Village Missionary Movement         கிராம மிஷனரி இயக்கம்

దిన ధ్యానము(Telugu) 15.09.2024
Share:

By Village Missionary Movement

Sunday, 15-Sep-2024

దిన ధ్యానము(Telugu) 15.09.2024

 

అంశం: ఉత్సాహముతో ఇయ్యూడి 

 

ప్రత్యేకంగా చిన్న పిల్లల కొరకు!

 

"సణుగుకొనకయు బలవంతముగా కాకయు ప్రతివాడును తన హృదయములో నిశ్చయించుకొనిన ప్రకారము ఇయ్యవలెను; దేవుడు ఉత్సాహముగా ఇచ్చువానిని ప్రేమించును" - 2 కోరింథీయులకు 9:7

 

హలో పిల్లలు ఎలా ఉన్నారు? స్కూల్లో మీకు చాలామంది ఫ్రెండ్స్ ఉన్నారా? అందరూ మీకు సాయం చేస్తారా? ఎవరికి ఇచ్చే హృదయం ఉంటుందో వారిని యేసయ్య ప్రేమిస్తున్నాడు. స్నేహితులు ఒకరికొకరు పోటీపడి చెప్పిన స్టోరీని ఈ దినం విందామా! 

 

కొత్తగా స్కూల్లో జాయిన్ అయినా అరుణ్ మూడు నెలలు అయినప్పటికీ కొత్త యూనిఫామ్ కుట్టించుకోలేదు. ప్యాంటు రంగు ఎలిసిపోయినదిగా ఉండేది. కూలి పని చేస్తున్న వాళ్ల నాన్నను దూరముగా చూసి పరిగెత్తుకుని వెళ్ళాడు. నాన్న నాకు యూనిఫామ్ ఎందుకు కుట్టించలేదు త్వరగా కుట్టించి ఇవ్వండి అని కుమారుడు చెప్పిన వెంటనే అర్థం చేసుకున్న తండ్రి సరే అని చెప్పి తల ఊపుకొని వెళ్లిపోయాడు. ఎందుకంటే నాన్నకు రోజు పని ఉండదు. నన్నును అడిగిన ఎలాంటి ప్రయోజనము లేదు అని చెప్పి యేసయ్యని అడుగుదామని చెప్పి ప్రతిరోజు ప్రార్థించడం ప్రారంభించాడు. ఒక దినము స్కూల్లో క్లాస్ టీచర్ చెప్పిన పాఠం నుండి కొన్ని ప్రశ్నలు టీచర్ వేశారు వాటికి అరుణ్ చక్కగా సమాధానం చెప్పగలిగాడు. కొత్తగా వచ్చిన గాని సూపర్ గా చదువుతున్నాడే హలో అరుణ్ నువ్వు జవాబు చెప్పినది నాకు చాలా నచ్చింది అని చెప్పి బాబు, మని ఇద్దరూ అరుణ్ కి స్నేహితులయ్యారు. అరుణ్ పేదవాడిగా ఉన్నందున ఎవరు నాతో స్నేహం చేయరు అని ఎవరితో మాట్లాడకుండా ఉండిపోయేవాడు.

 

ఒకరోజు సాయంత్రం అరుణ్ ను చూచుటకు మనీ బాబు ఇద్దరూ అరుణ్ ఇంటికి వచ్చి సర్ప్రైజ్ చేశారు. వారు తీసుకొచ్చిన కవర్ ని అరుణ్కి ఇచ్చారు. తెరిచి చూస్తే రెండు జతలు యూనిఫామ్ అందులో ఉన్నాయి. దాన్ని తెరిచిన అరుణ్ యొక్క మొఖము ప్రకాశవంతముగా వెలగడం ప్రారంభించింది. అలానే ఆయన బంకమట్టితో చేసిన కొన్ని బొమ్మలు వారిద్దరికీ ఇచ్చారు. వాటిని తీసుకున్న వారు చాలా చక్కగా ఉన్నాయి అని చెప్పి సంతోషించారు. వెంటనే అరుణ్ నెక్స్ట్ టైం వచ్చేసరికి నేను ఇంకా కొన్ని బొమ్మలు చేసి మీకు ఇస్తాను అని చెప్పాడు. వెంటనే అరుణ్ వచ్చేవారం మనము కలిసి సండే స్కూల్ కి వెళ్దామా అని కలిసి సండే స్కూల్ కి వెళ్లడం ప్రారంభించారు. ఎంత సంతోషం ఉంటుందో కదా మీరు కూడా అవసరతలో ఉన్న వారికి ఇచ్చి యేసయ్యను సంతోషపరచుడి. చేస్తారా? వెరీ గుడ్. 

- శ్రీమతి. గ్రేస్ జీవమని గారు

 

*Whatsapp*

ఈ దిన ధ్యాన సందశమును తమిళ్, ఇంగ్లీష్ , హిందీ, మలయాళం, తెలుగు, కన్నడ, పంజాబీ మరియు ఒరియా బాషలలో వాట్సాప్ త్వరా పొందుటకు *+91 94440 11864* అనే నెంబర్ ను సంబ్రదించగలరు.

 

www.vmm.org.in

ఈమెయిల్: info@vmm.org.in

Android App: https://play.google.com/store/apps/details?id=com.infobells.vmmorgin

 

విలేజ్ మిషనరీ మూమెంట్, విరుదునగర్, ఇండియా- 626001

ప్రార్ధనా అవసరాల కోసం: +91 94424 93250



hacklink satın al holiganbet giriş holiganbet padişahbet bets10 extrabet royalbet süperbetin padişahbet betcio royalbet casinoroyal queenbet bahiscasino betcio bahiscasino atlasbet padişahbet betpas bahiscasino celtabet queenbet casibom jojobet jojobet casibom holiganbet restbet safirbet