Village Missionary Movement         கிராம மிஷனரி இயக்கம்

దిన ధ్యానము(Telugu) 24.08.2024
Share:

By Village Missionary Movement

Saturday, 24-Aug-2024

దిన ధ్యానము(Telugu) 24.08.2024

 

అంశం: మోక్ష ప్రయాణం 

 

"సీయోనూ, లెమ్ము లెమ్ము, నీ బలము ధరించుకొనుము పరిశుద్ధ పట్టణమైన యెరూషలేమా, నీ సుందర వస్త్ర ములను ధరించుకొనుము ఇకమీదట సున్నతిపొందని వాడొకడైనను అపవిత్రుడొకడైనను నీ లోపలికి రాడు" - యెషయా 52:1

 

అలంకరణ వస్త్రాలు నేను ఎందుకు ధరించుకోవాలి? అనే ప్రశ్న మన లోపల వస్తూ ఉంటుంది. చెప్తున్నాను శ్రద్ధగా వినండి. మోక్ష ప్రయాణము అనే జీవిత ప్రయాణంలో మన వరుణ్ణి దర్శించుటకు సిద్ధపడుతున్న ప్రతి ఒక్కరము యేసయ్య యొక్క వధువులమే. అనుదిన జీవితంలో మన శరీరాన్ని అలంకరిస్తున్నాం కానీ మన వరుడు అంతరంగంలో గల జీవితం ఎలా ఉంటుంది అని చూస్తున్నారు. అందుకు మనం ఏమి చేయాలి అని చూద్దాం.

 

నూతన వ్యక్తిని ధరించుకొనుడి కావున మునుపటి ప్రవర్తన విషయంలోనైతే మోసకరమైన దురాశ వలన చెడిపోవు మీ ప్రాచీన స్వభావమును విడిచిపెట్టి మీ చిత్తవృత్తి యందు నూతన పరచబడిన వారై నీతియు యదార్థమైన దేవుని పోలికగా సృష్టింపబడిన వారముగా నవీన స్వభావమును ధరించుకొనవలెను (ఎఫెసీయులకు రాసిన పత్రిక 4:22-24) వాక్యానుసారముగా మనలను మనం పరిశీలించి చూసుకుందాం. నేను నూతన మనిషిగా ఉన్నానా లేక పాత మనిషిగా ఉన్నానా ఈ వాక్యానుసారముగా మిమ్మల్ని మీరే పరీక్షించుకొని చూడండి. ఈ దిన లేఖన భాగంలో కొన్ని శరీరానుసారమైన కార్యాలను చూద్దాం. మన పాపాలన్నీ కూడా మనము ఒప్పుకొనిన యడల యేసుక్రీస్తు ప్రభువు యొక్క రక్తము చేత కడగబడి నూతన మనిషిగా ఆత్మీయ ఫలాలు ఇవ్వగలిగిన వారుగా మారుద్దాం.

 

వస్త్రములను కాపాడుకొనుడి ఇదిగో దొంగ వస్తున్నట్లు వస్తున్నాను తన శరీరమును కాపాడుకొనుటకు మెలకువ కలవాడు తన వస్త్రములు కాపాడుకొనువాడు ధన్యుడు (ప్రకటన 16: 17). సాధారణంగా దిగంబరము అన్నది పాపాన్ని చూపిస్తుంది. సాతాను వలన వస్తున్న పాపాన్ని తెగింపు వల్ల చేస్తున్న పాపము ద్వారా మనలను దిగంబరలుగా చేసి మన రక్షణ వస్త్రములను మురికిగా చేస్తున్నాడు. మనము దాన్ని కాపాడుకోవాలి. మనదేశంలో కూడా మణిపూర్ రాష్ట్రంలో దేవుని పిల్లలు దిగంబరులుగా వస్త్రములు తీసివేయబడిన పరిస్థితికి వచ్చారు. అయినప్పటికీ వారు శరీరానుసారమైన వస్త్రాలు లేకపోయినప్పటికీ ఆత్మీయ వస్త్రాలు కోల్పోలేదు అని వారు ధైర్యంగా నిలబడ్డారు.

 

పరమ నివాస స్థలమును ధరించుకుందాం. భూలోకపు గుడారము వంటి మన ఇల్లు ప్రధానమైనప్పటికీ దేవుని చేత కట్టబడని చేతి పని లేని నిత్యపు గృహాలు పరలోకంలో మన కొరకు సిద్ధం చేయబడి ఉన్నాయని గ్రహిద్దాం. ఎందుకంటే ఈ గుడారంలో మనము విలపిస్తూ మన పరమ నివాస స్థలమును ధరించుకొనుటకు ఆసక్తి గలవారమై ఉందాం. 

 

ప్రియమైన వారలారా మన యొక్క ఆసక్తి దేనిపై ఉన్నది? భూమి మీద గల మాయా రూపం కలిగి మనుషులతో ఉన్నదా? ఆస్తి, ఉన్నత హెచ్చింపులు, అత్యాశ అనే లోకానుసారమైన కార్యముల మీద మనసు ఉన్నదా లేదా దేవునికి ప్రియమైన కార్యాలు చేసి మన మోక్ష ప్రయాణము శ్రద్ధగా వెళ్లే వారముగా కనబడుతున్నామా? ఆలోచిద్దాం.

- శ్రీమతి. సెల్వ మేరీ డేనియల్ గారు 

 

ప్రార్థన అంశం:-

అన్ని ఫీల్డ్ ల్లో చైన్ ప్రేయర్ ఆటంకం లేకుండా జరిగేటట్లు ప్రార్థిద్దాం.

 

*Whatsapp*

ఈ దిన ధ్యాన సందశమును తమిళ్, ఇంగ్లీష్ , హిందీ, మలయాళం, తెలుగు, కన్నడ, పంజాబీ మరియు ఒరియా బాషలలో వాట్సాప్ త్వరా పొందుటకు *+91 94440 11864* అనే నెంబర్ ను సంబ్రదించగలరు.

 

www.vmm.org.in

ఈమెయిల్: info@vmm.org.in

Android App: https://play.google.com/store/apps/details?id=com.infobells.vmmorgin

 

విలేజ్ మిషనరీ మూమెంట్, విరుదునగర్, ఇండియా- 626001

ప్రార్ధనా అవసరాల కోసం: +91 94424 93250



hacklink satın al