Village Missionary Movement         கிராம மிஷனரி இயக்கம்

దిన ధ్యానము(Telugu) 08.10.2024
Share:

By Village Missionary Movement

Tuesday, 08-Oct-2024

దిన ధ్యానము(Telugu) 08.10.2024

 

అంశం: మార్పును తీసుకొచ్చిన ప్రేమ 

 

“దేవుడు ప్రేమాస్వరూపి(దేవుడు ప్రేమయైయున్నాడు), ప్రేమలేని వాడు దేవుని ఎరుగడు” – 1 యోహాను 4:8

 

రాబర్ట్ మోబట్ అనే దేవుని సేవకుడు ఆఫ్రికా దేశంలో ఆంటోన్ బర్డ్ అనే స్థలంలో మిషనరీగా పనిచేశారు. ఆర్ట్ అండ్ బోర్డులో ఆఫ్రికానర్ అనే గొప్ప రౌడీ ఉండేవాడు. ఆయన అనేక హత్య చేసినవాడు. ప్రభుత్వానికి పెద్ద సవాలుగా ఉండేవాడు. ఆయన తలను తీసుకుని వచ్చే వారికి వెయ్యి డాలర్లు బహుమానము ఇవ్వబడుతుందని ప్రభుత్వం ప్రకటించింది. ప్రభుత్వ బహుమానం పొందుటకు అనేకులు ఒంటరిగాను, గుంపులుగాను వెళ్లారు కానీ ఆఫ్రికానర్ ని చంపలేకపోయారు. వెళ్లిన వారందరూ కూడా మరణించారు.

 

రాబర్ట్ క్రీస్తు ప్రేమను ఎలాగైనా ఆఫ్రికానర్ కు ప్రకటించాలి అనే ప్రణాళిక వేశాడు. ఆయన ఉన్న స్థలములకు దగ్గరగా ఉన్న పిల్లల్లో వందమంది చిన్న పిల్లలను ఏర్పరచుకొని వారి కొరకు ఒక స్థలానికి సిద్ధపరిచారు. దురదలు, చేతులు, కాళ్లకు గాయాలతో మురికిగా ఉంటున్న ఆ పిల్లలను శుభ్రపరిచి అందమైన వాళ్ళుగా చేసి వాళ్లకు అవసరమైన అన్ని ఇస్తూ ఉండేవాడు. ఈయన కార్యాలను చూసిన ఆఫ్రికానర్ మన జాతి ప్రజలకు ఈయన చూపిస్తున్న ప్రేమ గొప్పది అని గ్రహించాడు. ఈయన పూజిస్తున్న దేవుణ్ణి నేను కూడా పూజిస్తాను అని యేసయ్యను అంగీకరించాడు. ఎవ్వరు పట్టుకోలేని ఆ ఆఫ్రికానర్ మారుమనస్సు పొందుకున్న దాన్ని గ్రహించిన ప్రభుత్వం ఆయనకు క్షమాపణ అనుగ్రహించింది.

 

రాబర్ట్ యొక్క ప్రారంభ పరిచర్య చిన్న పిల్లల మధ్యలోనే. యేసు సీమోను పేతురుతో నా గొర్రెలను కాయము అని చెప్పారు. చిన్న చేపలను పెట్టి పెద్ద చేపలను పట్టుకున్నట్లు చిన్న పిల్లల పరిచర్య ద్వారా పెద్ద చేప అయినా ఆఫ్రికానర్ ను పట్టుకున్నాడు. మన పరిచర్య మార్గంలో చిన్న పిల్లలను ద్వారా పెద్ద ఫలితాన్ని చూడగలం అనేది నిత్యం.

 

నా ప్రియమైన వారలారా మన యేసయ్య ప్రేమను ఎలాగైనా లోకానికి తీసుకుని వెళ్దాం. మన హృదయము దేవుని ప్రేమతో నింపబడి ఉంటే ఇతరులకు మనం దాన్ని ఇవ్వగలం. ప్రేమ చేత దాన్ని మనము జయించగలిగినవారంగా ఉండి దేవుని కొరకు సాక్షులుగా ఉంటాం. దేవుని దీవెనలు పొందుకుంటాం. హల్లెలూయ. ఆమెన్! 

- బ్రదర్. సెల్వ రాజ్ గారు 

 

ప్రార్థన అంశం:-

మన ట్యూషన్ సెంటర్లకు వస్తున్న పిల్లలు దేవుని ఎరిగేటట్లు ప్రార్థిద్దాం.

 

*Whatsapp*

ఈ దిన ధ్యాన సందశమును తమిళ్, ఇంగ్లీష్ , హిందీ, మలయాళం, తెలుగు, కన్నడ, పంజాబీ మరియు ఒరియా బాషలలో వాట్సాప్ త్వరా పొందుటకు *+91 94440 11864* అనే నెంబర్ ను సంబ్రదించగలరు.

 

www.vmm.org.in

ఈమెయిల్: info@vmm.org.in

Android App: https://play.google.com/store/apps/details?id=com.infobells.vmmorgin

 

విలేజ్ మిషనరీ మూమెంట్, విరుదునగర్, ఇండియా- 626001

ప్రార్ధనా అవసరాల కోసం: +91 94424 93250



hacklink satın al