Village Missionary Movement         கிராம மிஷனரி இயக்கம்

దిన ధ్యానము(Telugu) 26.08.2024
Share:

By Village Missionary Movement

Monday, 26-Aug-2024

దిన ధ్యానము(Telugu) 26.08.2024

 

అంశం: మీ యొక్క విలువ ఎంత 

 

"అమూల్యమైన రక్తముచేత, అనగా నిర్దోషమును నిష్కళంకమునగు గొఱ్ఱెపిల్లవంటి క్రీస్తు రక్తముచేత, విమోచింపబడితిరని మీరెరుగుదురు గదా" - 1 పేతురు 1:19

 

క్రీస్తుపూర్వం 75లో జూలియస్ సీజర్ అనే రోమా ప్రధానిని ధనము కొరకు పట్టుకుని వెళ్లిపోయారు అని ఒక కథ చెబుతారు. ఆయనను విడిపించుటకు 20 తలాంతులు వెండి అడిగారు. దానిని ఎరిగిన సీజర్ ఆ మొత్తం ధనాన్ని వెయ్యి తలాంతులుగా పెంచమని చెప్పాడు. ఎందుకు అంటే ఆయన విలువ 20 తలాంతులు కాదు గొప్ప వెలగలిగిన వారు అనేదాన్ని గ్రహించి ఉన్నారు. ఆయనను పట్టుకుని వెళ్లిన వారైతే ఆయన ఎవరు అనేదాన్ని గ్రహించలేదు.

 

సీజర్ గర్వముతో తన విలువను పెంచుకుంటే మరి దేవుడు మన ప్రతి ఒక్కరి మీద పెట్టుకున్న విలువకు ఎంత పెద్ద వ్యత్యాసం ఉండాలో. మన విలువను డబ్బుతో కొలవడం వీలుపడదు. మన పరమ తండ్రి మన కొరకు ఏమి చేశారు అనే కార్యమే మనలను విలువ కలిగినదిగా చేస్తుంది.

 

దేవుడు ఎలాంటి వెల చెల్లించి మనలను రక్షించారు తన ఏకైక కుమారుడిని సిలువలో సజీవ యాగముగా అర్పించి మన పాపము నుండి శాపము నుండి రక్షించుటకు తండ్రి అయిన దేవుడు వెల చెల్లించారు. మీ యొక్క పితరలు వారు అనుసరించి వచ్చిన వ్యర్థమైన నడతల నుండి, నశించిపోవు వస్తువులైన వెండి, బంగారం చేత మీరు రక్షింప బడకుండా నిష్కలంకమైన గొర్రెపిల్ల అనే క్రీస్తు విలువ కలిగిన రక్తము చేత మీరు రక్షింపబడి ఉన్నారు అనేదాన్ని గ్రహించండి.

 

ప్రియమైన వారలారా! దేవుడు మన మీద పెట్టుకున్న ఎనలేని ప్రేమను తన ఏక కుమారుడిని సిలువ మరణము ద్వారా ఆయన రక్తాన్ని మన కొరకు వెలగా చెల్లించి మనలను రక్షించి మరణాన్ని జయించి తిరిగి లేచారు. అంతగా మీరు విలువ కలిగిన వారు. తన యొక్క విలువను డబ్బులో చూపించారు కానీ మన విలువను భూమి ఆకాశం సృష్టించిన యేసుక్రీస్తు మనలను రక్షించుటకు తన రక్తాన్ని చెల్లించారు కాబట్టి మిమ్మల్ని మీరు తక్కువగా అంచనా వేయకండి. మీ యొక్క విలువను గ్రహించండి మీరు విలువ కలిగిన వారు. హల్లెలూయ!

- సిస్టర్. ఏ. బ్యూలా గారు 

 

ప్రార్థన అంశం:-

ఆకలి గలిగిన వారికి ఆహారం ఇచ్చే పరిచర్యలో ప్రయోజనం పొందుతున్న వారు దేవుని ప్రేమను రుచి చూచేటట్లు ప్రార్థిద్దాం.

 

*Whatsapp*

ఈ దిన ధ్యాన సందశమును తమిళ్, ఇంగ్లీష్ , హిందీ, మలయాళం, తెలుగు, కన్నడ, పంజాబీ మరియు ఒరియా బాషలలో వాట్సాప్ త్వరా పొందుటకు *+91 94440 11864* అనే నెంబర్ ను సంబ్రదించగలరు.

 

www.vmm.org.in

ఈమెయిల్: info@vmm.org.in

Android App: https://play.google.com/store/apps/details?id=com.infobells.vmmorgin

 

విలేజ్ మిషనరీ మూమెంట్, విరుదునగర్, ఇండియా- 626001

ప్రార్ధనా అవసరాల కోసం: +91 94424 93250



hacklink satın al holiganbet giriş holiganbet casibom bets10 extrabet royalbet süperbetin casibom giriş betcio jojobet giriş casibom milanobet piabellacasino betpas bahiscasino atlasbet betpas casinoroyal bahiscasino ngsbahis betplay holiganbet jojobet casibom holiganbet jojobet casibom vaycasino romabet