Village Missionary Movement         கிராம மிஷனரி இயக்கம்

దిన ధ్యానము(Telugu) 30.09.2024
Share:

By Village Missionary Movement

Monday, 30-Sep-2024

దిన ధ్యానము(Telugu) 30.09.2024

 

అంశం: వెనుదురుగకు 

 

"యేసునాగటిమీద చెయ్యిపెట్టి వెనుకతట్టు చూచు వాడెవడును దేవుని రాజ్యమునకు పాత్రుడుకాడని వానితో చెప్పెను" - లూకా 9:62

 

డాక్టర్ చార్లెస్ లాంబి సూడన్ దేశంలో వైద్య మిషనరీగా పరిచర్య చేస్తూ ఉన్నాడు. ఈయన 1917 వ సంవత్సరంలో తన సొంత దేశమైనా అమెరికాకు వెళ్లాడు. అప్పుడు ఆయనతో ఉండిన తన స్నేహితుడు చార్లెస్ లాంబిని మరల మీరు సుడాన్ దేశంలోకి వెళ్ళకుండా అమెరికాలో ఉండమని బలవంతం చేశారు. సూడాన్ లో ఇన్ని రోజులు కష్టపడి పరిచర్య చేసినది చాలు ఇక ఇక్కడ ఉండి నాతో నా హాస్పిటల్లో పనిచేయండి కొన్ని సంవత్సరాల తర్వాత ఆ హాస్పటల్ నీకే ఇచ్చేస్తాను అని అన్నాడు. ఈ అరుదైన అవకాశాన్ని విడిచి పెట్టకండి అని అన్నారు. దానిని విన్నచార్లెస్ కలత చెందాడు. మిషనరీల కొరకలో జరిపించబడిన కూడికల పాల్గొన్నారు అయిననూ తన హృదయములో ఉన్న ఆ కలత పోలేదు. ఆయన పడుకున్నప్పుడు ఆయనకు ఒక కల వచ్చింది. దాంట్లో ఉత్తర తూర్పు ఆఫ్రికా మ్యాప్ కనబడింది. దాంట్లో నుండి ఒక అనారోగ్యము గల చేయి వచ్చి దానిని పట్టుకోమని అతని వైపు చాపబడింది. ఈ చేతిని పట్టుకోవాలా వద్దా అని ఆలోచించుకొని చివరికి దానిని పట్టుకున్నారు. అప్పుడు అది మేకులతో కొట్టబడిన యేసయ్య హస్తముగా మారింది. వెంటనే సుడాన్ దేశంలో పరిచర్య చేయుటకు దేవుడు పిలుస్తున్నారు అని చెప్పి సుడాన్ దేశంనకు పరిచర్యకు వెళ్లారు.

 

మానవులమైన మన యొక్క గుణాతిశయము ఏమిటంటే జీవితంలో కొన్ని పరిస్థితుల్లో మనుషుల యొక్క మాటలు, పరిస్థితులు మనలను సులువుగా వెనుదిరిగేటట్లు చేస్తుంది. దేవుని వెనకు వెళ్లిన శిష్యుడైన పేతురుతో ఈ బండ మీద నా సంఘమును కట్టెదవు అని చెప్పి నప్పటికి యేసయ్య మరణించిన తర్వాత ఆయన చేపలు పట్టుకొనుటకు వెళ్ళిపోయాడు అప్పుడు దేవుడు నిరుత్సాహం కలిగి ఉంటారు కానీ ఆయన మరల ఆయనను విడిచి పెట్టకుండా ఆయన 153 పెద్ద చేపలు పట్టుటకు దేవుడు కార్యము చేశాడు. ఏలియా ఎజెబేలుకు భయపడి తన కార్యమును తన పనిని విరమించుకోవాలి అని ఆలోచించినప్పుడు దేవుడు అతనికి ప్రత్యక్షమై ఏలియా తనను మరలా వెంబడించినట్లు చేశారు. అద్భుతంగా దేవుడు తన దూతను పంపించారు తన ద్వారా చేయబోతున్న కార్యాన్ని వివరించారు.

 

ప్రియమైన వారలారా! మీరు చేసే పని, వ్యాపారము, పదవి ఏది కూడా మీరు వెతికితే రాలేదు దేవుడే మీకు దయచేసి యున్నారు. వీటిలో యదార్థముగా ఉండండి సగంలో విడిచిపెట్టి వెళ్లిపోకండి నిరుత్సాహము అపజయం వచ్చినట్లు ఉన్నా మీరు యదార్ధంగా ఉండేటప్పుడు మనము అడుగుతున్న దానికంటే ఊహించిన దాని కంటే అధికముగా ఇచ్చే దేవుడు అనేకులకు ప్రయోజనకరమైన వారిగా మనలను మారుస్తారు. ఇది కచ్చితంగా! మీ పని స్థలాలలో మీరు చేస్తున్న పరిచర్య చిన్నదైనప్పటికీ నిరుత్సాహ పడకుండా ఉండండి మీరు చిన్న పరిచర్యలో యదార్ధంగా ఉండేటప్పుడు ఆయన విస్తారంగా వర్ధిల్లుంప చేస్తారు.

- శ్రీమతి. అనుబు జ్యోతి స్టాలిన్ గారు 

 

ప్రార్థన అంశం:-

చత్తీస్గడ్ రాష్ట్రంలో పరిచర్య చేస్తున్న మన మిషనరీ కుటుంబాల కొరకు ప్రార్థిద్దాం.

 

*Whatsapp*

ఈ దిన ధ్యాన సందశమును తమిళ్, ఇంగ్లీష్ , హిందీ, మలయాళం, తెలుగు, కన్నడ, పంజాబీ మరియు ఒరియా బాషలలో వాట్సాప్ త్వరా పొందుటకు *+91 94440 11864* అనే నెంబర్ ను సంబ్రదించగలరు.

 

www.vmm.org.in

ఈమెయిల్: info@vmm.org.in

Android App: https://play.google.com/store/apps/details?id=com.infobells.vmmorgin

 

విలేజ్ మిషనరీ మూమెంట్, విరుదునగర్, ఇండియా- 626001

ప్రార్ధనా అవసరాల కోసం: +91 94424 93250



hacklink satın al