Village Missionary Movement         கிராம மிஷனரி இயக்கம்

దిన ధ్యానము(Telugu) 03.09.2024
Share:

By Village Missionary Movement

Tuesday, 03-Sep-2024

దిన ధ్యానము(Telugu) 03.09.2024

 

అంశం: విజయము పొందెదము.

 

"అడుగు ప్రతివాడును పొందును, వెదకువానికి దొరకును, తట్టువానికి తీయబడును" - మత్తయి 7:8

 

మోషే యొక్క చెయ్యి పైకి ఎత్తబడుటకు అహరోను హూరు సహాయపడ్డారు. ఈ ముగ్గురు చేత యెహోషువ విజయం పొందగలిగాడు. ప్రార్థించే మోషే వంటి వారు అవసరము, అహరోను హురు వంటి బలముతో సహాయము చేసేవారు, ధనముతో సాయం చేసేవారు అవసరము. యెహోషువ వంటి మిషనరీ పరిచర్యకు వెళ్లే యవనస్తులు అవసరం. మోషే కర్రను చాపితే మాత్రమే దేవుడు అద్భుతాలు చేస్తారని కాదు ఏమీ లేకుండా అరణ్యంలో పూరేళ్ళను అయన రప్పించగలడు. ఆకాశం నుండి మన్నాను 40 సంవత్సరాలు కురిపించ గలడు. ఎండిపోయిని ఎముకలకు ప్రాణము ఇవ్వగలడు లేని వాటిని ఉన్నట్టుగా పిలుస్తున్న దేవుని హస్తాలు కు. ఆయన నిన్న, నేడు, నిరంతరము మారని దేవుడుగా ఉన్నారు. 

 

అయినప్పటికీ మనము బలము పొందుకోవాలి అనే దాని కొరకే మన క్రియలను ఎదురుచూస్తున్నారు. విజయం దేవుని వల్ల మాత్రమే వస్తుంది అనే దాని గ్రహించిన యెహోషువ హురు మోషేకు సహాయపడ్డారు. ప్రార్థిస్తేనే మాత్రం విజయాన్ని పొందగలము అని గ్రహించగలిగిన వారు పరిశుద్ధులుగా ఉండలేరు. జార్జ్ వాషింగ్టన్ జీవితంలో అంచలంచలుగా ఎదిగిన వ్యక్తి. ఈయన అభివృద్ధికి ఈయన ప్రార్థన ప్రాముఖ్యంగా ఉండేది అని చరిత్ర చెబుతుంది. ఈయన అమెరికా సైన్యమునకు సైన్యాధిపతిగా ఉండేటప్పుడు తన క్రింద పనిచేస్తున్న సైనికుల కొరకు ప్రార్థించుట అలవాటు కాబట్టి ఆయన సైన్యము బలమైనదిగా ఉండేది. ఈయన అమెరికా రాష్ట్రపతి అయిన తన క్రింద ఉన్న ప్రతి డిపార్ట్మెంట్ కొరకు రాత్రి 9 నుండి 10 గంటల వరకు తప్పక ప్రార్థిస్తూ ఉండేవాడు. జార్జ్ వాషింగ్టన్ వలే అనేక క్రైస్తవ నాయకులు తమ సంస్థల కొరకు ప్రార్థించుటవలననే ఆ సంస్థలు చరిత్రలు సృష్టిస్తున్నాయి. అహరోను హురు అనేవారు లేకపోవడం వలన సంస్థలలో బలము లేకుండా పోతున్నాయి. యెహోషువా వంటి ప్రయాస పడుతున్నవారు పౌలు వలె లేచి లోకాన్ని తల క్రిందలు చేసేవారిగా ఉంటేనే దేశాన్ని సొంతం చేసుకోగలము.

 

ప్రియమైన వారులారా! దేవుని రాజ్య విస్తరణ పనులలో మిమ్మల్ని ఒక పెద్ద బాధ్యతలో దేవుడు పెట్టి ఉన్నారు. మీరు ప్రార్థించే వారా? దేవుని కొరకు ప్రయాసపడేవారా? లేక త్యాగపూరితము ఇచ్చేవారా? మీ బాధ్యత ఏమిటో దానిని సంపూర్ణగా నెరవేర్చుడి. మనమందరము కలిసి ప్రయాస పడదాం విజయాన్ని పొందుకుందాం. 

- బ్రదర్. సెల్వ రాజ్ గారు 

 

ప్రార్థన అంశం:-

క్రిస్మస్ లోగా 25వేల గ్రామాలలో సువార్త ప్రకటించాలని చేసే ప్రయత్నంలో దేవుడు ద్వారాలు తెరిచేలాగున ప్రార్థిద్దాం.

 

*Whatsapp*

ఈ దిన ధ్యాన సందశమును తమిళ్, ఇంగ్లీష్ , హిందీ, మలయాళం, తెలుగు, కన్నడ, పంజాబీ మరియు ఒరియా బాషలలో వాట్సాప్ త్వరా పొందుటకు *+91 94440 11864* అనే నెంబర్ ను సంబ్రదించగలరు.

 

www.vmm.org.in

ఈమెయిల్: info@vmm.org.in

Android App: https://play.google.com/store/apps/details?id=com.infobells.vmmorgin

 

విలేజ్ మిషనరీ మూమెంట్, విరుదునగర్, ఇండియా- 626001

ప్రార్ధనా అవసరాల కోసం: +91 94424 93250



hacklink satın al perabet perabet giriş safirbet safirbet giriş betasus betasus giriş virüsbet medusabahis medusabahis giriş grandpashabet grandpashabet giriş jojobet jojobet giriş vaycasino vaycasino giriş pusulabet pusulabet giriş perabet perabet giriş perabet perabet giriş matbet slot oyna perabet perabet giriş hiltonbet perabet perabet perabet betnano holiganbet galabet kalebet holiganbet