Village Missionary Movement         கிராம மிஷனரி இயக்கம்

దిన ధ్యానము(Telugu) 30.08.2024
Share:

By Village Missionary Movement

Friday, 30-Aug-2024

దిన ధ్యానము(Telugu) 30.08.2024

 

అంశం: మీరు కూడా శిష్యులే 

 

"ఇందుకు మీరు పిలువబడితిరి.క్రీస్తుకూడ మీ కొరకు బాధపడి, మీరు తన అడుగుజాడలయందు నడుచుకొనునట్లు మీకు మాదిరి యుంచి పోయెను" - 1 పేతురు 2:21

 

సేవకుల కుటుంబ ఒకటి కాశ్మీర్ రాష్ట్రమునకు పరిచర్య చేయుటకు బయలుదేరి వెళ్లారు కానీ వారికైతే అక్కడ ఉన్న భాష రాదు. ఇంటిలో ఉండి ప్రార్థన చేసి బైబిలు చదివి హిందీ భాషను నేర్చుకున్నారు. ఒకరోజు రాత్రి ఒక పెద్దాయన ఒకరు వాళ్ళ ఇంటికి వచ్చి ఆ సేవకునీ ఇంటి తలుపు కొట్టి పిల్లలు పెట్టే పరిస్థితిలో ఉన్న నా మేక అడవిలోనికి వెళ్ళిపోయింది మీరు ప్రార్థన చేస్తారా అని అడిగాడు. ఆ మేక సురక్షితంగా వచ్చేటట్లు ప్రార్థించండి అని చెప్పి వెళ్లిపోయాడు. ఆ సేవకుడు మేకే కదా అని అశ్రద్ధ చేయకుండా ఆ రాత్రంతా ప్రార్థన చేశాడు. మరుసటి రోజు ఆ పెద్దాయన ఇంటి తలుపు కొట్టి సంతోషముతో క్రూర మృగాలు ఉంటున్న ఈ అడవిలో నా యొక్క మేక పిల్లలు పెట్టి సురక్షితంగా పిల్లలతో ఇంటికి వచ్చింది ఇక నేను యేసయ్యను నా సొంత రక్షకునిగా అంగీకరిస్తాను అని చెప్పాడు.

 

కొత్త నిబంధన గ్రంథంలో పౌలుగా మారిన సౌలు గురించి మనం వింటున్నాం. ఈయన కూడా స్టెఫనును హత్య చేసిన గుంపులో ప్రాముఖ్యమైన వాడివి ఉన్నాడు. అలానే క్రైస్తవులను హింసించే వారిలో ప్రాముఖ్యమైన వాడుగా ఉన్నాడు. అటువంటి సౌలును ప్రభువు ఒకరోజు దర్శించారు. వెంటనే సౌలు రక్షింపబడి ఎంత మాత్రం ఆలస్యం చేయకుండా బాప్తీస్ పొంది యేసయ్యను ప్రకటించడం ప్రారంభించాడు. సంఘాన్ని హింసించిన సౌలు పౌలుగా మారాడు గొప్ప ఉజ్జీవం ఏర్పడింది.

 

ప్రియమైన వారలారా పరిస్థితులు అనుకూలముగా లేదు అని పరిచర్య చేయుటకు సువార్త ప్రకటించుటకు తడబడుతున్నారా? భాష రాని స్థలంలో కూడా అననుకూలమైన పరిస్థితిలో కూడా దేవుడు తన పనిని చేస్తూనే ఉన్నారు. తగిన సమయంలో పరిస్థితులను ఆయనే బాగు చేసి కార్యాలను సరిచేస్తారు. ప్రభువు మాటకు వ్యతిరేకించకుండా లోబడి ఆయన యొక్క నడిపింపు ప్రకారం ముందుకు వెళ్ళండి. అద్భుతాలు జరుగుతాయి మార్పులు వస్తాయి. దేవుడు నామము మహిమ పరచబడుతుంది. దేవుడు మిమ్మల్ని వాడుకుంటారు ఆయన హస్తములో ప్రభువా మీ చిత్తానుసారముగా నన్ను వాడుకోరండి అని మనల్ని మనం సమర్పించుకున్నప్పుడు యేసయ్యను వెంబడిస్తున్న మన ద్వారా అనేకులు శిష్యులుగా మార్చుట ఆయనకు సులువైన కార్యం. ఆయన అడుగుజాడలు వెంబడిస్తున్న మనం ఆయన వలె మారుదాం అనేకులను శిష్యులుగా చేద్దాం.

- సిస్టర్. ఎస్తేరు సెల్వి గారు. 

 

ప్రార్థన అంశం:-

మన మిషనరీల పిల్లల యొక్క స్కూల్ ఫీజులు కట్టుటకు ఆర్థిక అవసరతలు సంధింపబడేటట్లు ప్రార్థిద్దాం.

 

*Whatsapp*

ఈ దిన ధ్యాన సందశమును తమిళ్, ఇంగ్లీష్ , హిందీ, మలయాళం, తెలుగు, కన్నడ, పంజాబీ మరియు ఒరియా బాషలలో వాట్సాప్ త్వరా పొందుటకు *+91 94440 11864* అనే నెంబర్ ను సంబ్రదించగలరు.

 

www.vmm.org.in

ఈమెయిల్: info@vmm.org.in

Android App: https://play.google.com/store/apps/details?id=com.infobells.vmmorgin

 

విలేజ్ మిషనరీ మూమెంట్, విరుదునగర్, ఇండియా- 626001

ప్రార్ధనా అవసరాల కోసం: +91 94424 93250



hacklink satın al