Village Missionary Movement         கிராம மிஷனரி இயக்கம்

దిన ధ్యానము(Telugu) 05.09.2024
Share:

By Village Missionary Movement

Thursday, 05-Sep-2024

దిన ధ్యానము(Telugu) 05.09.2024

 

అంశం: క్రియ 

 

"పరపక్షమందుండువాడు మనలను గూర్చి చెడుమాట యేదియు చెప్పనేరక సిగ్గుపడునట్లు అన్నిటియందు నిన్ను నీవే సత్కార్యముల విషయమై మాదిరిగా కనుపరచుకొనుము" - తీతుకు 2:7

 

చైనా దేశమునకు మిషనరీగా వెళ్ళిన హాట్ సన్ టైలర్ ఒకసారి మధ్య రాత్రిలో ఆకలితో అలమటీస్తున్న కుటుంబం కొరకు ప్రార్థించుటకు పిలవబడ్డారు. ఆయన ప్రార్థన ప్రారంభించినప్పుడు మాటలు రాలేదు గొంతు పట్టేసింది. ఎందుకంటే ఆయన జేబులో ఉన్న వెండి నాణెము ఆ కుటుంబం యొక్క ఆకలి తీర్చుటకు సరిపోతుంది. ఆయన హృదయంతో దేవుడు మాట్లాడారు ప్రజల కొరకు పరితపిస్తున్న దేవుని ఆరాధిస్తున్నావు, ప్రకటిస్తున్నావు కానీ నీ దగ్గర ఉన్న ధనమును ఇచ్చి నన్ను విశ్వసించుటకు నీవు సిద్ధంగా లేవే అని ప్రభువు మాట్లాడారు. వెంటనే హాట్ సన్ టైలర్ ఆ వెండి నాణెమును ఆ కుటుంబీకులకు ఇచ్చి ప్రార్ధించి వెళ్లారు. అది ఆయన దగ్గర ఉన్న చివరి నాణెము కాబట్టి దాని గురించిన తడబాటు ఆయన హృదయములో ఉండేది. మనసటి రోజు ఉదయం పోస్టల్ లోఒక వెండి నాణెము వచ్చింది. దాన్ని చూచిన వెంటనే దేవుని యొక్క బ్యాంకులో చెల్లించబడిన డబ్బు 12 గంటల్లో పదిరెట్లు ఎక్కువగా తిరిగి నాకు వచ్చింది అన్నారు.

 

ఈ ప్రపంచంలో ఇలా క్రియలు చేసేవారు తక్కువగా ఉన్నారు ప్రార్థించే వారు ఎక్కువగా ఉన్నారు కానీ దేవుడు మన ప్రార్థనలు మాత్రమే ఇష్టపడుతున్న దేవుడు కారు మన యొక్క క్రియలు కూడా ఉండాలి అని ఎదురుచూస్తున్న దేవుడు. దోర్క అనే శిష్యురాలు అనేక సత్క్రియలు చేస్తూ ఉండేది. ఆమె యొక్క ప్రాణము పోయినప్పటికీ కూడా దోర్క చేసిన సత్క్రియలు ఆమెను మరలా బ్రతికేటట్లు చేసింది. దేవుడు మనలను సత్క్రియలను చేయుటకు సృష్టించినారు అని ఎఫెసీయులకు 2:10లో చదువుతున్నాం మరియు మన విశ్వాసముతో పాటు క్రియ ఉండాలి లేనియెడల అది మృతము అని యాకోబు 2:26లో మనం చూస్తున్నాం. సోలిపోకుండా సత్క్రియలు చేస్తున్నప్పుడు దేవుడు నిత్యజీవాన్ని దయ చేస్తారు అని మనం చదువుతున్నాం. దేవుడు మన హృదయంలో నుండి చేసే సత్క్రియను చూసి దానికి తగిన ఫలాన్ని పరమందు ఇచ్చుటకు ఆయన సమర్థుడు.

 

 ప్రియమైన వారలారా! మీరు చేసే సత్క్రియ మీకు మేలు కలిగిస్తుంది అనే యేసుప్రభు చెబుతున్నారు. మనుషులు మీ సత్క్రియను చూసి పరమందు ఉన్న మీ తండ్రిని మహిమ పరిచేటట్లు మీ వెలుగును వారి ఎదుట ప్రకాశించనియుడి అంటున్నారు. మీరు ఇంకను వట్టి మాటలతో క్రీచేయకుండా ప్రార్థన చేసేవారుగా ఉంటే మీ సత్క్రియల ద్వారానే మనుషులు మీలో క్రీస్తుని చూడగలరు. యేసుక్రీస్తు ప్రభువు పేదవారికి సహాయం చేసిన విధముగా మనము ఇతరులకు సహాయం చేసే వారుగా ఉందాం. ఆయన బలం వలనే హాట్సన్ టైలర్ పది రెట్లు డబ్బులు ఆయన పొందుకు పొందుకోగలిగాడు. అలానే మనం మనస్ఫూర్తిగా సత్క్రియలు చేయగలిగినప్పుడు ఆయన మనకు అనేక రెట్లుగా ఇచ్చుటకు సమర్ధుడు. కాబట్టి క్రియ చేద్దాం మన వెలుగును ప్రజలు ఎదుట ప్రకాశింప చేద్దాం.

- శ్రీమతి. అనుభూ జ్యోతి స్టాలిన్ గారు 

 

ప్రార్థన అంశం:-

25వేల గ్రామాల్లో సువార్త ప్రకటించుటకు కరపత్రికలు, బైబిల్లు దొరికేటట్లు ప్రార్థిద్దాం.

 

*Whatsapp*

ఈ దిన ధ్యాన సందశమును తమిళ్, ఇంగ్లీష్ , హిందీ, మలయాళం, తెలుగు, కన్నడ, పంజాబీ మరియు ఒరియా బాషలలో వాట్సాప్ త్వరా పొందుటకు *+91 94440 11864* అనే నెంబర్ ను సంబ్రదించగలరు.

 

www.vmm.org.in

ఈమెయిల్: info@vmm.org.in

Android App: https://play.google.com/store/apps/details?id=com.infobells.vmmorgin

 

విలేజ్ మిషనరీ మూమెంట్, విరుదునగర్, ఇండియా- 626001

ప్రార్ధనా అవసరాల కోసం: +91 94424 93250



hacklink satın al