Village Missionary Movement         கிராம மிஷனரி இயக்கம்

దిన ధ్యానము(Telugu) 28.09.2024
Share:

By Village Missionary Movement

Saturday, 28-Sep-2024

దిన ధ్యానము(Telugu) 28.09.2024

 

అంశం: త్యాగమునకు ఫలితము కలదు 

 

“మరియు ప్రస్తుతమందు సమస్తశిక్షయు దుఃఖకరముగా కనబడునేగాని సంతోషకరముగా కనబడదు. అయినను దానియందు అభ్యాసము కలిగినవారికి అది నీతియను సమాధానకరమైన ఫలమిచ్చును” - హెబ్రీయులకు 12:11

 

బైబిల్లో అనేకులు శిక్ష అనుభవించి త్యాగము చేసిన పాత్రలుగా జీవించి దణ్యత పొందుకున్న దాన్ని మన గ్రహించుచున్నాము. నయోమి తన జీవితంలో శిక్ష అనుభవించి గొప్ప భాగ్యవంతురాలుగా మారిన దాన్ని చూస్తున్నాం. మారా అనే ప్రాంతంలో నీరు మధురమైనట్లు నయోమి ఆశీర్వాదకరముగా మారావంటి జీవితం మధురంగా మారింది. యోబు త్యాగపూరితమైన జీవితముతో అనేక కష్టాలను అనుభవించాడు. తర్వాత రెండంతల ఫలితాన్ని యోబు తన జీవితంలో పొందుకున్న దానిని మనం చూస్తున్నాం.

 

మిషనరీల యొక్క తండ్రి అని పిలవబడుతున్న విలియం కేరి జీవిత మార్గంలో ఆయన బైబిల్ ని తర్జుమా చేసిన పత్రికలు అలానే అచ్చు యంత్రము మరియు తన గుడారము ఒక రాత్రిలో అగ్నికి గురై బూడిదయింది. తన పిల్లలు, భార్య అనారోగ్యమునకు గురైనప్పటికీ ప్రయాసపడి పనిచేసి అనేక శ్రమల మధ్యలో కూడా త్యాగము చేసే వాడిగా జీవించి యున్నాడు. మారని క్రైస్తవ చరిత్రలో చోటు సంపాదించుకున్నాడు. మరణించి ఈ దినం వరకు మాట్లాడుతూ ఉన్న విలియం కేరి జీవితం ఇంకను మనతో మాట్లాడుతున్న ఉంది.

 

థామస్ ఆల్వా ఎడిషన్ వందలకు పైగా కార్యాలను కనుగొన్నాడు. ఆయన వచ్చిన ప్రఖ్యాతినీ గూర్చి ఆయన పొంగిపోకుండా తన యొక్క త్యాగపూరితమైన ఫలితం అరుదైన వస్తువులను తయారుచేసినప్పుడు అది అగ్నికి గురైంది వెంటనే తన యొక్క భార్య రెండు లక్షల డాలర్లకు పైబడిన వస్తువులన్నీ కూడా బూడిదయిపోయి అని ఏడ్చింది కానీ ఎడిషన్ మన అందరి తప్పిదములు కూడా ఈ అగ్నిలో బూడిద అయిపోయాయి అని భార్యతో చెప్పాడు. మొట్టమొదటిగా దేవునికి కృతజ్ఞతలు చెల్లించి దీనిని దేవుడు మేలుకొరకే మన జీవితంలో అనుమతించారు ఏ ఒక్క నష్టం వచ్చినా అది మేలును తనలో దాచుకొని మన వద్దకు వస్తుంది కాబట్టి మనం ముందుకు వెళ్లి పనిచేసి దాన్ని కడుక్కుందాం అన్నారు. అన్నిటికి పైగా మన ప్రభువైన యేసుక్రీస్తు యొక్క త్యాగము లోక చరిత్రలో ప్రాముఖ్యమైనది ఆయన వైపే తేరిచూచి మన ముందుకు నడుస్తాం కాబట్టి మీ జీవితంలో వచ్చే శ్రమలు అపజయాలు చేదైనా అనుభవాలు అని ఆలోచించి నిరుత్సాహపడిపోకుండా ముందుకు వెళ్ళండి. 

 

"సిలువ లేకుండా రక్షణ లేదు 

ఎర్ర సముద్రం లేదు లేక కానాను లేదు 

శోధన లేకుండా సాధన లేదు 

వేదన లేకుండా విజయం లేదు" 

 

- బ్రదర్. శామ్యూల్ మోరీస్ గారు 

 

ప్రార్థన అంశం:

సంఘములు లేని మన పార్టనర్ షిప్ మిషనరీలకు సంఘములు కట్టబడే లాగున ప్రార్థిద్దాం.

 

*Whatsapp*

ఈ దిన ధ్యాన సందశమును తమిళ్, ఇంగ్లీష్ , హిందీ, మలయాళం, తెలుగు, కన్నడ, పంజాబీ మరియు ఒరియా బాషలలో వాట్సాప్ త్వరా పొందుటకు *+91 94440 11864* అనే నెంబర్ ను సంబ్రదించగలరు.

 

www.vmm.org.in

ఈమెయిల్: info@vmm.org.in

Android App: https://play.google.com/store/apps/details?id=com.infobells.vmmorgin

 

విలేజ్ మిషనరీ మూమెంట్, విరుదునగర్, ఇండియా- 626001

ప్రార్ధనా అవసరాల కోసం: +91 94424 93250



hacklink satın al