Village Missionary Movement         கிராம மிஷனரி இயக்கம்

దిన ధ్యానము(Telugu) 22.08.2024
Share:

By Village Missionary Movement

Thursday, 22-Aug-2024

దిన ధ్యానము(Telugu) 22.08.2024

 

అంశం: నేను ఎలాంటి వాడను 

 

"అయితే మనలను మనమే విమర్శించుకొనినయెడల తీర్పు పొందక పోదుము" - 1 కోరింథీయులకు 11:31

 

దేవుడు బైబిల్లో అనేగా కట్టడాలను మరియు ధర్మశాస్త్రమును ఇచ్చి దీనిని నువ్వు చేయాలి దీనిని నీవు చేయకూడదు అని కచ్చితంగా చెప్పి ఉన్నారు. దాన్ని ఒకసారి ఆలోచించి చూద్దాం. ప్రభువు చెబుతున్నారు నీవు నామీద ప్రేమ కలిగి ఉంటే నేను చెప్పిన వాటికి లోబడు అవి నీకు దీవెనకరము లేనియెడల దేనినైనా నువ్వు చేసుకో కానీ శిక్ష ఏమి ఉండదు అని చెప్పారు అనుకుందాం అప్పుడు మన ఆలోచన, చూపు, మాటలు, కార్యాలు ఎలా ఉంటాయి? ఒక్క క్షణం యదార్ధముగా మనలను మనం ఆలోచించి చూద్దాం. నేను ఏ విధంగా ఉంటాను, శిక్ష లేదు కాబట్టి పాపము అని తెలిసి కూడా దాన్ని తెగించి చేస్తానా లేదా యేసుక్రీస్తు చెప్పారు అని ఆయన మీద గల ప్రేమతో నేను దాన్ని చేయకుండా ఉంటానా?

 

పరిశుద్ధ గ్రంథమైన బైబిల్లో ఐగుప్తు దేశంలో ఫరోయొక్క ప్రధాని అయినా పోతిఫర్ ఇంటిలో ఉంటున్నాడు యోసేపు. అక్కడ అతనికి సకల విధములైన అధికారులు ఇవ్వబడి ఉన్నది. ఆ ఇంటిలో అన్ని అతని లోబడి ఉండేవి. ఫోతీఫర్ భార్య తప్ప. కొన్ని దినముల తర్వాత ఫోతీఫర్ భార్య ఈయన యవ్వనస్తుడు సౌందర్యవంతుడు అని చూసి ఈయనను మోహించి ఎవ్వరు లేని సమయంలో శరీర కార్యమునకు రోజు ప్రేరేపిస్తూ ఉండేది. ఈయన దానిని తప్పించుకుని వెళ్తూ ఉండేవాడు. ఒకరోజు ఇలానే ఆయన వస్త్రములు పట్టుకొని పిలిచినప్పుడు యోసేపు తన వస్త్రములు విడిచిపెట్టి బయటకు పారిపోయాడు.

 

ఇలానే ఏదో ఒక పాపపు పరిస్థితి మనలను వెంటాడుతూ ఉన్నప్పుడు మనం ఎలా ఉంటున్నాం? లేనియెడల మనమే పాపాన్ని వెతుక్కుని వెళ్తున్నామా? నా ప్రియమైన దేవుని జనాంగమా ధర్మశాస్త్రము ఇవ్వబడనీ ఆ కాలములోనే యోసేపు దేవునికి భయభక్తులు కలవాడై కీడును తప్పించుకొని పారిపోయాడు. ధర్మశాస్త్రము మాత్రమే కాదు యేసుక్రీస్తు ప్రభువు యొక్క కట్టడలను నియమాలు కలిగిన సంపూర్ణ బైబిల్ మనకి ఇవ్వబడి ఉన్నది. దీని ప్రకారం ఆయనకు ఇష్టముగా జీవిస్తే మనకు పరలోక రాజ్యం లేనియెడల మనకు నరకం అని రాయబడి ఉంది. ఆకాశము భూమి గతించినను ఆయన మాటల్లో ఏ ఒక్క అక్షరమైనను పొల్లు అయినను గతించదు. ఇదంతా ఎరిగి నేను ఏ విధంగా ఉంటున్నాను అని ఆలోచిద్దాం మనల్ని మనము సరిదిద్దుకుందాం. 

- బ్రదర్ ఏ. సిమ్యోను గారు.

 

ప్రార్థన అంశం:-

త్రిబుల్ "సి" చైల్డ్ కేర్ చైల్డ్ ప్రణాళికలో కలిసి ఉన్న చిన్నారులు యొక్క చదువు కొరకు ప్రార్థిద్దాం.

 

*Whatsapp*

ఈ దిన ధ్యాన సందశమును తమిళ్, ఇంగ్లీష్ , హిందీ, మలయాళం, తెలుగు, కన్నడ, పంజాబీ మరియు ఒరియా బాషలలో వాట్సాప్ త్వరా పొందుటకు *+91 94440 11864* అనే నెంబర్ ను సంబ్రదించగలరు.

 

www.vmm.org.in

ఈమెయిల్: info@vmm.org.in

Android App: https://play.google.com/store/apps/details?id=com.infobells.vmmorgin

 

విలేజ్ మిషనరీ మూమెంట్, విరుదునగర్, ఇండియా- 626001

ప్రార్ధనా అవసరాల కోసం: +91 94424 93250



hacklink satın al holiganbet giriş holiganbet casibom bets10 extrabet royalbet süperbetin casibom giriş casibom jojobet giriş casibom milanobet piabellacasino betpas bahiscasino atlasbet betpas casinoroyal bahiscasino ngsbahis betplay holiganbet jojobet casibom holiganbet jojobet casibom vaycasino romabet