Village Missionary Movement         கிராம மிஷனரி இயக்கம்

దిన ధ్యానము(Telugu) 07.10.2024
Share:

By Village Missionary Movement

Monday, 07-Oct-2024

దిన ధ్యానము(Telugu) 07.10.2024

 

అంశం: ఆసక్తి గల ప్రార్ధన 

 

"అప్పుడు దూత అతనితో నీవు నడుము కట్టుకొని చెప్పులు తొడుగుకొను మనెను. అతడాలాగు చేసిన తరువాత దూత నీ వస్త్రము పైన వేసికొని నా వెంబడి రమ్మని అతనితో చెప్పెను" - అపో.కార్యములు 12:8

 

నాకు తెలిసిన ఒక యవ్వనస్తురాలైన అమ్మాయికి వివాహము సిద్ధమైంది. నార్త్ ఇండియాలో మిషనరీగా పని చేస్తూ వచ్చిన భర్తతో కొన్ని రోజుల్లో అక్కడికి వెళ్లాలి. వివాహనికి మునుపు వరకు తాను నివసించిన పట్టణంలో ఒక భాగంలో పెద్ద సండే స్కూల్ నడిపించింది ఆమె. అదే అనేకమంది పిల్లలకు దీవెన కరంగా ఉంది. తన తర్వాత ఎవరు ఆ సండే స్కూల్ ని నడిపిస్తారు అని చింత ఆమెకు ఉండేది. ఆమెకు ఒక చిన్న తమ్ముడు ఉండేవాడు కానీ అతడు క్రీస్తుని అంగీకరించలేదు. తన సహోదరుడు మారుమనస్సు పొంది నేను విడిచి వెళుతున్న సండే స్కూల్ నడిపించాలి అని ఆశక్తితో ప్రార్థిస్తూ ఉండేది. రోజులు గడుస్తున్న కొలది ఆమె ఇంకా ఎక్కువ ఆశక్తితో ప్రార్థించింది. చివరికి ఆమె బయలుదేరవలసిన పరిస్థితి వచ్చింది. ఇంట్లో గల అందరూ కన్నీటితో ఆమెకు సాగనంపారు. ఆమె సహోదరుడు చాలా వేగంగా పరిగెత్తుకుని వచ్చి ఆమె చేతులను పట్టుకున్నాడు. నీ రక్షకుడ్ని నేను కూడా అంగీకరించాను. నీ యొక్క సండే స్కూల్ ని నేను నడిపిస్తాను అని వాగ్దానం చేశాడు. అందుకు ఆమె మిక్కిలి సంతోషము నా ప్రార్థనకు జవాబు దొరికింది అని దేవుని స్తుతించి ఆనందించింది.

 

అపోస్తులుడైన పేతురు చెరసాలలో వేయబడ్డాడు. పేతురు చెరాసాల కాపలా వారి చేత బంధించబడి ఉన్నాడు. అలా ఉన్నప్పటికీ పేతురు చెరసాలలో ఉండేటప్పుడు సంఘస్తులు ఆయన కొరకు దేవుని వైపు చూచి ఆసక్తితో ప్రార్థించారు. ఈ ఆసక్తి గల ప్రార్ధన పేతురుని దూత ద్వారా చెరసాలలో నుండి విడిపించి బయటికి తీసుకుని వచ్చింది. 

 

దీనిని చదువుతున్న ప్రియమైన వారలారా! ఒకరి కొరకు ఒకరు ప్రార్థించుడి. నీతిమంతులు చేసే ఆసక్తికరమైన ప్రార్థన బలమైనది (యాకోబు 5: 16) అని బైబిల్ చెప్తుంది. మనము చేస్తున్న ఆసక్తిగల ప్రార్ధనకు ఖచ్చితముగా ప్రభువు జవాబు దయచేస్తారు. రక్షింపబడని మన బంధువులు రోగముతో ఉన్నవారు పాప శాపములతో ఉండి విడుదల పొందాలి అని తలస్తున్న ప్రతి ఒక్కరికి మనము చేసిన ప్రార్థన ఫలితాన్ని ఇవ్వగలదు. ఇంతవరకు మనం చేస్తున్న ప్రార్థనకు జవాబు రాకుండా లేక ప్రార్థించి అలసిపోయి ఉండిన యెడల ఈ దినం మరలా మనం ప్రార్థిద్దాం. మనం చేస్తున్న ఆసక్తి గల ప్రార్థనను విరిగినలిగిన అనేకుల జీవితంలో విమోచనను కలిగించగలదు ఇది కచ్చితంగా.

- శ్రీమతి. శక్తి శంకర్ గారు 

 

ప్రార్థన అంశం:-

మన ట్యూషన్ సెంటర్లో చదువుతున్న పిల్లలు యొక్క జ్ఞానము కొరకు ప్రార్థిద్దాం.

 

*Whatsapp*

ఈ దిన ధ్యాన సందశమును తమిళ్, ఇంగ్లీష్ , హిందీ, మలయాళం, తెలుగు, కన్నడ, పంజాబీ మరియు ఒరియా బాషలలో వాట్సాప్ త్వరా పొందుటకు *+91 94440 11864* అనే నెంబర్ ను సంబ్రదించగలరు.

 

www.vmm.org.in

ఈమెయిల్: info@vmm.org.in

Android App: https://play.google.com/store/apps/details?id=com.infobells.vmmorgin

 

విలేజ్ మిషనరీ మూమెంట్, విరుదునగర్, ఇండియా- 626001

ప్రార్ధనా అవసరాల కోసం: +91 94424 93250



hacklink satın al