Village Missionary Movement         கிராம மிஷனரி இயக்கம்

దిన ధ్యానము(Telugu) 28.08.2024
Share:

By Village Missionary Movement

Wednesday, 28-Aug-2024

దిన ధ్యానము(Telugu) 28.08.2024

 

అంశం: సంతృప్తిగా ఉండుటకు ప్రార్థన 

 

"నాకు కొదువ కలిగినందున నేనీలాగు చెప్పుటలేదు; నేనేస్థితిలో ఉన్నను ఆస్థితిలో సంతృప్తి కలిగియుండ నేర్చుకొనియున్నాను" - ఫిలిప్పీయులకు 4:11

 

పరిశుద్ధుడైన మా ప్రేమగల ప్రభువా మీరు మనుషులకి ఇచ్చిన అనేక గుణాతిశయాలలో సంతృప్తి ఒకటి. అందుకొరకు మీకు కోట్ల కొలది కృతజ్ఞతా స్తుతులు చెల్లిస్తున్నాను. పౌలు తన జీవితంలో ఎప్పుడు సంతృప్తిగా ఉండుటకు నేర్చుకున్నాను అని రాస్తున్నారు కానీ మీ సహాయము లేకుండా మేము ఏమీ చేయలేము అని అంటున్నాడు. యోబు యొక్క జీవితంలో అనేక సమస్యల గుండా ఆయన నడిచి వెళ్లినప్పటికీ ఆయన ఎలాంటి తడబాటు లేకుండా దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాడు. దేవుడు మనకు ఏమి ఇచ్చినను మనము దానిని మిక్కిలి సంతృప్తిగలవారుగా పొందుకోవాలి అన్నదే ఆయన జీవితంలో నుండి నేర్చుకుంటున్నాం మరియు మేము ఎలాంటి పరిస్థితి అయినా మీకు కృతజ్ఞత స్తుతులు చెల్లించే వారముగా ఉంటాము అని పౌలు నేర్పిస్తున్నారు. ఇదే మీ చిత్తమై ఉన్నది అని మేము గ్రహించి ఉన్నాము. మేము ఎటువంటి పరిస్థితులలోనైన సంతోషంగా ఉండాలని మీరు ఆశ కలిగి ఉన్నారు.

 

ఇలాంటి జీవితం జీవించుటకు మీ కుమారుడైన యేసుక్రీస్తు ప్రభువు యొక్క కృప మాకు చాలా అవసరం. ఆయన మమ్మల్ని బలపరిస్తేనే తప్ప ఈ కార్యాలను మేము చేయలేము. అన్ని పరిస్థితుల్లోనూ మమ్మల్ని బలపరిచినవారు ఆయన మాత్రమే. పరిశుద్ధాత్ముడు ఎప్పుడూ మమ్మల్ని పరిపాలిస్తూ ఉండాలి. 

 

అపోస్తులుడైన పౌలుకు కూడా ఒక ముళ్ళు తన శరీరంలో ఉండేది. అదేవిధంగా దానితోపాటు నీ కృప కూడా ఆయనకి విస్కారంగా ఇచ్చారు అందువల్ల ఆయన మీ వద్ద నుండి మీ ప్రసన్నతను దయను బలాన్ని పొందుకున్నారు. మా జీవితంలో మాకు వచ్చే కష్టాలు కన్నీటి పరిస్థితులు వీటన్నింటినీ నుండి దేవుని పిల్లలమైన మాకు మేలుకొరకే మీరు చేస్తున్నారు అని గ్రహించెదము.

 

బైబిల్లో అనేక ఉపమానాలు మనకు బోధిస్తున్నాయి అపోస్తులుడైన పౌలు చెరసాలలో బంధించబడినప్పుడు సంతృప్తి గలవాడిగా నిన్న స్తుతించి పాడుతున్నప్పుడు ఆ విధముగా పాడే కృపను మీరు అతనికి అనుగ్రహించారు. పేతురు చెరసాలలో ఎలాంటి చింత లేకుండా ప్రశాంతంగా నిద్ర పోవడానికి కృపని ఇచ్చారు. ఓడ ప్రమాదం వచ్చినప్పటికీ పౌలు సంతృప్తితో ప్రశాంతంగా ఉండి ఇతరులను బలపరుస్తూ ఎలాంటి కొదవ లేకుండా ఒడ్డుకు చేరుటకు కృప చూపించారు. యోసేపు అన్ని పరిస్థితుల్లో సంతృప్తితో పని చేశారు ఆయనతో మీ కృప ఉండేది. చివరికి మీరు ఆయన హెచ్చించి ఘనపరిచారు. మేము ఇలాంటి సంతృప్తి గల జీవితము జీవించుటకు మాకు కూడా బలాన్ని దయచేయండి. యేసుక్రీస్తు నామములో ఈ ప్రార్థన అడుగుతున్నాము మా ప్రియ ప్రభువా. ఆమెన్!

- బ్రదర్. కే. ఎం. ప్రసాద్ గారు 

 

ప్రార్థన అంశం:-

మోక్ష ప్రయాణము ఈ సంచిక చదువుతున్న వ్యక్తుల జీవితంలో వారందరూ దేవుని కొరకు పనిచేసే వ్యక్తులుగా మారేటట్లు ప్రార్థిద్దాం.

 

*Whatsapp*

ఈ దిన ధ్యాన సందశమును తమిళ్, ఇంగ్లీష్ , హిందీ, మలయాళం, తెలుగు, కన్నడ, పంజాబీ మరియు ఒరియా బాషలలో వాట్సాప్ త్వరా పొందుటకు *+91 94440 11864* అనే నెంబర్ ను సంబ్రదించగలరు.

 

www.vmm.org.in

ఈమెయిల్: info@vmm.org.in

Android App: https://play.google.com/store/apps/details?id=com.infobells.vmmorgin

 

విలేజ్ మిషనరీ మూమెంట్, విరుదునగర్, ఇండియా- 626001

ప్రార్ధనా అవసరాల కోసం: +91 94424 93250



hacklink satın al holiganbet giriş holiganbet casibom bets10 extrabet royalbet süperbetin casibom giriş casibom jojobet giriş casibom milanobet piabellacasino betpas bahiscasino atlasbet betpas casinoroyal bahiscasino ngsbahis betplay holiganbet jojobet casibom holiganbet jojobet casibom vaycasino romabet