By Village Missionary Movement
Thursday, 26-Sep-2024దిన ధ్యానము(Telugu) 26.09.2024
అంశం: జీవము మరియు జీవాధిపతి
"నీవు నా దాసుడవనియు నేను నిన్ను ఉపేక్షింపక యేర్పరచుకొంటిననియు నేను నీతో చెప్పియున్నాను నీకు తోడైయున్నాను భయపడకుము నేను నీ దేవుడనై యున్నాను దిగులుపడకుము నేను నిన్ను బలపరతును నీకు సహాయము చేయువాడను నేనే నీతియను నా దక్షిణహస్తముతో నిన్ను ఆదుకొందును" - యెషయా 41:10
జాన్ ఫ్రెండ్స్ అనే బోధకుడు మార్టిన్ లూథర్ యొక్క స్నేహితుడు. ఐదవ చార్లెస్ అనే సర్వాధికారం కలిగిన రాజు బోధకుడు జాన్ జీవించిన పట్టణమునకు ఒక సైన్యమును పంపి బోధకున్ని పట్టుకొని వచ్చి శిక్షించాలి అని నిర్ణయించుకున్నాడు. బోధకుడు తన ప్రాణాన్ని కాపాడమని ప్రార్థించాడు. ప్రభువు ఆయనతో రొట్టెను నీళ్లను తీసుకుని దగ్గర ఉన్న వీధికి వెళ్ళాము తెరవబడిన ఇల్లు చూచెదవు అక్కడికి వెళ్లి పురిపాక కింద భాగంలో గల స్థలములో పండుకొని ఉండుము అన్నాడు. అలానే బోధకుడు వెళ్లి పండుకున్నాడు. రోజు ఒక కోడి అక్కడికి వచ్చి ఒక గుడ్డు పెట్టి వెళ్తూ ఉండేది. 14 రోజులు గడిచాయి 15వ రోజున కోడి రాలేదు. సైన్యము వెళ్ళిపోయింది అని ప్రజలు మాట్లాడుకొనుట విన్నాడు. ఆయన బయటికి వచ్చాడు ప్రభువు తన ప్రాణాన్ని ఎంతగా సంరక్షించాడో అని ఆయన ఎరిగి దేవుని స్తుతించాడు. మనలో అనేకమంది రోగముల చేత ఇబ్బంది పడుతూ ఉండవచ్చు, వైద్యులు మన చేయి విడిచిపెట్టి ఉండవచ్చు, ఆయినను కలవరపడొద్దు. ఆయన గాయములు చేత మీరు స్వస్థపరచబడి ఉన్నారు అనేదాన్ని విశ్వసించిన యెడల మీరు స్వస్థత పొందుకుంటారు. అప్పుల భారంలతో నిందలు పొందుకొని అప్పులు తీర్చే దారి లేక ఆత్మహత్య చేసుకోవాలని ఆలోచిస్తున్నారా? 2వ రాజుల గ్రంథము 4వ అధ్యాయము ఏడవ వచనంలో గల సంఘటన చూడండి ప్రవక్త యొక్క శిష్యుని భార్య అప్పు తీర్చే దారి తెలియక ఎలీషా యొద్దకు ఆమె రావడం చూస్తాం. అప్పు ఇచ్చినవాడు ఆమె యొక్క ఇద్దరి కుమారులను దాసులుగా తీసుకుని వెళ్లిపోవడం కొరకు సిద్ధంగా ఉన్నాడు. తల్లి హృదయం అల్లాడిపోతుంది బంధువులను స్నేహితులను ఆమె సహాయము కోరలేదు దేవుని వద్ద చేరుకొని ప్రవక్తను వెతికింది. ఫలితము ఆయన మాట ప్రకారం చేసినది అప్పుల బాధల నుండి విడిపించబడి జీవాధారమైన మార్గము తెరవబడింది.
ప్రియమైన వారలారా మీరు కూడా పరిచర్య చేసే స్థలంలో వ్యతిరేకత ఉంటున్నాయా? హత్య చేస్తామని బెదిరిస్తున్నారా? భయపడవద్దు. తల్లి కంటే మిన్న అయిన ప్రేమ కలిగిన దేవుడు మనల్ని కాపాడుతారు. లూకా సువార్త 12:7వ వచనంలో మన తలలో గల వెంట్రుకలన్నీ కూడా లెక్కించగలిగిన దేవుడు చెబుతున్న మాట పక్షులు కంటే మీరు శ్రేష్టమైన వారు అని. ప్రభు యొక్క అనుమతి లేకుండా మన జీవితంలో ఏదీ జరగదు. మన యొక్క జీవము జీవాధిపతి అయిన యేసయ్య వద్ద ఉన్నది కనుక భయపడవద్దు, కలవరపడవద్దు దేవుడు మీతోనే ఉన్నారు.
- శ్రీమతి. వనజ పాల్ రాజ్ గారు
ప్రార్థన అంశం:-
ప్రతి గురువారం జరుగుతున్న హాస్పిటల్ మినిస్ట్రీలో దర్శింపబడుతున్న వ్యక్తుల గురించి ప్రార్థిద్దాం.
*Whatsapp*
ఈ దిన ధ్యాన సందశమును తమిళ్, ఇంగ్లీష్ , హిందీ, మలయాళం, తెలుగు, కన్నడ, పంజాబీ మరియు ఒరియా బాషలలో వాట్సాప్ త్వరా పొందుటకు *+91 94440 11864* అనే నెంబర్ ను సంబ్రదించగలరు.
www.vmm.org.in
ఈమెయిల్: info@vmm.org.in
Android App: https://play.google.com/store/apps/details?id=com.infobells.vmmorgin
విలేజ్ మిషనరీ మూమెంట్, విరుదునగర్, ఇండియా- 626001
ప్రార్ధనా అవసరాల కోసం: +91 94424 93250