు మిమ్మును విడిచిపెట్టను అని యెషయా 46: 4 లో చెబుతున్నారు. ఇలాగు ఎన్నో విధములైన మరణపు అంచుల వరకు వెళ్లినను ఆయన హస్తము మనలను ఎత్తుకొని మరణాన్ని దాటుటకు సహాయము చేసింది. ఆయన తన కంటి పాప వలె మనలను శ్రద్ధగా కాపాడుతున్నారు. రాత్రి పగలను చూడకుండా మనలను కాపాడుతున్నారు. ఇలానే ఇశ్రాయేలు ప్రజలను అరణ్యంలో 40 సంవత్సరాలు సంరక్షించారు. వారి వస్త్రాలు చిరిగిపోలేదు వారి చెప్పులు అరిగిపోలేదు. ఆ విధముగా దేవుడు చక్కగా వారిని నడిపించి సంరక్షించారు.

 

దీని చదువుతున్న స్నేహితులారా! దేవుడు మనకు తండ్రి అని పిలిచి దత్తపుత్ర ఆత్మను దయచేసి యున్నారు కాబట్టి ఆయన నామములో విశ్వాసము కలవారిగా మనము ఆయనను తండ్రిగా అంగీకరించినప్పుడు ఆయన తన పిల్లలను సంరక్షించుటకు సిద్ధంగా ఉన్నారు. అంగీకరించడం మాత్రమే కాదు ఆయన మనల్ని దయ కలిగిన వారిగా, శ్రద్ధ కలిగిన వారిగా మన అవసరతలు తీర్చి సంతోషముగా నన్ను ముందుకు నడిపిస్తారు. మనము పరలోకము చేరే అంతవరకు మనతో ఉండి నడిపిస్తారు. 

- శ్రీమతి. అన్బుజోతి స్టాలిన్ గారు 

 

ప్రార్థన అంశం:-

మన డేకర్ సెంటర్ లో చదువుతున్న ఆదివాసి పిల్లలు రక్షింపబడాలి అని ప్రార్థిద్దాం.

 

*Whatsapp*

ఈ దిన ధ్యాన సందశమును తమిళ్, ఇంగ్లీష్ , హిందీ, మలయాళం, తెలుగు, కన్నడ, పంజాబీ మరియు ఒరియా బాషలలో వాట్సాప్ త్వరా పొందుటకు *+91 94440 11864* అనే నెంబర్ ను సంబ్రదించగలరు.

 

www.vmm.org.in

ఈమెయిల్: info@vmm.org.in

Android App: https://play.google.com/store/apps/details?id=com.infobells.vmmorgin

 

విలేజ్ మిషనరీ మూమెంట్, విరుదునగర్, ఇండియా- 626001

ప్రార్ధనా అవసరాల కోసం: +91 94424 93250



hacklink satın al