By Village Missionary Movement
Monday, 23-Sep-2024దిన ధ్యానము(Telugu) 23.09.2024
అంశం: ఎంత సమయం
"కాబట్టి మీరు జరుగబోవు వీటినెల్లను తప్పించు కొని, మనుష్యకుమారుని యెదుట నిలువబడుటకు శక్తిగలవారగునట్లు(కొన్ని ప్రాచీన ప్రతులలో-పాత్రులనియెంచబడునట్లు అని పాఠాంతరము) ఎల్లప్పుడును ప్రార్థనచేయుచు మెలకువగా ఉండుడని చెప్పెను" - లూకా 21:36
జార్జ్ ముల్లర్ అనే మంచి దేవుని దాసుని వద్ద మీరు ఒక రోజుకి ఎంత సమయం ప్రార్థిస్తారు అనే ప్రశ్న వేయబడింది. ఆయన చెప్పిన జవాబు ఏమిటో తెలుసా? కొన్ని గంటలు మాత్రము కాదు నేను ప్రార్థన ఆలోచనతోనే ప్రతి క్షణము జీవిస్తూ ఉంటాను. నడిచేటప్పుడు, కూర్చునేటప్పుడు, లేచేటప్పుడు ప్రార్థిస్తూనే ఉంటాను. నా జీవిత విధానమే ప్రార్థనగా మార్చుకున్నాను అని అన్నారంట. ప్రియమైన దేవుని పిల్లలారా మనము ఎప్పుడు ప్రార్థించాలి అనే దాని గురించి బైబిల్ మనకి సలహా ఇస్తుంది. ఎప్పుడు ప్రార్థించాలి అంటే పనిచేస్తూ ఉండేటప్పుడే ప్రార్థిస్తే చాలు అని తలంచి రోజు ఒక ప్రత్యేకమైన సమయాన్ని దేవుని సన్నిధిలో వేచి ఉన్నదాన్ని మనం అశ్రద్ధ చేయకూడదు. ఎంత సమయం మనం ప్రార్ధించిన ఆ ప్రార్ధన శ్రద్ధ కలిగినదిగా ఏలియా ప్రార్ధించినట్లు జవాబును పొందుకునే విధముగా ప్రార్థించాలి. మనము ఎలా ప్రార్థించాలి అంటే
1. మనం శ్రద్ధ కలిగి ప్రార్థించాలి (యాకోబు 5:17)
2. మెలకువగలిగే ప్రార్థించాలి (మత్తయి సువార్త 26: 41)
3. నిరుత్సాహ పడకుండా ప్రార్థించాలి (లూకా 11:18)
4. విశ్వాసం కలిగిన వారిగా ప్రార్థించాలి (మత్తయి సువార్త 21: 22)
5. స్తుతి పాట పాడుతూ ప్రార్థించాలి (నెహెమ్యా 11: 17 )
6. అత్యాశక్తితో ప్రార్థించాలి (యాకోబు 5: 16)
7. 7.ఉపవాసంతో ప్రార్థించాలి (మార్కు సువార్త9: 29 )
8. ఎడతెగక ప్రార్థించాలి (కొలస్సి 4:2)
9. పరిశుద్ధాత్మతో ప్రార్థించాలి (యూదా 20)
10. మీ గది తలుపు వేసుకుని ప్రార్థించాలి (మత్తయి సువార్త 6:6)
పైన చెప్పబడినట్లు మనం ప్రార్ధించినప్పుడు ఏఏ కార్యాలు జరుగుతాయి అని చూద్దాం.
1. ప్రార్థించిన కార్యమునకు జవాబు దొరుకుతుంది.
2. మీకు వచ్చే శోధన నుండి తప్పించుకొన వచ్చు.
3. విశ్వాసం మనలో విస్తరిస్తుంది.
4. మనం అడుగుతున్న వాటిని పొందుకుంటాం.
5. దేవుని ప్రసన్నతను అనుభవించగలం.
6. మనము ఆత్మీయతలో బలం పొందుకుంటాము.
7. విజయముగల క్రైస్తవ జీవితం జీవించగలం.
8. దేవునితో మనం నడవగలం.
9. దేవుని చిత్తాన్ని నెరవేర్చగలం.
10. మనము అంతరంగంలో ప్రార్ధించిన కార్యములకు బహిరంగముగా జవాబు దొరుకుతుంది.
ప్రియమైన వారలారా మన వ్యక్తిగత ప్రార్థన ఇంకనూ అధికం చేద్దాం. దేవుని కొరకు గొప్ప కార్యాలను చేయుటకు ప్రయాస పడదాం.
- శ్రీమతి. ప్రిస్కిల్లా తియో ప్లస్ గారు
ప్రార్థన అంశం:
ఆకలి గల వారికి ఆహారం అందించే పరిచర్య ద్వారా ప్రయోజనం పొందుకుంటున్న ప్రతి ఒక్కరూ దేవుని ప్రేమను పొందుకునేలా ప్రార్థిద్దాం.
*Whatsapp*
ఈ దిన ధ్యాన సందశమును తమిళ్, ఇంగ్లీష్ , హిందీ, మలయాళం, తెలుగు, కన్నడ, పంజాబీ మరియు ఒరియా బాషలలో వాట్సాప్ త్వరా పొందుటకు *+91 94440 11864* అనే నెంబర్ ను సంబ్రదించగలరు.
www.vmm.org.in
ఈమెయిల్: info@vmm.org.in
Android App: https://play.google.com/store/apps/details?id=com.infobells.vmmorgin
విలేజ్ మిషనరీ మూమెంట్, విరుదునగర్, ఇండియా- 626001
ప్రార్ధనా అవసరాల కోసం: +91 94424 93250