By Village Missionary Movement
Wednesday, 02-Oct-2024దిన ధ్యానము(Telugu) 02.10.2024
అంశం: వరుడు వస్తున్నారు
"వారు కొనబోవుచుండగా పెండ్లికుమారుడు వచ్చెను, అప్పుడు సిద్ధపడి యున్నవారు అతనితో కూడ పెండ్లి విందుకు లోపలికి పోయిరి" - మత్తయి 25:10
ఒక ఇంటర్వ్యూ కొరకు వెళ్లాలంటే అందుకొరకు సిద్ధపాటు పనులు చాలా అవసరం. చదివిన డాక్యుమెంట్లు, జిరాక్స్లు, గుర్తింపు కార్డులు అనే అనేక డాక్యుమెంట్స్ తీసుకొని వెళ్ళుట చాలా ప్రాముఖ్యం మరియు ఒక ప్రాముఖ్యమైన వ్యక్తిని మనం దర్శించాలి అంటే ఆ వ్యక్తితో నేరుగా మాట్లాడలేక పోతే వారి క్రింద ఉన్న వారితో మనం మాట్లాడి ఇంకా ఆ వ్యక్తి గురించి దర్శించవలసిన సమయం, స్థలము అని సమస్తాన్ని ఎరిగి సిద్ధపరచుకొనుట మనకు అలవాటు. ఇది సాధారణమైన లోకములో జరుగుతున్న సిద్దపాటు. ఇలానే భూమి, ఆకాశాన్ని తన నోటి మాటతో సృష్టించిన దేవుని దర్శించుటకు ఒక దినం వస్తుంది.
బైబిల్లో వరుణ్ణి దర్శించుటకు రెండు గుంపులు సిద్ధంగా ఉన్నాయి. ఆ గుంపులో ఐదుగురు బుద్ధి గలవారు మిగిలిన ఐదుగురు బుద్ధిలేనివారు. బుద్ధిగలవారు తమ దివిటీలతోపాటు తమ పాత్రలో నూనెను తీసుకుని వెళ్లారు. బుద్ధిలేని వారు దివిటీలు మాత్రమే పట్టుకుని వెళ్లారు. నూనెను తీసుకుని వెళ్ళలేదు. మధ్య రాత్రిలో ఇదిగో వరుడు వస్తున్నాడు ఆయనను ఎదుర్కొనుటకు సిద్ధపడుడి అనే మాట వినబడింది. ఆ సమయంలో బుద్ధిలేనివారు బుద్ధి గల వారితో మీ నూనెలో మాకు కొంచెం ఇవ్వండి మా దివీటిలో ఆరిపోతున్నాయి అని అడిగారు. అందుకు వారు మీరు అమ్ముకున్న వారి వద్దకు వెళ్లి కొనుక్కోండి అని చెప్పారు. ఆ సమయంలో సిద్ధపడిన వారు ఆ విందులో పెండ్లి కుమారుడుతో పాటు ప్రవేశించారు.
ప్రియమైన వారలారా! ఈ రెండు గుంపుల్లో మనం ఏ గుంపులో ఉంటున్నాం? మనం పరిశుద్ధతో సిద్ధపడి కనబడిన యెడల మనం వరుడుతో వెళ్ళిపోతాం లేదా రేపు అనే పరిస్థితి దాటించిన ఎడల నేను ఎవరో తెలుసా? నేను 50 సంవత్సరాల విశ్వాసిని, నేను సేవకున్ని, నేను సంఘమునకు ఎక్కువ కానుక ఇచ్చుటలో ప్రధానమైన వాడిని, సంఘంలో ఒక గొప్ప పదవి వహిస్తున్నాను అని చెబితే సరిపోదు. దానికి బదులుగా మనం పరిశుద్ధత కలిగి ఉన్నప్పుడు మాత్రమే మనము వరుడుతో కలిసి వెళ్లగలం. కాబట్టి అందరమూ పరిశుద్ధతను కాపాడుకుందాం పరిశుద్ధమైన దేవునితో పరలోకం వెళ్ళుటకు సిద్ధపడదాం. హల్లెలూయ!
- బ్రదర్. విలియమ్స్ గారు
ప్రార్థన అంశం:-
25వేల గ్రామాలలో సువార్త ప్రకటించుటకు దేవడు ద్వారాలు తెరుచులాగున ప్రార్థిద్దాం.
*Whatsapp*
ఈ దిన ధ్యాన సందశమును తమిళ్, ఇంగ్లీష్ , హిందీ, మలయాళం, తెలుగు, కన్నడ, పంజాబీ మరియు ఒరియా బాషలలో వాట్సాప్ త్వరా పొందుటకు *+91 94440 11864* అనే నెంబర్ ను సంబ్రదించగలరు.
www.vmm.org.in
ఈమెయిల్: info@vmm.org.in
Android App: https://play.google.com/store/apps/details?id=com.infobells.vmmorgin
విలేజ్ మిషనరీ మూమెంట్, విరుదునగర్, ఇండియా- 626001
ప్రార్ధనా అవసరాల కోసం: +91 94424 93250