Village Missionary Movement         கிராம மிஷனரி இயக்கம்

దిన ధ్యానము(Telugu) 03.10.2024
Share:

By Village Missionary Movement

Thursday, 03-Oct-2024

దిన ధ్యానము(Telugu) 03.10.2024

 

అంశం: త్రియేక దేవుని దీవెనలు 

 

"ప్రభువైన యేసుక్రీస్తు కృపయు దేవుని ప్రేమయు పరిశుద్ధాత్మ సహవాసమును మీకందరికిని తోడైయుండును గాక" - 2 కోరింథీయులకు 13:14

 

బైబిల్లో ఒకే దేవుడు అనే మాట తండ్రి కుమారా పరిశుద్ధాత్మ అని పిలవబడుతుంది కాబట్టి మన దేవుడు త్రియేక దేవుడుగా పనిచేస్తున్నారు. పైన చెప్పబడిన వాక్యం త్రియేక దేవుని యొక్క దీవెనలు యొక్క ప్రార్థనగా ప్రపంచమంతా ప్రతి ఆరాధన గుంపులోనూ, ప్రార్థన కూడికలోనూ ప్రార్థించబడుతుంది. ఈ దీవెన ప్రార్థనకు అనేకులు ప్రాముఖ్యత ఇవ్వకుండా వెళ్లిపోవుటలోనే శ్రద్ధ చూపిస్తూ ఉంటారు. దీనిని మనం సరి చేసుకోవాలి. త్రియేక దేవుని విశ్వసిస్తున్నాము అనేదాన్ని మనము ఒప్పుకొని త్రియేక దేవుని యొక్క దీవెనలు పొందుకొని వెళ్ళుటలో శ్రద్ధ కలిగి ఉంటాం.

 

దేవుడు మన యొక్క పరమ తండ్రి, ఆయన తన పిల్లలకు ప్రయోజనమైన సమస్తాన్ని కావలసిన అన్నింటిని ఇస్తున్నారు, దయ చూపిస్తున్నారు, సంరక్షిస్తున్నారు, నడిపిస్తున్నారు. తల్లి వలె మోస్తున్నారు తప్పించి కాపాడుతున్నారు. తమ రాజ్యాన్ని ఇచ్చుటకు సిద్ధంగా ఉన్నారు ఈ దేవుని ప్రేమ ఎంత గొప్పది. దీనిని అశ్రద్ధ చేయవచ్చా? కుమారుడైన యేసుక్రీస్తు కృప చేత మనకు రక్షణ దయచేసి ఉన్నారు. ఆయన కృపలోనే మనము చివరి వరకు రక్షణలో నిలిచి ఉండగలం కాబట్టి యనలేని ఆయన కృప జీవము కంటే శ్రేష్టమైనది. ఈ కృప మనము కోల్పోవచ్చా?

 

తర్వాత పరిశుద్ధాత్మ దేవుడు రక్షణ వైపు మనల్ని నడిపిస్తున్నారు. మనలను పరిశుద్ధపరిచే దేవుడు మనకు బోధించే వారు జ్ఞానము ఆలోచన బలము తెలివితేటలు దేవునికి భయపడుతున్న భయము వీటన్నింటినీ అనుగ్రహించేవారు మనల్ని పవిత్రపరిచి పరిశుద్ధత మీద పరిశుద్ధత కలవారిగా చేయువారు. మనతో మాట్లాడుతున్న దేవుడు పరిచర్య చేయుటకు మనల్ని పిలిచిన దేవుడు ఆత్మీయ వరాలు, బలాన్ని ఇచ్చే దేవుడు నడిపించే దేవుడు ఆయన ప్రసన్నత మనకు ఎంతగా అవసరమో?

 

ప్రియమైన వారలారా! ఇక రానున్న దినాలలో ఈ దీవెనకరమైన ప్రార్థన ప్రార్థించినప్పుడు మనం అశ్రద్ధ చేయకుండా త్రియేక దేవుడా మీయొక్క ప్రేమ, కృప, అన్యోన్యత సమస్త ఆశీర్వాదాలు ఎప్పుడు మాకు ఉండనివ్వండి కానీ శ్రద్ధ కలిగి ప్రార్ధించి దాటి వెళ్తే మంచిది. అలాగే అయితే త్రియేక దేవుని దీవెన మనలను నింపి నడిపించగలదు. ఆమెన్! 

- శ్రీమతి. గీత రిచర్డ్ గారు 

 

ప్రార్థన అంశం:-

25వేల గ్రామాలలో సువార్త ప్రకటించుటకు వెళ్తున్న సేవకుల యొక్క ప్రయాణ సంరక్షణ కొరకు ప్రార్థిద్దాం.

 

*Whatsapp*

ఈ దిన ధ్యాన సందశమును తమిళ్, ఇంగ్లీష్ , హిందీ, మలయాళం, తెలుగు, కన్నడ, పంజాబీ మరియు ఒరియా బాషలలో వాట్సాప్ త్వరా పొందుటకు *+91 94440 11864* అనే నెంబర్ ను సంబ్రదించగలరు.

 

www.vmm.org.in

ఈమెయిల్: info@vmm.org.in

Android App: https://play.google.com/store/apps/details?id=com.infobells.vmmorgin

 

విలేజ్ మిషనరీ మూమెంట్, విరుదునగర్, ఇండియా- 626001

ప్రార్ధనా అవసరాల కోసం: +91 94424 93250



hacklink satın al perabet perabet giriş safirbet safirbet giriş betasus betasus giriş virüsbet medusabahis medusabahis giriş grandpashabet grandpashabet giriş jojobet jojobet giriş vaycasino vaycasino giriş pusulabet pusulabet giriş perabet perabet giriş perabet perabet giriş matbet slot oyna perabet perabet giriş hiltonbet perabet perabet perabet betnano holiganbet galabet kalebet holiganbet