Village Missionary Movement         கிராம மிஷனரி இயக்கம்

దిన ధ్యానము(Telugu) 04.09.2024
Share:

By Village Missionary Movement

Wednesday, 04-Sep-2024

దిన ధ్యానము(Telugu) 04.09.2024

 

అంశం: ఈ దినమే అనుకూల సమయము   

 

"అనుకూల సమయమందు నీ మొరనాలకించితిని; రక్షణ దినమందు నిన్ను ఆదుకొంటిని అని ఆయన చెప్పుచున్నాడు గదా!" – 2 కోరింథీయులకు 6:2

 

ఒక మనిషి తాను చేసిన హత్య నేరము కొరకు చెరసాలలో వేయబడ్డాడు. ఆయన మీద ఉన్న ఫిర్యాదు కోర్టుకు వచ్చింది. ఆ న్యాయమూర్తి ఆయన చేసిన హత్యనేరమునకు ఉరిశిక్ష వేశారు. దానిని విన్న ఆయనకు తెలిసిన వారందరూ కూడా రాష్ట్రపతికి విజ్ఞాపన చేశారు. ఆ విజ్ఞాపనలో అందరూ రాసినది ఇలా ఉంది. ఆ మనుష్యుడు చాలా మంచివాడు ఆయన మరణశిక్షకు పాత్రుడు కాదు దయతో ఆయన మరణశిక్షను రద్దు చేయండి అని రాశారు. అందరూ సంతకాలు పెట్టి ఆ విజ్ఞాపన ఉత్తరాన్ని రాష్ట్రపతికి పంపించారు. రాష్ట్రపతి ఒక పాదరి గారి వస్త్రము వేసుకొని చెరసాలకు వెళ్లి ఆ ఉరిశిక్ష గల వ్యక్తిని పిలుచుకుని రమ్మన్నారు. ఆ ఉరిశిక్ష పొందిన ఖైదీ అయితే నేను ఆ పాదరి గారిని చూచుటకు రాను ఆయనను వెళ్ళమని చెప్పేసాడు. ఆయన వెళ్లిపోయాడు ఒకడు పరిగెత్తుకుని వెళ్లి నిన్ను ఉరిశిక్ష నుండి విమోచించుటకు వచ్చిన వారు పాదరి గారు కాదు ఈ దేశపు రాష్ట్రపతి అన్నారు. అప్పుడు ఆయన నాకు ఉచితముగా దొరికిన విమోచనను వద్దు అని తిరస్కరించానే అని బిగ్గరగా ఏడ్చాడు. తర్వాత ఆయనకు ఉరిశిక్ష విధించబడింది.

 

పాపము యొక్క జీతము మరణము (రోమా 6:23) పాపము చేసే ఆత్మ యొక్క ఫలితము మరణము (యెహేజ్కేలు 18: 20) పాపులను రక్షించుటకు క్రీస్తు యేసు లోకమునకు వచ్చెను. ఈ లోకంలో ప్రతి మనిషిని విమోచించుటకు విమోచన పత్రమును తండ్రి అయిన దేవుని యొద్ద నుండి తీసుకుని యేసుక్రీస్తు ప్రభువు ఈ లోకానికి వచ్చారు. ఏ ఒక్కరు కూడా నాశనం కాకూడదు అని సేవకుల ద్వారా ఆ విమోచన పత్రమును ఈ ప్రజలకు ఇచ్చుటకు ఆయన ఆశిస్తున్నారు కానీ అనేకులు ప్రభువైన యేసు రక్షకుడు నాకు వద్దు అని చెబుతున్నారు. యేసయ్యను సొంత రక్షకుడిగా అంగీకరించే వారికి ఆ పాపపు జీవితమైన మరణము లేదు.

 

ప్రియమైన దేవుని బిడ్డలారా ఇంతవరకు యేసుక్రీస్తు ప్రభువు ఇచ్చే విమోచన అనగా రక్షణ ఉత్తరమును మీరు అందుకొనని ఎడల ఈ దినమే ఉచితముగా పొందుకొనుడి. ఈ దినమే అనుకూల సమయం. ఈ దినమే రక్షణ దినము. ఈ దినమే ప్రభువును అంగీకరించిన యెడల పాపము శిక్ష అయిన మరణము నుండి విమోచన పొందుతారు. విజయవంతమైన జీవితాన్ని జీవిస్తారు. యేసయ్య మిమల్ని దీవించును గాక! 

- పాస్టర్. ఎస్. ఎల్. ఇమ్మానుయేల్ గారు 

 

ప్రార్థన అంశం:-

25వేల గ్రామాలలో సువార్త ప్రకటించుటకు అవసరమైన టూవీలర్ మరియు ఫోర్ వీలర్ దొరికేటట్లు ప్రార్థిద్దాం.

 

*Whatsapp*

ఈ దిన ధ్యాన సందశమును తమిళ్, ఇంగ్లీష్ , హిందీ, మలయాళం, తెలుగు, కన్నడ, పంజాబీ మరియు ఒరియా బాషలలో వాట్సాప్ త్వరా పొందుటకు *+91 94440 11864* అనే నెంబర్ ను సంబ్రదించగలరు.

 

www.vmm.org.in

ఈమెయిల్: info@vmm.org.in

Android App: https://play.google.com/store/apps/details?id=com.infobells.vmmorgin

 

విలేజ్ మిషనరీ మూమెంట్, విరుదునగర్, ఇండియా- 626001

ప్రార్ధనా అవసరాల కోసం: +91 94424 93250



hacklink satın al