Village Missionary Movement         கிராம மிஷனரி இயக்கம்

దిన ధ్యానము(Telugu) 23.08.2024
Share:

By Village Missionary Movement

Friday, 23-Aug-2024

దిన ధ్యానము(Telugu) 23.08.2024

 

అంశం: నాలో నిలిచి ఉండుడి 

 

"నాయందు మీరును మీయందు నా మాటలును నిలిచియుండినయెడల మీకేది యిష్టమో అడుగుడి, అది మీకు అనుగ్రహింపబడును" - యోహాను 15:7

 

బైబిల్ సులువుగా దొరకని కాలంలో 14 సంవత్సరాలు వయసుగల మేరి జోన్స్ అనే చిన్నారి దేవుని ఆలయం పైన ఆసక్తి కలదిగాను అలానే బైబిల్ పైన ఆసక్తి కలిగి ఉండేది. తన కొరకు ఒక బైబిల్ కొనుక్కోవాలి అని స్కూల్ నుండి వచ్చిన వెంటనే కోడిగుడ్లను అమ్మి, వస్త్రాలను ఇస్త్రీ చేస్తూ ఆరు సంవత్సరాలుగా డబ్బులు సమకూర్చింది. కొత్త బైబిల్ కొనాలి అని డబ్బులు తీసుకుని చాలా కఠినమైన మార్గం గుండా కొండా ప్రాంతమునకు వెళ్లి 50 మైళ్ళ దూరం నడిచి థామస్ చార్లెస్ అనే బోధకుని వద్దకు వెళ్లి వేల్స్ బాషలో ఉన్న బైబిల్ ను తీసుకున్నది. దానిని చక్కగా నేర్చుకోవడంతోపాటు తన గ్రామ ప్రజలకు నేర్పించి అనేకులను ప్రభువు లోనికి నడిపించింది. బైబిల్ సంస్థ ప్రారంభించబడుటకు అనేక భాషలలో బైబిల్ ముద్రించుటకు ఈ మేరీ జోన్స్ అనే చిన్నారే కారణంగా ఉండేది.

 

బైబిల్లో కూడా బెరాయ పట్టణవాసులు ఆసక్తితో దేవుని వాక్యాన్ని అంగీకరించి లేఖన భాగములు పరిశోధించి చూచుట వలన ఘనులుగా ఉన్నారు. అందువలన వారిలో అనేకులు ఘనులై గ్రీకులు, అనేక మంది స్త్రీలు, పురుషులు విశ్వాసముంచారు. అవును ఈ దినము అనేకమంది దేవుని దాసులు యొక్క సందేశాలను సోషల్ మీడియా ద్వారా వింటూ ఉన్నాం కానీ వాటన్నింటినీ బైబిల్ ద్వారా వాక్యానుసారముగా వున్నాయా అని నిదానించి చూసి మాత్రమే మనము దేవునితో క్రైస్తవ జీవితంలో నిలిచి ఉండగలం. ఆయనతో విజయవంతముగా జీవించగలం లేనియెడల గాలికి ఇటుఅటు కదిలే విధంగా ఉండిపోతాం.

 

అవును ప్రియమైన వారలారా! మనము కూడా బైబిలు చదువుటకు ధ్యానించుటకు ఆసక్తి కలిగిన వారుగా ఉండినప్పుడు మనం ఫలబరితమైన జీవితం జీవించగలం. దేవుని యొక్క మార్గంలో నిలిచి ఉండాలి అంటే దేవుని యొక్క శిష్యులుగా ఉండాలి అని యోహాను సువార్త 8:31 చెపుతుంది. చివరి వరకు నిలిచి ఉన్న వారు రక్షింపబడును అని బైబిల్ మనలను హెచ్చరిస్తుంది. బైబిల్ వాక్యమునకు లోబడి దాని ప్రకారం నడుస్తున్న వారే ఆఖరి వరకు జీవించగలరు.

 

ఈ దినము మనము సెల్ ఫోన్ తో ఎంత సమయం కేటాయిస్తున్నాం? బైబిల్ ధ్యానించుటకు ఎంత సమయం కేటాయిస్తున్నాం అని లెక్క చూసిన యెడల మనం క్రీస్తులో నిలిచి ఉన్నామా లేదా అనేది మనకు తెలిసిపోతుంది.

 

మనము బెరాయ పట్టణస్తులు వలె మేరీ జోన్స్ వలే బైబిల్ పైన ఆసక్తి చూపిద్దాం. అనేకులను విశ్వాసంలోనికి నడిపిద్దాం.

- శ్రీమతి. దివ్య అలెక్స్ గారు 

 

ప్రార్థన అంశం:-

మన క్యాంపస్ లో జరుగుతున్న హాస్పిటల్ పరిచర్యకు సమర్పించబడే వైద్యులు దొరికేటట్లు ప్రార్థిద్దాం.

 

*Whatsapp*

ఈ దిన ధ్యాన సందశమును తమిళ్, ఇంగ్లీష్ , హిందీ, మలయాళం, తెలుగు, కన్నడ, పంజాబీ మరియు ఒరియా బాషలలో వాట్సాప్ త్వరా పొందుటకు *+91 94440 11864* అనే నెంబర్ ను సంబ్రదించగలరు.

 

www.vmm.org.in

ఈమెయిల్: info@vmm.org.in

Android App: https://play.google.com/store/apps/details?id=com.infobells.vmmorgin

 

విలేజ్ మిషనరీ మూమెంట్, విరుదునగర్, ఇండియా- 626001

ప్రార్ధనా అవసరాల కోసం: +91 94424 93250



hacklink satın al holiganbet giriş holiganbet casibom bets10 extrabet royalbet süperbetin casibom giriş casibom jojobet giriş casibom milanobet piabellacasino betpas bahiscasino atlasbet betpas casinoroyal bahiscasino ngsbahis betplay holiganbet jojobet casibom holiganbet jojobet casibom vaycasino romabet