Village Missionary Movement         கிராம மிஷனரி இயக்கம்

దిన ధ్యానము(Telugu) 29.08.2024
Share:

By Village Missionary Movement

Thursday, 29-Aug-2024

దిన ధ్యానము(Telugu) 29.08.2024

 

అంశం: కలిసిపోకుండా జాగ్రత్త పడుడి 

 

"నేను మీతో చెప్పినమాట యిదేమీరు వారి భూమిని స్వాస్థ్య ముగా పొందుదురు; అది, అనగా పాలు తేనెలు ప్రవ హించు ఆ దేశము, మీకు స్వాస్థ్యముగా ఉండునట్లు దాని మీకిచ్చెదను. జనములలోనుండి మిమ్మును వేరుపరచిన మీ దేవుడనైన యెహోవాను నేనే" - లేవీయకాండము 20:24

 

ఒక ఆడవిలో కప్ప ఎలుక స్నేహితులుగా ఉండేవారు. వారి యొక్క స్నేహము ఎంతవరకు అంటే ఒక తాడుని ఇటువైపు కప్ప మరొకవైపు ఎలుక మెడకు కట్టుకొని ముడి వేసుకొని ఎప్పుడు అడవి చుట్టూ తిరుగుతూ ఉండేవి. వర్షాకాలం వచ్చింది అడవిలో గల చెరువులన్నీ కూడా నీటితో నిండాయి. నీటిని చూచిన వెంటనే కప్ప తన స్నేహితుడైన ఎలుకను మరిచిపోయి ఆ చెరువులో దూకి అటు ఇటు ఈత కొట్టడం ప్రారంభించింది. కానీ తాడు అవతల వైపు కట్టబడి ఉన్న ఎలుక యొక్క పరిస్థితి చాలా ఇబ్బందికరంగా మారింది చివరకు ఊపిరి ఆడిక చచ్చిపోయింది. చచ్చిన ఎలుకను చూచిన ఒక గ్రద్ద ఆ ఎలుకను పట్టుకొని వెళ్ళాలి అని తీసుకొని వెళ్ళినప్పుడు ఆ కప్ప కూడా గ్రద్దకు ఆహారంగా మారిపోయింది. బుద్ధిలేని స్నేహం వలన వచ్చిన ప్రమాదం ఇది.

 

ఈ లోకములో మనము జీవించినప్పటికీ మనము ఈ లోకానికి చెందిన వారము కాము. మనం వేరుపరచబడిన వారం. మనము ఏ విధముగా యేసుక్రీస్తు ప్రభువు యొక్క రక్తము చేత కడగబడ్డామో అలానే లోకాన్ని విడిచి వేరుపరచబడిన జీవితంలోనికి వచ్చాము. ఎలా జీవిస్తున్నారు అని దేవుడు మనల్ని విడిచిపెట్టకుండా ఆయన ప్రేమలోనికి మనలను లాక్కున్నారు. మనము దేవుడి జనాంగముగా ఆయన నామ మహిమ కొరకు వేరు పరచబడిన జీవితం జీవించడానికి పిలవబడి ఉన్నాం.

 

ఈ దిన లేఖన భాగంలో ప్రభువు అబ్రహాము జీవితంలో వేరుపరిచిన కార్యాన్ని చదివాం. ఏ ఏ కార్యాల నుండి దేవుడు అబ్రహామును వేరుపరిచారు అంటే మొట్టమొదటిగా ఆయన దేశము నుండి రెండవది ఆయన జనాంగము నుండి మూడవది తండ్రి ఇంటి నుండి ఆయనను వేరుపరిచారు. దీని గల కారణం ఏమిటి? ఆ సమాజము ఆయనను మలినము చేయగలదు కాబట్టి బబులోను దేశం నుండి వేరు పరచబడినవాడుగా బయటికి రావాలి అని దేవుడు బయటకు తీసుకువచ్చారు. దేవుని పిల్లలు లోకముతో కలిసి పోకూడదు దానియేలు, యోసేపు వేరు పరచబడిన జీవితంలో జీవించి దేవుడిచ్చిన ఆశీర్వాదం పొందుకున్నారు.

 

 ప్రియమైన దేవుని పిల్లలారా దీన్ని చదువుతున్న మీరు కూడా దేవుని చేత ఎంపిక చేయబడి ఏర్పరచబడినవారం. మనం జీవిస్తున్న ఈ దినాలలో మన ఆత్మను మలినము చేయగలిగిన కార్యాలు మన చుట్టూ అనేకం ఉన్నాయి. ఈ సమాజంలో కనబడుతున్న అన్ని కార్యాలు సాతాను యొక్క ఉచ్చులో పడవేసే కార్యాలు అన్నింటిలో మనం చిక్కుకొనకుండా వేరుపరచబడిన ఒక జీవితం మనలో కనబడాలి అని దేవుడు కోరుకుంటున్నారు. దీనిని గ్రహించిన వారుగా ఈ దినమే మన జీవితాన్ని యేసయ్య కొరకు సాక్షిగా జీవించుటకు కన్నీరుతో సమర్పిద్దాం. ఆయన ఇచ్చే ఆశీర్వాదమును పొందుకొనుటకు సిద్ధపడదాం. 

- శ్రీమతి. జబఖని శేఖర్ గారు.

 

ప్రార్థన అంశం:-

ఆకలి గల వారికి ఆహారం ఇచ్చే పరిచర్యలో లబ్ధి పొందుకుంటున్న వారు దేవుని ప్రేమను రుచి చూచేటట్లు ప్రార్థిద్దాం.

 

*Whatsapp*

ఈ దిన ధ్యాన సందశమును తమిళ్, ఇంగ్లీష్ , హిందీ, మలయాళం, తెలుగు, కన్నడ, పంజాబీ మరియు ఒరియా బాషలలో వాట్సాప్ త్వరా పొందుటకు *+91 94440 11864* అనే నెంబర్ ను సంబ్రదించగలరు.

 

www.vmm.org.in

ఈమెయిల్: info@vmm.org.in

Android App: https://play.google.com/store/apps/details?id=com.infobells.vmmorgin

 

విలేజ్ మిషనరీ మూమెంట్, విరుదునగర్, ఇండియా- 626001

ప్రార్ధనా అవసరాల కోసం: +91 94424 93250



hacklink satın al