Village Missionary Movement         கிராம மிஷனரி இயக்கம்

దిన ధ్యానము(Telugu) 25.08.2024 (Kids Special)
Share:

By Village Missionary Movement

Sunday, 25-Aug-2024

దిన ధ్యానము(Telugu) 25.08.2024 (Kids Special)

 

అంశం: వెస్లీ యొక్క ప్రార్థన 

 

ప్రత్యేకముగా చిన్న పిల్లల కొరకు

 

"మన పాపములను మనము ఒప్పుకొనిన యెడల, ఆయన నమ్మదగినవాడును నీతిమంతుడును గనుక ఆయన మన పాపములను క్షమించి సమస్త దుర్నీతినుండి మనలను పవిత్రులనుగా చేయును" - 1 యోహాను 1:9

 

హలో పిల్లలు సండే అంటే సంతోషమే కదా? ప్రతి ఆదివారము ఒక కథ వినడం చాలా ఇష్టమే కదా! ఈ దినము ఒక దొంగ ఎలా మారాడో నిజ సంఘటన విందామా? జాన్ వెస్లీ పరిచర్య నిమిత్తముగా తరచుగా వేరే ఊరికి వెళుతూ ఉండేవాడు. అలా ఒక దినం పరిచర్య చేసి ఇంటికి తిరిగి వస్తున్నారు. రాత్రి సమయంలో మనుషులు ఎవరూ లేని సమయంలో ఒక దొంగ ఒక కత్తిని చూపించి బెదిరించి మీ వద్ద ఉన్న డబ్బులు అన్ని నాకు ఇవ్వు అని అడ్డుపడ్డాడు. వెంటనే జాన్ వెస్లీ తన వద్ద ఉన్న డబ్బుని ఆయనకి ఇచ్చేశారు. అప్పుడు జాన్ వెస్లీ ఆ దొంగతో నువ్వు ఒక రోజు ఈ వృత్తిని చేయుటకు చాలా బాధపడతావ్ అప్పుడు యేసయ్య దగ్గరకు రా నీ పాపం క్షమించి నూతన జీవితాన్ని దయచేస్తారు అని అన్నారు. ఆ దొంగ దొరికే వరకు లాభమే అని తలంచి ఏమీ మాట్లాడకుండా వెళ్ళిపోయాడు.

 

జాన్ వెస్లీ ఆ దొంగ కొరకు ప్రార్థన చేస్తూ ఉన్నాడు. ఆ దొంగ తన దొంగతనాన్ని చేస్తూ ఒక దినం పడుకున్నప్పుడు అనేకుల యొక్క ఏడుపు స్వరము వాళ్ళ నోటి నుండి వచ్చే శాపములు విని హఠాత్తుగా లేచాడు. తర్వాత ఆయన పడుకోలేక పోయాడు. ఇలా దొంగతనం చేసి అనేకమంది కన్నీరు కార్చుటకు నేను కారకుడను అయ్యాను నేను జీవించుటకు అర్హుడను కాను అని తలంచారు. అప్పుడు జాన్ వెస్లీ చెప్పిన మాటలు ఆయన హృదయంలోనికి వచ్చాయి. యేసయ్య వద్దకు రా మీ పాపాన్ని ఆయన క్షమిస్తారు అనే మాట మరల మరల వినబడేది. వెంటనే యేసయ్య నా పాపాలు క్షమించండి అని అడగడం మొదలుపెట్టాడు. తన మనస్సుకు గుర్తుకు వచ్చిన తన పాపములు అన్నింటిని యేసయ్య వద్ద చెప్పడం ప్రారంభించాడు. కొంత సమయం తర్వాత తన హృదయంలో సంతోషం మొదలైంది. చర్చికి వెళ్లడం ప్రారంభించాడు. స్నేహితులు సహాయంతో చిన్న వ్యాపారం ప్రారంభించాడు. జాన్ వెస్లీ మాట్లాడిన కూడికలో పాల్గొని ఆయనను కలిశాడు. ప్రభువు ఆయనను ఎలా దర్శించారో ఆ విధానాన్ని చెప్పి సంతోషించారు. జాన్ వెస్లీ అయితే నా ప్రార్ధన వ్యర్ధం కాలేదు అని దేవుని స్తుతించారు.

 

చూసారా పిల్లలు ఇదే మారుమనస్సు. దొంగ మారుమనస్సు పొందడానికి జాన్ వెస్లీ యొక్క ప్రార్థన కారణమైంది. అలానే మీరు కూడా ప్రార్థన చేస్తే అనేకులు క్రీస్తు యొద్దకు రావడానికి సులువు అవుతుంది. కాబట్టి ప్రార్థించడం మానకూడదు. మరవకుండా ప్రార్థిస్తారా? కచ్చితంగా ప్రార్థించాలి ఓకేనా! 

- శ్రీమతి. అన్బు జ్యోతి స్టాలిన్ గారు

 

*Whatsapp*

ఈ దిన ధ్యాన సందశమును తమిళ్, ఇంగ్లీష్ , హిందీ, మలయాళం, తెలుగు, కన్నడ, పంజాబీ మరియు ఒరియా బాషలలో వాట్సాప్ త్వరా పొందుటకు *+91 94440 11864* అనే నెంబర్ ను సంబ్రదించగలరు.

 

www.vmm.org.in

ఈమెయిల్: info@vmm.org.in

Android App: https://play.google.com/store/apps/details?id=com.infobells.vmmorgin

 

విలేజ్ మిషనరీ మూమెంట్, విరుదునగర్, ఇండియా- 626001

ప్రార్ధనా అవసరాల కోసం: +91 94424 93250



hacklink satın al