By Village Missionary Movement
Wednesday, 25-Sep-2024దిన ధ్యానము(Telugu) 25.09.2024
అంశం: భయము
"దేవుడు మనకు శక్తియు ప్రేమయు, ఇంద్రియ నిగ్రహమును గల (స్వస్థబుద్ధియుగల ఆత్మనే) ఆత్మనే యిచ్చెను గాని పిరికితనముగల ఆత్మనియ్యలేదు" - 2 తిమోతికి 1:7
ప్రపంచంలో చిన్న వాళ్ళు మొదలుకొని పెద్దల వరకు అనేక కార్యముల కొరకు భయపడుతూ ఉంటారు. చీకటి భయం, ట్రాఫిక్ భయం, రోగము, చదువు, పని, భవిష్యత్తు, మరణ భయము అని చెబుతూ వెళ్ళవచ్చు. కోవర్డ్ అనే దేవుని దాసుడు చెబుతున్నారు క్రీస్తు యొక్క లేఖన మాటలే మనలను భయము నుండి మనల్ని కాపాడగలుగుతుంది అన్నారు. ఒక యవ్వన సేవకుడు తనకు వచ్చిన రోగము నిమిత్తము మిక్కిలి అనారోగ్యానికి గురయ్యాడు. రోగం వల్ల వచ్చే వ్యాధులతో బాధపడుతూ ఉండేవాడు ఎన్ని మందులు తీసుకున్న ప్రయోజనం లేదు. ఒక విధమైన భయం అతన్ని ఆవరించింది ఎందుకంటే ఇదే రోగము దీర్ఘకాలంగా ఉండి పోతుందా దీర్ఘకాలికంగా నా శరీరము ఈ వ్యాధుల్లో ఉండిపోవాల్సి వస్తుందా అని ఆలోచించి భయపడ్డారు. వెంటనే ఆలోచించారు యేసయ్య నన్ను విమోచించండి లేదంటే నీ సన్నిధికి తీసుకోనండి అని సంపూర్ణంగా తనను తాను సమర్పించుకుని దేవునికి ప్రార్థించాడు. కొన్ని దినములు తర్వాత శరీర వ్యాధులు తట్టుకునే బలము దొరికింది. మరికొన్ని దినముల తర్వాత ఆయన రోగము నుండి సంపూర్ణమైన ఆరోగ్యం పొందుకున్నాడు.
ఇలానే బైబిల్లో కూడా రాజైన హిజ్కియా అనారోగ్యానికి గురయ్యాడు యెషయా ప్రవర్త ద్వారా దేవుడు నీవు మరణిస్తావు నీ ఇంటినీ చక్కబెట్టుకోమని వార్త పంపారు కానీ హిజ్కియా రాజయితే ఈ వార్తలు వినిన తర్వాత తన గురించి దుఃఖపడలేదు కానీ ఆయన గోడ వైపు తిరిగి దేవుని వైపు చూచి ఏడుస్తున్నాడు. వెంటనే దేవుడు కార్యము చేసాడు తన రోగమునకు మందు చెప్పి మరణాంతకారమైన రోగము నుండి విడిపిస్తున్నాను దానికి గుర్తుగా గడియారంలో ముళ్ళు పది మెట్లు వెనకకు వెళ్లేటట్లు బలమైన కార్యాలు చేస్తాను అని అన్నారు. మనం లోకంలో ఉండేటప్పుడు భయపడుట సహజము కానీ ఆ భయం వల్ల సమస్యలు, రోగములను చూడకుండా వాటిని మనుషులతో చెప్పి ఏడవకుండా దేవుని యొద్ద చెప్పి ఏడ్చినప్పుడు పరిష్కారం దొరుకుతుంది. మనము దేవుని యొక్క సర్వశక్తి ఎదుట మనం భయపడుతున్న కార్యము ఎంత మాత్రము పెద్దది కాదు. దీనిని చదువుతున్న స్నేహితులారా చీకటిని వెలుగుగా మార్చిన దేవునితో మాత్రమే నడుస్తున్నారు. ఆయనను దగ్గర పెట్టుకొని భయము అని చీకటితో మన జీవించవలసిన అవసరం లేదు కాబట్టి ఆయన పైన ఆనుకుని చీకటినీ వెలుగుగా మార్చండి భయాన్ని మీ నుండి దూరం చేయండి. ఆయనను పట్టుకునేటప్పుడు దేవుడు మన జీవితంలో బలాన్ని ప్రత్యక్ష పరుస్తారు. అసాధారణమైన విధముగా పనిచేస్తారు. భయపడకుడి ఆ వాగ్దానములు అన్ని బైబిల్లో చెప్పబడి ఉంది కానీ ఆ వాగ్దాలన్నీ కూడా పట్టుకొని భయం వచ్చినప్పుడు దేవుని సన్నిధిలో పడి ఆయనకు ప్రార్థించండి. దేవుడు భయాన్ని తీసివేస్తారు. హల్లెలూయ!
- శ్రీమతి. జాస్మిన్ పాల్ గారు
ప్రార్థన అంశం:
మన ఆఫీస్ పనుల కొరకు మరియు పరిచర్య చేస్తున్న సేవకుల కొరకు ప్రార్థిద్దాం.
*Whatsapp*
ఈ దిన ధ్యాన సందశమును తమిళ్, ఇంగ్లీష్ , హిందీ, మలయాళం, తెలుగు, కన్నడ, పంజాబీ మరియు ఒరియా బాషలలో వాట్సాప్ త్వరా పొందుటకు *+91 94440 11864* అనే నెంబర్ ను సంబ్రదించగలరు.
www.vmm.org.in
ఈమెయిల్: info@vmm.org.in
Android App: https://play.google.com/store/apps/details?id=com.infobells.vmmorgin
విలేజ్ మిషనరీ మూమెంట్, విరుదునగర్, ఇండియా- 626001
ప్రార్ధనా అవసరాల కోసం: +91 94424 93250