By Village Missionary Movement
Tuesday, 24-Sep-2024దిన ధ్యానము(Telugu) 24.09.2024
అంశం: దీన మనస్సు
"మనుష్యుడా, యేది ఉత్తమమో అది నీకు తెలియజేయబడియున్నది; న్యాయముగా నడుచుకొనుటయు, కనికరమును ప్రేమించుటయు, దీనమనస్సు కలిగి నీ దేవుని యెదుట ప్రవర్తించుటయు, ఇంతేగదా యెహోవా నిన్నడుగుచున్నాడు" - మీకా 6:8
షామిలి జో కంబోడియా దేశంలో మిషనరీగా పరిచయం చేసిన సహోదరి. ఆమె చక్కగా చదువుకున్న తెలివిగల ఫిజియోథెరపిస్ట్ మంచి ధనవంతులైన కుటుంబమునకు చెందిన వ్యక్తిగా ఉన్నప్పటికీ కంబోడియా దేశంలో ఒక పాకను నిర్మించి దానిలో వైద్య సేవలను చేస్తూ వచ్చారు. మరియు యుద్ధంలో చేతులు కాళ్లు కోల్పోయిన యుద్ధ సైనికులకు సేవ చేసి వాళ్ళందరికి సువార్త ప్రకటించారు. అత్యవసర పరిస్థితుల్లో షామిలి జో సైనికుల పుండ్లను తుడిచి బ్యాండేజ్ వెయ్యమని చెప్పారు. ఈమె నేనొక ఫిజియోథెరపిస్ట్ అని చెప్పకుండా ఉన్నత అధికారులకు లోబడి తన దీనత్వాన్ని సమర్పణతో చూపించి పరిచర్య చేశారు. అవును దేవుడు మన యొద్ద ఎదురుచూస్తున్న కార్యము లేదా దేవుడు కోరుకుంటున్న కార్యము దీన మనస్సు. ఇతరులకు భయపడి లేదా ఇతరులకు ఇష్టమైన వారిగా ఉండుటకు మనము దీన మనస్సు కలవారిగా ఉండకుండా మనస్ఫూర్తిగా యధార్ధముగా విధేయత గల వారిగా దీన మనసు గలవారిగా ఉండటయే దీనత్వం.
ఇలా దీనత్వంను యేసు తన జీవితంలో చూపించారు. మానవజాతి యొక్క రక్షణ ప్రణాళిక కొరకు పరలోక జీవితాన్ని విడిచి మనిషిగా ఈ లోకానికి దిగివచ్చారు. ఆయన భూమిపైన జీవించిన దినములన్నీ కూడా సంపూర్ణ మనిషిగా జీవించారు. చాలా అల్పమైన సాధారణమైన జీవితం కఠినమైన పరిస్థితిలో అన్నింటినీ ఇష్టపడి సహించుకుని జీవించారు. చివరికి సిలువలో హేళన చేయబడి ఉమ్మి వేయబడి కొరడాలతో కొట్టబడి సిలువ మ్రానుపై వేలాడి మరణించారు. సమస్తాన్ని మన కొరకే అంగీకరించారు. ఇంతగా మనలను మనం తగ్గించుకోవాలి ఎందుకంటే మనం మట్టిలో నుండి సృష్టించబడిన వారం కానీ అనేక సమయాల్లో సృష్టింపబడిన స్థానాన్ని మరిచిపోయి మనము ఆకాశమంత హెచ్చుగా ఉన్నట్టు అనుకుంటున్నాం. మనము మట్టి వారమని దేవుడు గుర్తిస్తున్నారు. మనం అదే విధముగా దీనత్వాన్ని ధరించనప్పుడు మనలోనికి హెచ్చించే గర్వము వచ్చే అవకాశం ఉంది కానీ మనలను మనం తగ్గించుకున్నప్పుడు ఆయన మనలను విడిచి పెట్టే దేవుడు కాడు అందుకనే అయన మనపైన కృప చూపిస్తున్నారు. దీన మనస్సు గల వారిని చూచి అయన దీవించుటకు సిద్ధంగా ఉన్నారు.
దీన్ని చదువుతున్న ప్రియమైన వారలారా! పరలోకాన్ని విడిచిపెట్టి వచ్చిన ఆయనే ఎంతగానో తగ్గించుకున్నప్పుడు మట్టిలోని సృష్టింపబడిన మనము ఎంతగా దీన మనసు గలవారుగా ఉండాలి? మనలను హెచ్చించుకున్న స్థలం కొరకు దేవుని వద్ద క్షమాపణ అడుగుదాం ఇక అన్ని పరిస్థితిలోనూ అన్ని స్థలాల్లోనూ యధార్థముగా దీన మనసుతో ఉందాం, దేవుని దీవెనలు పొందుకుందాం.
- శ్రీమతి. బెర్లిన్ చల్లా బాయ్ గారు
ప్రార్థన అంశం:
మన క్యాంపస్ లో జరుగుతున్న స్వస్థత ఆరాధన ద్వారా అనేక మంది అద్భుతాలను రుచిచూచేటట్లు ప్రార్థిద్దాం.
*Whatsapp*
ఈ దిన ధ్యాన సందశమును తమిళ్, ఇంగ్లీష్ , హిందీ, మలయాళం, తెలుగు, కన్నడ, పంజాబీ మరియు ఒరియా బాషలలో వాట్సాప్ త్వరా పొందుటకు *+91 94440 11864* అనే నెంబర్ ను సంబ్రదించగలరు.
www.vmm.org.in
ఈమెయిల్: info@vmm.org.in
Android App: https://play.google.com/store/apps/details?id=com.infobells.vmmorgin
విలేజ్ మిషనరీ మూమెంట్, విరుదునగర్, ఇండియా- 626001
ప్రార్ధనా అవసరాల కోసం: +91 94424 93250