By Village Missionary Movement
Sunday, 22-Sep-2024దిన ధ్యానము(Telugu) 22.09.2024 (Kids Special)
అంశం: అత్యధికముగా చేసే దేవుడు
"మరియు మీరు ప్రార్థనచేయునప్పుడు వేటిని అడుగుదురో అవి (దొరకినవని) నమ్మినయెడల మీరు వాటినన్నిటిని పొందుదురని వారితో చెప్పెను" - మత్తయి 21:22
హలో పిల్లలు ఈ దినము ఒక నిజ సంఘటనను విన్నామా? ప్రార్థన గురించిన సంఘటన ఇది వినుటకు సిద్ధమేనా?
బిల్ బ్రైట్ అమెరికా దేశంలో ఒక వ్యాపారవేత్త. ఆయన తన వ్యాపారం మధ్యలో కూడా తరచుగా ఒంటరిగా వెళ్లి ప్రార్థన చేస్తూ ఉండుట అలవాటు చేసుకున్నాడు. ఈయన వ్యాపారం కూడా చక్కగా జరుగుతూ ఉండేది. అయినప్పటికీ ఆయన ప్రార్థనను విడిచిపెట్టలేదు. ఆయన యొక్క ప్రధానమైన ప్రార్థన ఒక ఆత్మనైన రక్షణలోనికి నడిపించుటకు సహాయం చేయండి అన్నదే. ఇలా ప్రార్ధించి నిశ్శబ్దంగా ఉండకుండా తనకు సమయం దొరికినప్పుడల్లా వీధిలోనికి వెళ్లి పరిచర్య చేసేవాడు. తర్వాత యేసయ్య గూర్చి ప్రకటించుటకు ఆసక్తి కలిగిన ఆయన పని దినాలలో స్కూళ్లకు, కాలేజీలకు వెళ్లి మీ వంటి చిన్న బిడ్డలకు, విద్యార్థులకు సువార్తను ప్రకటించేవారు. అనేకులు యేసుక్రీస్తును అంగీకరించారు. తర్వాత ఈయనతో కలిసి పరిచర్య చేయుటకు అనేకులు ముందుకు వచ్చారు. వెంటనే క్యాంపస్ క్రూసైడ్ అనే సంస్థను ప్రారంభించాడు.
నాలుగు స్తంభాలు అనే అంశం క్రింద ప్రజలు సులువుగా యేసయ్యను గ్రహించుటకు కరపత్రిక ఒకటి ముద్రించారు. అది సులువుగా ప్రజలకు అర్థమైనదిగా ఉండినందున అనేక భాషలలో అది తర్జుమా చేయబడి 250 కోట్లకు పైగా ఈ కరపత్రికలు ముద్రించబడి అనేక దేశాలలో ఉపయోగించబడ్డాయి. ఈయన సంస్థలలో 15 వేల మంది సంపూర్ణ సేవకులు రెండు లక్షల మందికిపైగా వాలంటరీస్ సేవకులు పనిచేస్తున్నారు. ప్రజలకు యేసు అనే చలనచిత్రాన్ని చూపించి చదువు లేని పామరులకు కూడా యేసయ్యను తెలుసుకోవాలి అని వాళ్ళ కొరకు తయారు చేశారు. యేసు అనే ఆ చలనచిత్రము అనేక భాషల్లో తర్జుమా చేయబడి 45 కోట్లకు పైబడిన ప్రజలు ఈ చలనచిత్రం చూసి ఉన్నారు. అనేకులు ప్రభువుని అంగీకరించుటకు ఇది కారణమై ఉన్నది. బిల్ బ్రైట్ యొక్క ప్రార్ధన ఒక ఆత్మను దేవుని లోనికి నడిపించాలి అన్నదే. ఈయన ద్వారా కోట్ల కోలది మంది ప్రజలు యేసయ్యను తెలుసుకున్నారు. హలో పిల్లలు ఇలానే మీరు కూడా మిక్కిలి ఆసక్తితో దేవుని వద్ద ప్రార్ధించినప్పుడు దేవుడు మీరు అడుగుతున్న దానికంటే ఎక్కువ గా జవాబు ఇస్తారు. ఆయన సర్వశక్తి కలిగిన దేవుడు. విశ్వాసముతో అడగండి జవాబును కచ్చితంగా పొందుకుంటారు.
- శ్రీమతి. అంబు జ్యోతి స్టాలిన్ గారు
*Whatsapp*
ఈ దిన ధ్యాన సందశమును తమిళ్, ఇంగ్లీష్ , హిందీ, మలయాళం, తెలుగు, కన్నడ, పంజాబీ మరియు ఒరియా బాషలలో వాట్సాప్ త్వరా పొందుటకు *+91 94440 11864* అనే నెంబర్ ను సంబ్రదించగలరు.
www.vmm.org.in
ఈమెయిల్: info@vmm.org.in
Android App: https://play.google.com/store/apps/details?id=com.infobells.vmmorgin
విలేజ్ మిషనరీ మూమెంట్, విరుదునగర్, ఇండియా- 626001
ప్రార్ధనా అవసరాల కోసం: +91 94424 93250