Village Missionary Movement         கிராம மிஷனரி இயக்கம்

దిన ధ్యానము(Telugu) 27.09.2024
Share:

By Village Missionary Movement

Friday, 27-Sep-2024

దిన ధ్యానము(Telugu) 27.09.2024

 

అంశం: పరలోకపు నిధి 

 

"కాబట్టి మీరు ఆయన రాజ్యమును నీతిని మొదట వెదకుడి; అప్పుడవన్నియు మీకనుగ్రహింపబడును" - మత్తయి 6:33

 

ప్రస్తుత కాలంలో అనేకులు అనేక మైన విధానాలలో డబ్బులు సంపాదిస్తున్నారు. పని, వ్యాపారము అనే ఎన్నో రకముల విధానాల్లో డబ్బులు సంపాదిస్తున్నారు. సర్కస్లో మరణాంతకరమైన లోయ ఒకటి అమర్చి బైక్ పైన ఇద్దరు వ్యక్తులు ఒకరికి ఒకరు వ్యతిరేకముగా నడుస్తూ సాహసం చేస్తూ ఉన్నారు. ఉయ్యాలలో ఒకపక్క విడిచిపెట్టి మరొక పక్కన పట్టుకుని ఎగురుతూ మరియు సింహము, పులి, ఎలుగుబంటి, కోతి వీటన్నిటిని వాడుకుని డబ్బులు సంపాదిస్తూ ఉంటారు. క్రికెట్ ఆటలో దేశానికి దేశము ముందే ప్రకటించి దాని కొరకు తర్ఫీదు పొంది ఆటలో విజయాన్ని పొందుకున్న వారికి కోట్ల కొలదిగా డబ్బులు బహుమానంగా ఇస్తూ ఉంటారు. ఈ విధానంలో విజయము పొందుకున్న వారికి ప్రశంసలు ఎక్కువ అందుతూ ఉంటాయి. చదువులోనూ ఏ చదువు చదివితే ఉన్నత స్థాయికి రావచ్చు అని ఎరిగి లాయర్గా, ఐఏఎస్ అలానే డాక్టర్ అని శ్రేష్టమైన చదువుల కొరకు కఠినమైన ప్రయాస పడుతున్నారు. అవన్నీ మంచివే అందులో తప్పిదం లేదు.

 

యేసుక్రీస్తు డబ్బు కొరకు అనే ఉపమానములు చెప్పియున్నారు అందులో ఒకటి ధనవంతుడు అయినా ఒకరి పొలము బాగా పండింది. అయితే ఆ బాగా పండిన పంటను తన స్థలములో సమకూర్చి పెట్టుటకు స్థలము లేక దానిని పెద్దదిగా కట్టి తన ప్రాణముతో నా ప్రాణమా తినుము, త్రాగుము, సుఖించుము అని మాట్లాడుతూ ఉన్నాడు. అయితే దేవుడైతే అతనిని చూచి ఓ వెర్రివాడ ఈ దినము నీ ప్రాణము నీ యొద్ద నుండి తీసివేయబడుతుంది అప్పుడు నీవు సమకూర్చినవి ఎవరికి అని దేవుడు అడుగుతున్నారు.

 

నా ప్రియమైన వారలారా! ఈ లోకంలో మనం జీవించుటకు డబ్బు అవసరమే కానీ ఆ డబ్బే మన ఊపిరిగా మారిపోకూడదు. ఎక్కువ డబ్బులు సంపాదించవచ్చు అయితే అందుకు దేవుడు ఇచ్చే జవాబు తెలివిగలవానికి తెలివి చాలదు, ఐశ్వర్యము పొందుటకు జ్ఞానము చాలదు. అన్నిటికీ సమయము దేవుని కార్యము ఉండాలి కాబట్టి మనము మొట్టమొదటిగా దేవుని వెతికిన యెడల మిగతావన్నీ కూడా మనకు ఆయన సంపూర్ణంగా ఇస్తారు. మనము భూలోకంలో జీవించే దినాలలో ఆత్మ కొరకు అవసరమైన యేసయ్యను వెతుకుదాం. ఈ లోకంలో మనం కలిగినవన్నీ కూడా సమాప్తం అయిపోతాయి. నిత్యజీవమునకు ఏది కూడా రాదు. పరలోక నిధి మాత్రమే మనతో వస్తుంది కాబట్టి పరలోక జీవితం జీవించుటకు ఆశిద్దాం. ఈ ఆలోచన మన అనుదిన జీవితంలో నిండిపోనివ్వండి. డబ్బులు సంపాదించుటకు ప్రాముఖ్యత ఇచ్చి మన ప్రాణాన్ని కోల్పోకుండా జాగ్రత్త పడదాం. ఆలోచిద్దాం, పని చేద్దాం.

- బ్రదర్. జి. పి. పచ్చయ్య ముత్తు 

 

ప్రార్థన అంశం:-

కరపత్రిక పరిచర్య ద్వారా కరపత్రికలను అందుకుంటున్న వారు రక్షింపబడేటట్లు ప్రార్థిద్దాం.

 

*Whatsapp*

ఈ దిన ధ్యాన సందశమును తమిళ్, ఇంగ్లీష్ , హిందీ, మలయాళం, తెలుగు, కన్నడ, పంజాబీ మరియు ఒరియా బాషలలో వాట్సాప్ త్వరా పొందుటకు *+91 94440 11864* అనే నెంబర్ ను సంబ్రదించగలరు.

 

www.vmm.org.in

ఈమెయిల్: info@vmm.org.in

Android App: https://play.google.com/store/apps/details?id=com.infobells.vmmorgin

 

విలేజ్ మిషనరీ మూమెంట్, విరుదునగర్, ఇండియా- 626001

ప్రార్ధనా అవసరాల కోసం: +91 94424 93250



hacklink satın al