Village Missionary Movement         கிராம மிஷனரி இயக்கம்

దిన ధ్యానము(Telugu) 10.09.2024
Share:

By Village Missionary Movement

Tuesday, 10-Sep-2024

దిన ధ్యానము(Telugu) 10.09.2024

 

అంశం: ప్రకాశించే ముఖము 

 

"నీకు వెలుగు వచ్చియున్నది, లెమ్ము, తేజరిల్లుము యెహోవా మహిమ నీమీద ఉదయించెను" - యెషయా 60:1

 

మన మొఖము ప్రకాశవంతముగా అందంగా ఉండాలి అంటే అనేక వస్తువులను వాడుతూ ఉంటాం కానీ దేవుని చేత వచ్చే ప్రకాశం గురించి గ్రహించే వారు ఎంతమంది. దేవుని యొక్క మహిమను మన మీద ప్రకాశించినప్పుడు మనం వెళుతున్న స్థలమంతా కూడా దేవుని కొరకు ప్రకాశించే వారముగా దేవుడు మనలను నిలబెడతారు. దేవుని యొక్క మహిమను మనం ఆశించి బ్రతిమలాడేటప్పుడు ఆయన మహిమను మనకిచ్చి రూపాంతర పరుస్తున్నారు. బైబిల్ లో ప్రకాశవంతమైన ముఖము కలిగిన వారి గూర్చి ఈ దినము ధ్యానిద్దాం. 

 

ఒకటి మోషే, రెండు యేసుక్రీస్తు, మూడు స్టెఫను. మోషే ఒంటరిగా దేవునితో గడిపే సమయము ఆయన ముఖమును ప్రకాశవంతంగా చేసింది. దేవుని యొక్క మహిమను నాకు కనపరచండి అని ప్రార్థించారు. ఆయన 40 రోజులు దేవునితో ఉండి సీనాయి పర్వతం నుండి క్రిందకి దిగినప్పుడు ఆయన మొఖము ప్రకాశించుట ఇశ్రాయేలు ప్రజలు చూశారు. యేసుప్రభువు యాకోబును, యోహానును, పేతురును పిలుచుకుని ఎత్తైన పర్వతం పైకి ఎక్కారు అక్కడ ఆయన రూపాంతరము చెందారు. అక్కడ ఆయన మొఖము సూర్యుని వలె ప్రకాశించింది. అవును దేవుని మహిమ మనలోనికి వచ్చినప్పుడు మన ముఖము ప్రకాశవంతంగ అవుతుంది. తరువాత స్టెఫను మాట్లాడుతున్నప్పుడు ఆయన జ్ఞానమును బలమైన దేవుని ఆత్మను కలిగి ఉండుటను ఆయనను వ్యతిరేకించుట, ఆయనతో తర్కించుట ఎవరి వలన కాలేకపోయింది కనుక ఆయనకు విరోధంగా అబద్ధం సాక్ష్యము పలికించి ఆయనకు తీర్పు తీర్చి రాళ్లతో కొట్టారు అప్పుడు ఆయన ముఖము దేవదూత మొఖము వలె ప్రకాశించింది.

 

ప్రియమైన దేవుని పిల్లలారా ఈ లోకంలో మనము దేవుడు మనలని పిలిచి ఉన్నారు. లోకము కొరకు ఉప్పుగాను, వెలుగుగాను ఉండుట కొరకు దేవుడి మనల్ని ఏర్పరుచుకున్నారు. మనం ప్రకాశించినప్పుడు చీకటిని వెళ్లగొడుతుంది. పాపమూ, శాపపు బంధకాలో బంధింపబడుతున్న ప్రజలు యొక్క జీవితాలను చీకటిలో ఉన్నప్పుడు మనకున్న దీపాన్ని వెలిగించాలి మహిమగల దేవుడు మనల్ని ఆవరించినప్పుడు మనం కచ్చితంగా ప్రకాశిస్తాం. ప్రభువు చెప్తున్న మాట ఇదిగో చీకటి భూమిని కమ్మింది ప్రజలు తిరుగులాడుదురు కానీ నీ మీద దేవుడు ఉదయిస్తారు ఆయన మహిమ నీ మీద నిత్యము ఉంటుంది. నీ వెలుగు యొద్దకు అనేక మంది ప్రజలు మరియు రాజులు నడుచుకోని వస్తారు అని వాగ్దానం ఇస్తున్నారు. ఈ వాగ్దానం కచ్చితంగా మన జీవితంలో నెరవేరును గాక!

- శ్రీమతి. గ్రేస్ జీవమణి గారు 

 

ప్రార్థన అంశం:-

ప్రతి తాలుకాలో ఒక బైబిల్ అమ్మగారు లేచేటట్లు ప్రార్థిద్దాం

 

*Whatsapp*

ఈ దిన ధ్యాన సందశమును తమిళ్, ఇంగ్లీష్ , హిందీ, మలయాళం, తెలుగు, కన్నడ, పంజాబీ మరియు ఒరియా బాషలలో వాట్సాప్ త్వరా పొందుటకు *+91 94440 11864* అనే నెంబర్ ను సంబ్రదించగలరు.

 

www.vmm.org.in

ఈమెయిల్: info@vmm.org.in

Android App: https://play.google.com/store/apps/details?id=com.infobells.vmmorgin

 

విలేజ్ మిషనరీ మూమెంట్, విరుదునగర్, ఇండియా- 626001

ప్రార్ధనా అవసరాల కోసం: +91 94424 93250



hacklink satın al holiganbet giriş holiganbet padişahbet bets10 extrabet royalbet süperbetin padişahbet betcio royalbet casinoroyal queenbet bahiscasino betcio bahiscasino atlasbet padişahbet betpas bahiscasino celtabet queenbet casibom jojobet jojobet casibom holiganbet restbet safirbet