Village Missionary Movement         கிராம மிஷனரி இயக்கம்

దిన ధ్యానము(Telugu) 01.09.2024 (Kids Special)
Share:

By Village Missionary Movement

Sunday, 01-Sep-2024

దిన ధ్యానము(Telugu) 01.09.2024 (Kids Special)

 

అంశం: సహాయము మర్చిపోకూడదు

 

ప్రత్యేకముగా చిన్న పిల్లల కొరకు

 

"నా ప్రాణమా, యెహోవాను సన్నుతించుము ఆయన చేసిన ఉపకారములలో దేనిని మరువకుము" - కీర్తనలు 103:2

 

చాలా చక్కగా పెరిగివున్న ఆ గడ్డి మధ్యలో జింక ఒకటి చాలా సంతోషముగా గడ్డిమేస్తూ ఉంది. బాగా పుష్టిగా ఉన్న జింక అది. అప్పుడు ఇద్దరు వేటగాళ్లు వేటాడుటకు ఆ మార్గం ఉండ వచ్చారు. వారి కంటికి జింక కనిపించింది ఎంత బలిసిన జింక ఇది దీనిని మనం ఎలాగైనా వేటాడి ఇంటికి తీసుకు వెళ్ళాలి అని ఆలోచించి దానికి బాణం వేశారు. ఆ బాణము జింకకు తగలలేదు. తనకి ప్రమాదం జరగబోతుంది అని గ్రహించిన జింక చాలా వేగంగా పరిగెత్తడం ప్రారంభించింది.

 

వేటగాళ్ళ కూడా జింకను తరుముతూ పరిగెత్తడం ప్రారంభించారు. ఆ జింక చాలా వేగంగా పారిపోయింది. ఒక పొద లోనికి వెళ్లి దాక్కుంది. ఆపోదలో ఉన్న ఆకులు ద్వారా జింక మరుగు చేయబడింది. జింక బాధపడకు వేటగాడి యొక్క కనుదృష్టి నుండి ఈ ఆకులతో నిన్ను కప్పి నిన్ను కాపాడుతాం అని చెప్పి ఆ చెట్లు యొక్క ఆకులు జింకతో మాట్లాడాయి. ఆ వేటగాళ్లు చాలా సేపు వెతుకుతూ ప్రశాంతంగా నిలబడ్డారు. అయితే దాక్కున్న జింక వేటగాళ్లు వెళ్లిపోయారు అని ఆలోచించి తప్పించుకున్నాను అని సంతోషించి తనను వేటగాడి కనుల నుండి కప్పివేసిన ఆ పచ్చిగల ఆకుల్ని ఇక మీ సహాయం నాకు అవసరం లేదు అన్నట్టుగా ఆకులను తినడం ప్రారంభించింది. అవి తిన్నప్పుడు వచ్చిన శబ్దం ద్వారా, ఆకులు తగ్గిపోవడం వలన ఆ కాళీ స్థలం నుండి ఆ వేటగాళ్లు జింకను చక్కగా చూడగలిగారు. ఎంత మాత్రం ఆలస్యం చేయకుండా బాణం వేసి ఆ జింకను బాణంతో చంపారు. కృతజ్ఞతలు లేని జింక మరణించింది.

 

ప్రియమైన పిల్లలారా కొద్దిగా ఆలోచించండి మనము కూడా ఇలా ఎన్నిసార్లు నడుచుకుని ఉన్నాం. ఇతరులు మనకు మేలు చేసిన దానిని మరచి కృతజ్ఞతలు లేని వారముగా నడుచుకున్నామా? మనకు మేలు వచ్చేవరకు వాళ్లతో ఉండి మన పని అయిపోయిన వెంటనే అక్కడి నుండి వెళ్ళిపోతున్నామా? యేసయ్య పిల్లలుగా ఇలా నడుచుకోవడం మంచిది కాదు. ఇతరులకు చేసిన చిన్న సహాయానికి కృతజ్ఞతలు చెల్లించాలి. ఇతరులు మనకు చిన్న సహాయము చేసి ఉన్నా మనం వాళ్లకు పెద్ద సహాయం చేయుటకు అవకాశాన్ని వెతకాలి.

 

యేసుక్రీస్తు ప్రభువు కృతజ్ఞత కలిగిన హృదయాన్ని ఎదురుచూస్తూ ఉన్నారు. ఆయన మనకు అనుదినము దయచేసిన జీవము, ఆరోగ్యము, బలము అని విస్తరమైన మేలులను ఆయన మనకు చేస్తూనే ఉన్నారు. వీటన్నిటికీ ఆయనకు కృతజ్ఞతలు చెల్లిస్తున్నామా? ఆలోచించి చూచి కృతజ్ఞత చెల్లించే పిల్లగా జీవించుటకు ప్రయాస పడండి. ఓకేనా!

- బ్రదర్. ఎల్. ప్రభాకరన్.

 

*Whatsapp*

ఈ దిన ధ్యాన సందశమును తమిళ్, ఇంగ్లీష్ , హిందీ, మలయాళం, తెలుగు, కన్నడ, పంజాబీ మరియు ఒరియా బాషలలో వాట్సాప్ త్వరా పొందుటకు *+91 94440 11864* అనే నెంబర్ ను సంబ్రదించగలరు.

 

www.vmm.org.in

ఈమెయిల్: info@vmm.org.in

Android App: https://play.google.com/store/apps/details?id=com.infobells.vmmorgin

 

విలేజ్ మిషనరీ మూమెంట్, విరుదునగర్, ఇండియా- 626001

ప్రార్ధనా అవసరాల కోసం: +91 94424 93250



hacklink satın al holiganbet giriş holiganbet casibom bets10 extrabet royalbet süperbetin casibom giriş casibom jojobet giriş casibom milanobet piabellacasino betpas bahiscasino atlasbet betpas casinoroyal bahiscasino ngsbahis betplay holiganbet jojobet casibom holiganbet jojobet casibom vaycasino romabet