Village Missionary Movement         கிராம மிஷனரி இயக்கம்

దిన ధ్యానము(Telugu) 09.09.2024
Share:

By Village Missionary Movement

Monday, 09-Sep-2024

దిన ధ్యానము(Telugu) 09.09.2024

 

అంశం: ఎలాంటి విశ్వాసం 

 

"యేసు ఈ మాటలు విని, అతనిగూర్చి ఆశ్చర్యపడి, తన వెంట వచ్చుచున్న జనసమూహము వైపు తిరిగిఇశ్రాయేలులో నైనను ఇంత గొప్ప విశ్వాసము నేను చూడలేదని మీతో చెప్పుచున్నాననెను" - లూకా 7:9

 

ఈ దిన లేఖన భాగంలో చెప్పబడిన శతాధిపతి స్వార్ధముగా లేదా ధన కొరకు తన కుటుంబంలో గల కుటుంబీకుల కొరకు యేసయ్య వద్దకు రాలేదు. తన పనివాని స్వస్థత కొరకు తనను తగ్గించుకొని యేసయ్య మాటల యొక్క బలాన్ని విశ్వసించి వస్తున్నాడు. యేసయ్య ఆయన యొక్క విశ్వాసం కొరకు పైన చెప్పబడినట్లుగా ఇశ్రాయేలీయులలోనూ నేను ఇలాంటి విశ్వాసాన్ని కనుగొనలేదు అని చెప్పి ఆ పని వాడిని స్వస్థపరచున్నారు. ఈ సంఘటన మనకు నేర్పిస్తున్న కార్యమేమిటి రెండవ దినవృత్తాంతాలు 7:14 లో ఆయన నామము ఎరిగిన ప్రజలు తమను తాము తగ్గించుకొని ప్రార్థన చేసిన యెడల దేశమునకు క్షేమాన్ని కలుగ చేస్తాను అని దేవుడు వాగ్దానాన్ని చేస్తున్నారు. విశ్వాసులమైన మనము ఆయన మాటల యొక్క బలాన్ని విశ్వసించి దేశం యొక్క ఉజ్జీవం కొరకు సమాధానం కొరకు మేలు కొరకు పరిపాలించే నాయకులు కొరకు ప్రార్థిస్తున్నామా లేదా స్వార్ధముగా మన యొక్క కార్యముల కొరకు ప్రార్థిస్తున్నామా లేదా దేశం కొరకు ప్రార్థించి ప్రయోజనం లేదు అనే అవిశ్వాసము కలిగిన వారముగా ఉంటున్నామా కొద్దిగా ఆలోచిద్దాం. 

 

ప్రజలందరి కొరకు విజ్ఞాపన చేయుట ప్రార్థించుట అవసరము అని 1తిమోతి 2:1-3 లో గల లేఖన భాగంలో ఆయనకు లోబడి ఇతరుల యొక్క బంధకాల గురించి సమస్యల గురించి దేవున్ని విశ్వాసంతో ప్రార్థించాలి. వార్తా పత్రికలో వచ్చే హృదయాలను కదిలించే కార్యముల గురించి ఎంత మాత్రమూ చింతలేకుండా ఉంటున్నామా? అనేక విధములైన కష్టతరమైన పరిస్థితిలో అల్లాడుతున్న పేదవాళ్లు, దిక్కులేని వారు, చిన్నారులు, స్త్రీలు వీళ్ళ కొరకు యేసయ్య వద్ద విలపించి ప్రార్థిస్తున్నామా? క్రియలేని ప్రేమ ప్రయోజనం లేనిది గలది 5: 6, క్రియలేని విశ్వాసము మృతమైనది యాకోబు 2:26. మన విశ్వాసం ఎలాంటిది? 

 

ప్రియమైన వారలారా విశ్వాసులు అని పిలవబడుతున్న మనము మన కొరకే ప్రార్థిస్తూ ఉండకుండా దేశం కొరకు ఇతరుల కొరకు మనం ప్రార్థిద్దాం. ఆ శతాధిపతి వలె మనల్ని మనం తగ్గించుకొని ప్రార్థన చేద్దాం. దేవుని యొక్క ఆశ్చర్యకరమైన జవాబును పొందుకుందాం. దేవుడు ఇష్టపడుతున్న నిజమైన విశ్వాసులుగా మనం జీవిద్దాం. ఆమెన్! 

- శ్రీమతి. గీతా రీఛార్డ్ గారు 

 

ప్రార్థన అంశం:-

ఆగస్టు 15వ తారీఖున జరిగిన యవ్వనస్తుల కూడికలో అభిషేకించబడిన యవ్వనస్తులు ప్రతి ఒక్కరూ తమ అభిషేకాన్ని కాపాడుకునేటట్లు ప్రార్థిద్దాం.

 

*Whatsapp*

ఈ దిన ధ్యాన సందశమును తమిళ్, ఇంగ్లీష్ , హిందీ, మలయాళం, తెలుగు, కన్నడ, పంజాబీ మరియు ఒరియా బాషలలో వాట్సాప్ త్వరా పొందుటకు *+91 94440 11864* అనే నెంబర్ ను సంబ్రదించగలరు.

 

www.vmm.org.in

ఈమెయిల్: info@vmm.org.in

Android App: https://play.google.com/store/apps/details?id=com.infobells.vmmorgin

 

విలేజ్ మిషనరీ మూమెంట్, విరుదునగర్, ఇండియా- 626001

ప్రార్ధనా అవసరాల కోసం: +91 94424 93250



hacklink satın al