Village Missionary Movement         கிராம மிஷனரி இயக்கம்

దిన ధ్యానము(Telugu) 01.10.2024
Share:

By Village Missionary Movement

Tuesday, 01-Oct-2024

దిన ధ్యానము(Telugu) 01.10.2024

 

అంశం: అభిగయేలు

 

"మృదువైన మాట క్రోధమును చల్లార్చును. నొప్పించు మాట కోపమును రేపును" - సామెతలు 15:1

 

ఉదయం తెల్లవారేలోగ నాబాలుకు కలిగిన సమస్తమును సర్వనాశము చేస్తాను అని చంపడానికి బయలుదేరిన దావీదును ఎవరూ ఆపగలరు? దావీదు మాత్రమే కాదు దావీదుతో పాటు 400 మంది కలిగిన పెద్ద గుంపును సమాధానపరుచుట ఎట్లు? దీనిని ఒక ఒంటరి వ్యక్తిగా అభిగయేలు అనే స్త్రీ వాళ్లను శాంతింప చేసినది అని చదివినప్పుడు ఆశ్చర్యం అనిపిస్తుంది కదూ? దేవుడు తన యొక్క పనిలో పెద్ద కార్యాలను చేయుటకు బలహీనమైన పాత్రను ఎలా వాడుకుంటున్నారో ఈ దినము సందేశంలో ధ్యానిద్దాం.

 

అభిగయేలు అనే పేరునకు అర్థము సంతోషమునకు కారకురాలు కానీ దుష్టుడైన తన భర్త నాబాలు నుండి సంతోషం లేకుండా ఉండి ఉండవచ్చు. కానీ ఆమె తెలివితేటలు కలిగిన స్త్రీగా కనబడింది. తన భర్త నాబాలు దావీదుకు చేసినది ఆమె విన్న వెంటనే అభిగయేలు తొందరపడి దావీదుతో సమాధానము కొరకు త్వర త్వరగా ముందుకు అడుగులు వేసింది. మొట్టమొదటిగా ఉపచారం అనగా మార్గమధ్యంలోనే విందు పెట్టుట అనే కార్యాన్ని పని వాళ్ళ ద్వారా తనకు ముందు పంపించి దావీదును దర్శించింది. గాడిద పైన వచ్చిన వారు ఎవరు? ఎందుకొరకు వారికి ఆహారము ఇస్తున్నారు అని ఆలోచిస్తూ ఉండగానే అభిగయేలు దావీదు యొక్క పాదముల పైన పడి సాష్టాంగ నమస్కారం చేసింది. తన ముందు సాష్టాంగ పడియున్న ఆ స్త్రీ నాబాలు యొక్క భార్య అభిగయాలు అని గుర్తించాడు దావీదు. అభిగయేలు యొక్క నెమ్మది అయిన మాటలతో దావీదు యొక్క కఠినమైన హృదయము కరిగింపజేసింది. అభిగయేలు యొక్క మాటలు వట్టి మాటలు కాదు అందులో దేవుని సత్యము కృపతో నిండిన కార్యములు ఉన్నాయి. అభిగయేలు యొక్క నడవడిక దావీదుతో పాటు వచ్చిన వారందరినీ ఆమె శాంతింపజేసినది అంటే ఎంత ఉన్నతమైనది ప్రేమతో కూడిన ఉపచారము వలన దీనత్వం గల హృదయము అలానే మృదువైన మాటలు అన్ని దావీదులో కనబడిన కీడుకు ప్రతి కీడు చేయాలి అని తన భర్తను చంపాలి అనే ఆ తలంపు ఆమె చల్లార్చి వేసింది. అవును అభిగయేలు తన గుణాతిశయము చేత కఠినమైన పరిస్థితిని గెలిచింది. బుద్ధి కలిగిన స్త్రీ తన ఇంటిని కట్టుకుంటుంది (సామెతలు 14:1).

 

 అభిగయేలు కుటుంబంలో ఉన్న సమస్యలు మీకు ఉండిన యెడల ఈ దిన సందేశము మీ కొరకే అని నేను విశ్వసిస్తున్నాను. సమస్యలను చూచి ఏడుస్తూ ఉండకుండా దేవుడు సహాయముతో ప్రార్థించి వాటిని అధిగమించుటకు ప్రయాసపడండి. అభిగయేలుకు మేలు చేయుటకు ముందుకు వచ్చిన ప్రభువు మిమ్మల్ని కూడా నడిపించును గాక! అతి త్వరలో లేకుండా పోతున్న ఈ లోకంలో ఉన్న ఉపద్రవాలు నిత్య ఘన మహిమగల పరలోకానికి మనల్ని తీసుకుని వెళుతుంది. ఆమెన్! 

- బ్రదర్. జాకబ్ శంకర్ గారు. 

 

ప్రార్థన అంశం:

ఈ ఈ నెల మిషనరీ పరిచర్య కొరకు వారి యొక్క సంరక్షణ కొరకు ప్రార్థిద్దాం.

 

*Whatsapp*

ఈ దిన ధ్యాన సందశమును తమిళ్, ఇంగ్లీష్ , హిందీ, మలయాళం, తెలుగు, కన్నడ, పంజాబీ మరియు ఒరియా బాషలలో వాట్సాప్ త్వరా పొందుటకు *+91 94440 11864* అనే నెంబర్ ను సంబ్రదించగలరు.

 

www.vmm.org.in

ఈమెయిల్: info@vmm.org.in

Android App: https://play.google.com/store/apps/details?id=com.infobells.vmmorgin

 

విలేజ్ మిషనరీ మూమెంట్, విరుదునగర్, ఇండియా- 626001

ప్రార్ధనా అవసరాల కోసం: +91 94424 93250



hacklink satın al